• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • INDvsAUS: భారత్ విజయం

    వాంఖడే వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాపై భారత బౌలర్లు విజృంభించారు. 188 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్లు షమీ, సిరాజ్‌ ధ్వయం చెరో 3 వికెట్లు తీసుకున్నారు. జడేజా 2 వికెట్లు పడగొట్టగా, హార్దిక్, కుల్దీప్ తలో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్‌ ఒక్కడే 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో కంగారూ బౌలర్లు భారత్‌ను బెంబేలెత్తించారు. కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకంతో బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు.

    ప్రధానుల చేతుల మీదుగా కెప్టెన్లకు క్యాప్

    [VIDEO:](url) భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లు తమ దేశ ప్రధాని చేతుల మీదుగా క్యాప్(టోపీ)లను అందుకున్నారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాప్‌ని అందజేయగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా క్యాప్‌ని రోహిత్ శర్మ అందుకున్నాడు. అనంతరం నలుగురు కలిసి చేతులు జోడించి పైకెత్తారు. ఇండోఆస్ట్రేలియన్ బంధం ముడిపడి 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరయ్యారు. … Read more

    పాపం బ్రేస్‌వెల్‌ ! చాలా దురదృష్టకరం

    [VIDEO](url): ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టులో కివీస్‌ ఆటగాడు బ్రేస్‌వెల్‌ ఔటైన తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. క్రీజులోకి వచ్చినా రనౌట్‌ అవ్వడం చూసి ఎంత దురదృష్టవంతుడివి భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. బెన్‌ స్టోక్స్‌ విసిరిన బంతిని ఫోక్స్‌ అందుకుని బెయిల్స్‌ గిరాటేసే సమయానికి బ్రేస్‌వెల్‌ క్రీజులోకి వచ్చినా…. అతడి బ్యాటు, లెగ్‌ గాలిలో ఉండటంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించారు. ??pic.twitter.com/f3ehGJTLVI — CricTracker (@Cricketracker) February 27, 2023

    పాక్‌తో మ్యాచ్.. ఉత్సాహంగా భారత ప్లేయర్లు

    మహిళల టీ20 ప్రపంచకప్ సమరానికి భారత్ సిద్ధమైంది. దాయాది దేశం పాకిస్థాన్‌తో నేడు భారత అమ్మాయిలు తలపడనున్నారు. ఈ కీలక పోరుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అమ్మాయిలకు నెటిజన్లు ‘ఆల్ ద బెస్ట్’ చెబుతున్నారు. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు. కేప్‌టౌన్ వేదిక. అయితే, గాయం కారణంగా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మ్యాచ్‌కి … Read more

    విధ్వంసం.. ఓవర్‌లో 5 సిక్సర్లు

    దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో సిక్సర్ల వర్షం కురిసింది. డెసర్ట్ వైపర్స్ బ్యాట్స్‌మన్ రూథర్‌ఫర్డ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. యూసఫ్ పటాన్ బౌలింగులో తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ ఒక్కో బంతిని బౌండరీ దాటించాడు. లాంగాన్, లాంగాఫ్, డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా వరుసగా 5 సిక్సర్లు బాది 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి … Read more

    టీ20లో విజృంభించిన జో రూట్

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ విజృంభించాడు. 52 బంతుల్లోనే 84 పరుగులు చేసి విమర్శకులకు షాక్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రూట్ చెలరేగాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటును ఝులిపించాడు. రివర్స్ స్వీప్, స్పీప్ షాట్లు ఆడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. దీంతో తాను కేవలం టెస్టుకే పరిమితం కాదని, వన్డే, టీ20ల్లోనూ రాణించగల సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ మ్యాచులో రూట్‌తో పాటు కెప్టెన్ పావెల్(97) మెరుపు ఇన్నింగ్సుతో క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. … Read more

    వావ్.. సూపర్ క్యాచ్

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ????. ?. … Read more

    అదిరిపోయే షాట్.. కోహ్లీ భారీ సిక్సర్

    శ్రీలంకపై మూడో వన్డేలో కింగ్ కోహ్లీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే, సెంచరీ పూర్తి చేసిన అనంతరం విరాట్ 97మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఈ షాట్ ఆడటం విశేషం. రజిత బౌలింగులో కోహ్లీ రెండు అడుగులు ముందుకేసి లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌ని కొట్టాడు. ఈ క్రమంలో విరాట్ శైలి ఏబీ డివిలియర్స్‌ని తలపిస్తున్నట్లుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, కోహ్లీ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేశాడు. అత్యధికంగా శ్రీలంకపై 10 … Read more

    టీమిండియా జెర్సీలో మార్పులు..!

    బీసీసీఐ జెర్సీలో స్వల్ప మార్పు జరిగింది. మొన్నటివరకు కిట్ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్ స్థానంలో కిల్లర్ సంస్థ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యుజ్వేంద్ర చాహల్ పోస్టు చేసిన ఫొటో ద్వారా ఇది స్పష్టమవుతోంది. గతేడాదే కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి గడువు వరకు స్పాన్సర్లుగా కొనసాగాలని బీసీసీఐ కోరిందట. మరోవైపు బైజుస్ కూడా గడువు కన్నా ముందే ఒప్పందం నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అయితే, ఆటగాళ్ల కిట్ స్పాన్సర్ మారడంపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. Lights … Read more

    101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more