న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.