• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మార్చి 4 నుంచి 26 వరకు మహిళల ఐపీఎల్

  బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ఐపీఎల్.. ‘వుమెన్స్ ప్రీమియర్ లీగ్’ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4 నుంచి 26 వరకు మహిళల ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచులన్నీ రెండు వేదికల్లో మాత్రమే జరగనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు, బ్రబౌర్న్ స్టేడియం వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మేరకు 5 ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం పంపించింది. కాగా, లక్నో కేంద్రంగా ఏర్పాటైన ఫ్రాంఛైజీకి ‘లక్నో వారియర్స్’గా పేరు ఖరారైంది. మిగతా 4 జట్లు పేర్లను ప్రకటించాల్సి … Read more

  నాగ్‌పూర్ చేరుకున్న టీమిండియా

  న్యూజిలాండ్ సిరీస్‌ని ఘనంగా ముగించిన టీమిండియా కీలక సమరానికి తయారైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు నాగ్‌పూర్‌కు చేరుకుంది. ఈ నెల 9న భారత్, ఆసీస్ మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగుళూరుకు చేరుకున్నారు. సాధన మొదలు పెట్టారు. ఫిబ్రవరి 6న ఆసీస్ ఆటగాళ్లు నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. ఈ టెస్టు సిరీస్‌లో 3-1 విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధిస్తుంది.

  లక్నో జట్టుకు ‘లక్నో వారియర్స్’గా పేరు

  మహిళల ఐపీఎల్ ‘వుమెన్స్ ప్రీమియర్ లీగ్’‌లో ఐదు జట్లు పాల్గొననున్న సంగతి తెలిసిందే. లక్నో కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జట్టుకు ‘లక్నో వారియర్స్’గా పేరు పెట్టారు. మిగతా జట్ల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు జట్లు పేరును అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇటీవలే పూర్తయిన బిడ్డింగ్ ద్వారా బీసీసీఐకి ఏకంగా రూ.4666.99 కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చే ఐదేళ్లకు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఈ నెల 11 లేదా 13న వేలం … Read more

  మహిళల ఐపీఎల్‌కు రికార్డు బిడ్డింగ్

  మహిళల ప్రీమియర్‌ లీగ్‌ బిడ్డింగ్‌ ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా రూ. 4669.99 కోట్ల బిడ్డింగ్ జరిగింది. అదానీ స్పోర్ట్స్‌ లైన్ రూ. 1289 కోట్లు, ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.912.99 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ. 901 కోట్లు, JSW జీఎంఆర్ క్రికెట్ రూ. 810 కోట్లు, క్యాప్రీ గ్లోబల్ బిల్డింగ్స్ రూ. 757 కోట్లు బిడ్ దాఖలు చేశాయి. “ ఇది 2008లో మెన్స్‌ ఐపీఎల్‌ రికార్డును బద్దలు కొట్టింది. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు సరికొత్త … Read more

  న్యూజిలాండ్‌తో T20 సిరీస్‌కు రుతురాజ్ దూరం?

  న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కానున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో రుతురాజ్ గాయపడ్డాడు. అతను మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో గైక్వాడ్ 195 పరుగులతో అద్భుతంగా రాణిచాడు. రుత్‌రాజ్ స్థానంలో పృథ్వీ షాను ఆడించే అవకాశం ఉంది. 2021 శ్రీలంకతో సిరీస్ తర్వాత మళ్లీ పృథ్వీ షా జట్టులోకి రాలేదు.

  ఈ తరం బ్యాటర్ల లోపం ఇదే: పఠాన్

  టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ తరం బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వింగ్ బౌలింగ్‌ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని పఠాన్ ట్వీట్ చేశాడు. టీమిండియాతో రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడటంపై ఇలా స్పందించాడు. ‘మోడర్న్ డే బ్యాటర్లకు స్వింగ్ బౌలింగ్‌ని ఈ మ్యాచులో భారత బౌలర్లు విసిరిన స్వింగ్ బంతులకు కివీస్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. దీంతో టపటపా వికెట్లు రాలాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ విఫలమైంది. 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంపై పఠాన్ ఇలా … Read more

  వావ్.. సూపర్ క్యాచ్

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 𝗪𝗛𝗔𝗧. 𝗔. … Read more

  ‘ఎంత బరువుంటే అన్ని సెంచరీలు బాదేస్తాడు’

  భారత రంజీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎంత బరువు ఉంటే అన్ని శతకాలు బాదేస్తాడని భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ‘‘రంజీల్లో ముంబై తరఫున సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. అలాంటి బ్యాటర్‌ను టెస్టులకు ఎంపికచేయకపోవడం శోచనీయం. ఇది ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను అవమానించడమే అవుతుంది. రన్స్ రాబట్టేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎంత అధిక బరువున్నాడో.. అన్ని సంచరీలు బాదేస్తాడు.’’ అంటూ వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు.

  న్యూజిలాండ్‌తో సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం

  న్యూజిలాండ్‌తో రేపటి నుంచి జరగునున్న మూడు వన్డేల సీరిస్‌కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈమేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది. వెన్ను గాయం కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైనట్లు పేర్కొంది. అతడి స్థానంలో రాజత్ పటిదార్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. రేపు హైదరాబాద్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

  తొలిసారి స్పందించిన రిషబ్ పంత్

  రోడ్డు ప్రమాదం బారిన పడ్డాక టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తొలిసారి స్పందించాడు. ట్విటర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇటీవల చేసిన సర్జరీ విజయవంతమైందని తీపికబురు అందించాడు. ‘నేను కోలుకోవడానికి సహకరించిన వారికి, నేను కోలుకోవాలని ప్రార్థించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ మధ్య ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నా. ఇకనుంచి ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరిస్తా. నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, జేషాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మైదానంలో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు. డిసెంబరు 30న పంత్ రోడ్డు … Read more