కోహ్లీ, రోహిత్‌లతో ఒరిగేదేం లేదు; భారత మాజీ క్రికెటర్
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మల వల్ల భారత జట్టుకు ఒరిగేదేం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. 35 ఏళ్ల రోహిత్ టీ20లకు పనికిరాడని, ఇప్పటికే తన చివరి మ్యాచ్ ఆడేశాడని అనుకుంటున్నానన్నాడు. కోహ్లీ, రోహిత్‌లు వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేది లేనిదీ అనుమానమేనని పేర్కొన్నాడు. వీరిద్దరి మార్గదర్శనాలు కూడా యంగ్ క్రికెటర్లకు అక్కర్లేదని అభిప్రాయపడ్డాడు. వీరు తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.