• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Most 5 Wicket Hauls: టెస్టుల్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా?  

    క్రికెట్‌లో టెస్టు ఫార్మెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. వన్డే, టీ20లతో పోలిస్తే ఒక ఆటగాడిలోని పూర్తి సామర్థ్యాన్ని టెస్టు మ్యాచ్‌లు వెలికితీస్తాయి. ఈ నేపథ్యంలోనే తమను తాము నిరూపించుకునేందుకు ఆటగాళ్లు టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బ్యాటర్లు, బౌలర్లు టెస్టుల్లో పలు రికార్డులను నమోదు చేశారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి, టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

    ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక)

    ప్రపంచంలోని మేటి స్పిన్‌ బౌలర్లలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఒకడు. తన స్పిన్‌ మాాయాజాలంతో శ్రీలంకకు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన ఆటగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 67సార్లు ఈ ఘనత సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

    షేన్‌ వార్న్‌ (ఆస్ట్రేలియా)

    మురళీ ధరన్ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ ఉన్నాడు. అతడు 145 టెస్టుల్లో 37సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. వార్నర్‌ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తాము ఎదుర్కొన్న అతి కఠినమైన స్పిన్నర్‌ వార్న్ అని పలువురు మాజీ బ్యాటర్లు సైతం ప్రకటించారు. 

    రిచర్డ్‌ హ్యాడ్లీ (న్యూజిలాండ్‌)

    న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ టెస్టుల్లో 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. తద్వారా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అప్పట్లో న్యూజిలాండ్‌ పేస్‌ దళాన్ని ముందుండి నడిపించిన రిచర్డ్‌.. బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 


    అనిల్‌ కుంబ్లే (భారత్‌)

    భారత దిగ్గజ స్పిన్నర్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‌అనిల్‌ కుంబ్లే. భారత్‌ తరపున అత్యధిక వికెట్లు (953) పడగొట్టింది కూడా అతడే. అటువంటి కుంబ్లే టెస్టుల్లో 35సార్లు ఫైవ్ వికెట్ హాల్‌ని సాధించాడు.  

    రంగన హెరాత్ (శ్రీలంక)

    ముత్తయ్య మురళీధరన్‌ తర్వాత మరో శ్రీలంక స్పిన్నర్‌ కూడా అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ‌అతడే దిగ్గజ రంగన హెరాత్. టెస్టుల్లో హెరాత్‌ ఈ ఘనతను 34సార్లు అందుకున్నాడు. 

    రవిచంద్రన్‌ అశ్విన్‌ (భారత్‌)

    ఈ తరం భారత స్టార్‌ స్పిన్నర్లలో అశ్విన్‌ ఒకరు. తన మైండ్‌ గేమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఎన్నో సార్లు అశ్విన్‌ ఔట్‌ చేశాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మెుదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది 33వ సారి. ప్రస్తుత జాబితాలో అశ్విన్‌ ఆరోస్థానంలో ఉన్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv