• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

    కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more

    ‘ఇంకా క్రికెట్‌ ఉంది’: విరాట్‌ కోహ్లీ

    ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ తన సెంచరీతో మూడేళ్ల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. అయితే ఇన్నింగ్స్‌ అనంతరం విరాట్‌కు అందరూ శుభాకాంక్షలు చెబుతున్న వేళ విరాట్‌ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘క్రికెట్‌ ఇంకా మిగిలి ఉంది’ అంటూ భువనేశ్వర్‌తో విరాట్‌ అన్నాడు. ఈ మాట మేం ఎప్పటినుంచో చెబుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/i/status/1567900196444708867

    హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌

    ఆదివారం పాకిస్తాన్‌తో మరో ఆసక్తికర సమరానికి భారత్‌ సిద్ధమవుతోంది. అందులో భాగంగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌లో ఇరగదీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ పరుగెడుతూ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతంగా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం విరాట్‌ పరుగుల్లో లీడ్‌లో ఉన్నాడు. https://youtube.com/watch?v=kxsS05yPtDg

    మాకు ఇద్దరు బౌలర్లైనా ఉన్నారు: బంగ్లాదేశ్ డైరెక్టర్‌

    ఆసియా కప్‌లో నేడు బంగ్లాదేశ్‌, శ్రీలంక రసవత్తర పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక కెప్టెన్ దసున్ శనక మాటలతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. తాజాగా శనక వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ జట్టు డైరెక్టర్‌ ఖాలిద్‌ మహ్ముద్‌ ఘాటుగా స్పందించారు. ‘ బంగ్లాదేశ్‌తో పోటీ మాకు అఫ్గానిస్తాన్‌ కన్నా సులభం. వారి జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు’ అంటూ ఇటీవల శనక కామెంట్‌ చేశాడు. దానిపై ఖాలిద్‌ స్పందిస్తూ ‘మా జట్టులో కనీసం ఇద్దరైనా ఉన్నారు. వారి జట్టులో ఒక్కరు కూడా లేరు’ … Read more

    ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. ఆరు సిక్సులు

    వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 6IXTY టోర్నమెంట్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నిలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రస్సెల్.. సెయింట్ కిట్స్ పేట్రియాట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 24 బంతుల్లోనే 72 పరుగులతో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో ట్రిన్‌బాగో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో కోసం పైన watch on బటన్‌పై క్లిక్ చేయండి. Andre Russell … Read more

    గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    జింబాంబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆటగాళ్ల ప్రాక్టిస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ దావన్ నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇతర ఆటగాళ్లతో గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. జింబాంబ్వేతో మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. లైవ్‌ స్కోర్ కోసం యూసే యాప్‌ను ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ వీడియో చూసేందుకు పైనా Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #TeamIndia ready for the … Read more