• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IND Vs NZ సెమీస్‌.. ఆ నగరాల్లో భారీ స్క్రీన్లు

  ప్రపంచకప్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రేపు సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులు వీక్షించేందుకు ఏపీలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియం, కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

  సగం లక్ష్యమే పూర్తయ్యింది: రోహిత్

  వరల్డ్‌కప్‌లో 2003 తర్వాత న్యూజిలాండ్‌ను ఒడించడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. ‘టోర్నీలో ఒక్కో మ్యాచ్‌ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికీ ఇంకా సగం లక్ష్యమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడంతో పాటు వర్తమానంలో ఉండటం ముఖ్యం. షమీ తనకొచ్చిన ఛాన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఒకదశలో కివీస్‌ 300+ స్కోరు చేస్తుందని భావించాం. కానీ, షమీతో సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు’ అని రోహిత్ అన్నాడు.

  5 వికెట్ల ప్రదర్శనపై షమీ స్పందన ఇదే!

  న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ షమీ 5 వికెట్లతో నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ అనంతరం తన బౌలింగ్‌ ప్రదర్శనపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘తొలి బంతికే వికెట్ తీసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. జట్టులోని సహచరులు అద్భుతంగా ఆడుతున్నప్పుడు తప్పకుండా మనం మద్దతు ఇవ్వాలి. జట్టుగా సమష్ఠిగా రాణిస్తే విజయం సాధించడం కష్టమేం కాదు. ఆ సమయంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఐదు వికెట్లు తీయడంతోపాటు భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది’ అని షమీ తెలిపాడు.

  భారత్‌-కివీస్‌ మ్యాచ్‌.. బద్దలైన రికార్డ్స్‌

  నిన్న కివీస్‌తో జరిగిన టీమిండియా తరపున పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఘనత సాధించాడు. గిల్‌ 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై భారత్‌ తొలి విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో 36 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా షమీ నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కోహ్లీ రన్స్‌ 354కు చేరాయి. నిన్నటి మ్యాచ్‌తో రోహిత్‌ను (311) కోహ్లీ అధిగమించాడు.

  అలా ఆడితే కివీస్‌ను ఓడించొచ్చు: కోహ్లీ

  కివీస్‌తో మ్యాచ్‌పై టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే ఆ జట్టు సక్సెస్ అవుతోందని పేర్కొన్నారు. ‘ప్రొఫెషనల్‌ క్రికెట్ ఆడటంలో న్యూజిలాండ్‌ జట్టు ముందుంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. ఇలాంటి జట్టుతో ఆడేటప్పుడు వారి లయను దెబ్బ తీయడానికి తీవ్రంగా శ్రమించాలి. పూర్తిస్థాయి నైపుణ్యాలను వినియోగించి ఆడితేనే విజయం సాధించేందుకు అవకాశాలు వస్తాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు’ అని కోహ్లీ అన్నాడు.

  నేడు కివీస్‌తో టీమిండియా ‘ఢీ’

  ప్రపంచకప్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఓటమి చవి చూడని భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. మధ్యాహ్నం 2.00 గం.లకు ధర్మశాల వేదికగా మ్యాచ్‌ నిర్వహించనున్నారు. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. గాయం కారణంగా హార్ధిక్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానాన్ని బ్యాటర్‌తో భర్తీ చేయాలనుకుంటే సూర్య కూమార్‌ యాదవ్‌ లేదా బౌలర్‌ ఆప్షన్‌ కింద షమీని తీసుకోవచ్చు. పిచ్‌ బౌలర్లు, బ్యాటర్లకు సమతూకంగా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు.

  పృథ్వీ చేతిలో ట్రోఫీ.. పాండ్యా మాస్టర్ ప్లాన్

  న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ని భారత్ గెలుచుకుంది. అయితే, సిరీస్‌కు పృథ్వీ షాని ఎంపిక చేసినప్పటికీ డగౌట్‌కే పరిమితం చేశారు. దీంతో కెప్టెన్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్‌ని ఆడిస్తూ ప్రతిభావంతుడైన పృథ్వీ షాను పక్కనపెట్టడం సరికాదని నెటిజన్లు మండిపడ్డారు. బహుశా ఇది తన దృష్టికి వచ్చిందో, లేదో తెలీదు గానీ సిరీస్ ట్రోఫీని తీసుకెళ్లి పాండ్యా నేరుగా పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పృథ్వీని కూల్ చేయడానికి పాండ్యా ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. Captain @hardikpandya93 collects … Read more

  వావ్.. సూపర్ క్యాచ్

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ????. ?. … Read more

  INDvsNZ: ఎక్కడ చూడొచ్చంటే..!

  టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి ఈ సిరీస్‌ మొదలు కాబోతోంది. 3 టీ20లు ఆడనున్న జట్టుకు హార్దిక్‌ పాండ్యా, 3 వన్డేలకు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నవంబర్‌ 18 నుంచి 22 వరకు టీ20లు, 25 నుంచి 30 వరకు వన్డేలు జరుగుతాయి. టీ20లు మధ్యాహ్నం 12 గంటలకు, వన్డేలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. డీడీ స్పోర్ట్స్‌తో పాటు అమేజాన్‌ ప్రైమ్‌లో మ్యాచ్‌ను చూడొచ్చు. వన్డే జట్టు: శిఖర్‌ … Read more