• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more

    వావ్.. వాట్ ఎ డెలివరీ..!

    [VIDEO:](url)భారత పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో నాణ్యమైన బంతులేశాడు. అయితే, ఓ కళ్లు చెదిరే బంతితో బంగ్లా బ్యాట్స్‌మన్ షాంటోని డగౌట్‌కు పంపించాడు. 151కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. బంతి వేగం, గమనాన్ని అంచనా వేసి బ్యాటుని అడ్డుపెట్టేలోపే వికెట్లను గిరాటేయడంతో షాంటో అవాక్కయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ పదునుకు కచ్చితత్వాన్ని జోడిస్తే ఇక ఉమ్రాన్‌కు తిరుగుండదని నెటిజన్లు ఊహిస్తున్నారు. What a pace man! … Read more

    స్మిత్‌ కొత్తగా ట్రై చేశాడు..కానీ!

    [VIDEO](url): ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లో భాగంగా స్మిత్‌ ఆడిన ఓ షాట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 32వ ఇన్నింగ్స్‌లో ఆదిల్‌ రషీద్‌ మిచెల్‌ మార్ష్‌కు నోబాల్‌ వేశాడు. ఆ బంతికి సింగిల్‌ తీయడంతో స్ట్రైక్‌ స్మిత్‌కు వచ్చింది. నోబాల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్మిత్‌ స్విచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే దీనిని ముందుగానే గమనించిన రషీద్‌ తెలివిగా స్మిత్‌కు బాల్ అందకుండా వేసి… డాట్‌ చేశాడు. ఈ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. Steve Smith trying something … Read more

    పాకిస్తాన్‌ జట్టుకు అభిమానుల ఘన స్వాగతం

    [VIDEO](url): పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాక్‌ ఓడిపోయిందంటే చాలు టీవీలు బద్దలుగొడుతూ ఆటగాళ్లను దూషిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యే వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి సీన్‌ భిన్నంగా కనిపించింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత హోటల్‌కు చేరుకున్న పాక్‌ ఆటగాళ్లకు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. ఫైనల్‌ వరకూ పోరాడిన జట్టుకు ఓటమి నుంచి బయటపడేలా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. We greatly appreciate the support of fans throughout our … Read more

    106 మీటర్ల సిక్స్‌ బాదిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌

    పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఇవాళ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. 16వ ఓవర్లో లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఏకంగా 106 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. ఈ వరల్డ్‌ కప్ సూపర్‌ 12 స్టేజ్‌లో ఇదే అత్యంత భారీ సిక్స్‌. డేవిడ్‌ మిల్లర్‌ ఇండియాపై కొట్టిన 104 మీటర్ల సిక్స్ రెండో స్థానంలో ఉంది. ఫించ్‌ (102 మీటర్లు), మిచెల్‌ మార్ష్‌(102 మీటర్లు), స్టాయినిస్‌ (101 మీటర్లు) ఉన్నారు. అయితే క్వాలిఫయర్లతో కలిపి చూసుకుంటే యూఏఈ బ్యాటర్‌ జునైద్‌ … Read more

    వెక్కి వెక్కి ఏడ్చిన బంగ్లా ఫ్యాన్స్‌

    ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం అనంతరం బంగ్లా అభిమానులు, క్రీడాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ కోల్పోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఓ చిన్న పాప ఏడుస్తున్న[ వీడియో](url) నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కొందరు అంపైర్ల నిర్ణయాలపై ఓటమిని తోసేస్తున్నారు. టీమిండియా అంపైర్లను కొనేసిందంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. Sorry gentlewoman, We know it hurts but this is what sports is about. Stay strong !#INDvsBAN#JaiHind pic.twitter.com/nhhmKw9Tcn — Saurav … Read more

    ఇలా చేశావేంటి కేన్‌ మామా!

    క్రీడాస్ఫూర్తికి న్యూజిలాండ్‌ జట్టు మారుపేరు, అలాంటిది ఇవాళ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో శాంటర్న్‌ వేసిన బంతిని బట్లర్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. కేన్‌ విలియమ్సన్‌ ఓ చక్కటి డైవ్‌తో క్యాచ్‌ పట్టాడు. అంతా వావ్‌ అనుకున్నారు. బట్లర్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ రీప్లేలో చూస్తే బంతి కేన్‌ విలియమ్సన్‌ చేతుల్లోంచి జారి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో ఏంటి కేన్‌ మామా చెప్పాలి కదా! అంటూ నెటిజన్లు … Read more

    మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ

    ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడినపుడు “ ఏక్‌దమ్‌ వక్త్‌ బదల్‌గయా, జజ్‌బాత్ బదల్‌గయా’ అంటూ వరల్డ్‌ వైడ్‌ ఫేమ్‌ సంపాదించిన కమెడియన్ మోమిన్‌ సాఖిబ్‌. ఆ మ్యాచ్‌ తర్వాత ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ ఉన్నా మోమిన్‌ పాపులర్‌ అవుతున్నాడు. ఇవాళ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అతడు ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. #WATCH | Pakistani comedian Momin Saqib’s hilarious interview ahead of India, Pakistan clash in ICC … Read more

    అరబ్ బౌలర్ సంచలనం

    టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ బౌలర్ కార్తీక్ మేయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భానుక రాజపక్ష, అసలంక, దాసున్ షనకలను వరుసగా పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఐదో ఆటగాడిగా మేయప్పన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో యూఏఈపై లంక ఘనవిజయం సాధించింది. View this post on Instagram A post … Read more

    దటీజ్.. కింగ్ కోహ్లీ

    భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక మెరుపు రనౌట్, అద్భుత క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. 19 ఓవర్లో రెండో బంతికి టిమ్ డేవిడ్‌ను ఒక మెరుపు త్రోతో రనౌట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో కమిన్స్ లాంగాన్ దిశగా షాట్ ఆడాడు. అందరూ సిక్స్ అనే అనుకున్నారు. కానీ కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో కమిన్స్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా … Read more