• TFIDB EN
  • బడే మియా ఛోటే మియా (2024)
    U/ATeluguNaNh

    కబీర్ (పృథ్వీరాజ్) భారత సైన్యం నుండి ఒక ప్యాకేజీని దొంగిలించి.. కొంతమంది సైనికులను చంపుతాడు. దీంతో ఉన్నతాధికారులు అతడ్ని పట్టుకునే బాధ్యతను ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), రాకీ (టైగర్ ష్రాఫ్)కి అప్పగిస్తారు. ఇంతకీ కబీర్ ఎవరు? సైన్యానికి వ్యతిరేకంగా ఎందుకు మారాడు? దొంగిలించిన ప్యాకేజీలో ఏముంది? ఫిరోజ్, రాకేష్‌లు కబీర్‌ను అడ్డుకున్నారా? లేదా? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మానుషి చిల్లర్కెప్టెన్ మిషా
    అలయ ఎఫ్ఐటీ స్పెషలిస్ట్ పామ్
    రోనిత్ రాయ్కల్నల్ ఆదిల్ శేఖర్ ఆజాద్
    మనీష్ చౌదరికరణ్ షెర్గిల్
    సిబ్బంది
    అలీ అబ్బాస్ జాఫర్దర్శకుడు
    వశు భగ్నానినిర్మాత
    అలీ అబ్బాస్ జాఫర్నిర్మాత
    హిమాన్షు కిషన్ మెహ్రానిర్మాత
    జూలియస్ ప్యాకియంసంగీతకారుడు
    విశాల్ మిశ్రాసంగీతకారుడు
    Score:Songs:Vishal Mishra[1]సంగీతకారుడు
    Suraj Giananiడైలాగ్ రైటర్
    Marcin Laskawiecసినిమాటోగ్రాఫర్
    Steven H. Bernardఎడిటర్ర్
    కథనాలు
    <strong>This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!</strong>
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; లవ్‌ గురు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ చిత్రం.. ‘లవ్‌ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్‌ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. డియర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌’ (Dear). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.&nbsp; బడేమియా ఛోటేమియా బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.&nbsp; మైదాన్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో చేశాడు. అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఓం భీమ్ బుష్‌ ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.&nbsp; గామి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.&nbsp; ప్రేమలు&nbsp; మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu&nbsp;AhaApril 09PremaluMovieTelugu&nbsp;AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
    ఏప్రిల్ 08 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    <strong>Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?</strong>
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.&nbsp; https://twitter.com/i/status/1772544977396220385 బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్‌ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) స్టార్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.&nbsp; హాట్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.&nbsp; యంగ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.&nbsp; View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) నటి మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.&nbsp; నటి రాయ్‌ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.&nbsp; ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.&nbsp; హోలీని బాగా సెలబ్రేట్‌ చేసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శివాలిక ఒబెరాయ్‌ ఉంది.&nbsp; యంగ్‌ హీరోయిన్‌ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.&nbsp; మెగా డాటర్స్‌ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.&nbsp; బాలీవుడ్‌ భామ అవనీత్‌ కౌర్‌.. హోలీ రోజున సోషల్‌ మీడియాలో తళుక్కుమంది.&nbsp; ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్‌.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.&nbsp; పాపులర్‌ హీరోయిన్‌ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్‌ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.&nbsp; హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.&nbsp; View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
    మార్చి 26 , 2024
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) యుగం నడుస్తోంది. మెున్నటి వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలుగా ఉన్న థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించేశాయి. బడా హీరోల చిత్రాలు మినహా.. అత్యధిక శాతం చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney + Hotstar), సోనీలివ్‌ (SonyLIV), ఈటీవీ విన్‌ (ETV Win), వూట్‌ (Voot), ఆహా (Aha) వంటి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు - సిరీస్‌లు విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.&nbsp; ఓటీటీ ఏర్పాటుకు కారణం ఇదే! మలయాళం నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కంటెంట్‌ ఉన్న కథలను మాలీవుడ్‌ నిర్మిస్తుందన్న పేరు ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. కొందరైతే సబ్‌టైటిల్స్‌ పెట్టుకొని మరి మాలీవుడ్‌ సినిమాలను వీక్షిస్తున్నారు. ఇది గమనించిన కేరళ ప్రభుత్వం.. డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో కొత్త ఓటీటీ యాప్‌ను మూవీ లవర్స్‌ ముందుకు తీసుకొస్తోంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. 60 మంది ఉద్యోగులతో.. కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) రేపు స్వయంగా ‘సీస్పేస్‌’ (CSpace) యాప్‌ను లాంచ్‌ చేస్తారు. ఉదయం 9.30 గంటలకు.. కైరళి థియేటర్‌లో జరగనున్న లాంచ్‌ ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సజీ చెరియన్ (Saji Cherian) కూడా హాజరవుతారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు ‘సీస్పెస్’ ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - KSFDC (Kerala State Film Development Corporation) చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న KSFDCనే ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మంది సిబ్బందిని సెలక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; ప్రత్యేక పానెల్‌ ఏర్పాటు! ఈ ‘సీస్పేస్‌’ ఓటీటీలో ఎటువంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను సైతం KSFDC సంస్థ ఏర్పాటు చేసింది. బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఈ ప్యానెల్‌ ఏర్పాటైంది. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ ప్యానెల్‌ చేతుల్లోనే ఉండనుంది. సీస్పేస్ లాంచ్ సందర్భంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’ ఎలా పనిచేస్తుంది? ‘సీస్పేస్‌’ యాప్‌ను మాస, త్రైమాసిక, వార్షిక చెల్లింపుల విధానంలో కాకుండా ‘పే పర్‌ వ్యూ‘ (Pay Per View) స్కీమ్‌తో రన్‌ చేయనున్నారు. ఇందులో సినిమా చూడాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును చిత్ర నిర్మాతలకు సీస్పేస్‌ ప్యానెల్ అందజేస్తుంది. ఒకవేళ తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ వస్తే సగం ధరకే వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’తో ఎవరికి లాభం! కేరళలో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు సీస్పేస్‌ చెక్‌ పెట్టనుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఈ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. అలాగే థియేటర్లు దొరక్క సమస్యలు ఎదుర్కొనే నూతన దర్శకులు తమ చిత్రాలను సీస్పేస్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చని సూచించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అటు ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు&nbsp; స్పష్టం చేశారు.
    మార్చి 06 , 2024
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా మరికొన్ని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్‌ వాటెండ్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; గుంటూరు కారం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.&nbsp; హనుమాన్ ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్‌. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్‌ విడుదల కానుంది.&nbsp; భారతీయుడు 2 అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు.&nbsp; పుష్ప 2 సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్‌-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.&nbsp; ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గేమ్‌ ఛేంజర్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.&nbsp; కల్కి 2898 ఏడీ సలార్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్‌ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. స్పిరిట్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్‌ 'స్పిరిట్‌' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్‌ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్‌ స్టార్‌ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెలియజేశారు.&nbsp;
    డిసెంబర్ 30 , 2023
    <strong>Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!</strong>
    Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!
    మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్‌ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్‌ స్పాట్‌ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్‌ లుక్‌ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్‌ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు తారక్‌ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; వెంటాడుతున్న లీకుల బెడద! ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్‌ షూటింగ్‌ స్పాట్ నుంచి హీరోయిన్‌ కియారా ఫొటోలు లీక్‌ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్‌ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.&nbsp; https://twitter.com/i/status/1769462838765240477 https://twitter.com/i/status/1769381487143776301 దసరా, సంక్రాంతి పరిశీలన! గేమ్‌ ఛేంజర్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్‌. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్‌ ఛేంజర్‌'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్‌ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్‌ పనులు ప్లానింగ్‌ చేసుకొని డేట్‌ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.&nbsp; చిరు - చరణ్‌ - తారక్.. బిగ్‌ ఫైట్‌! అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్‌’ ఫిక్స్‌ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్‌ ఫైట్‌ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కలిసి నటించిన తారక్‌తో రామ్‌ చరణ్‌ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్! ఇక గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్‌'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్‌ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp;
    మార్చి 18 , 2024
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. నాయికగా కెరీర్‌లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలంటే ఒకట్రెండు పెద్ద సినిమాల్లో నటించాల్సిందే. అప్పుడే రీచ్ పెరిగి హీరోయిన్లకు ఆదరణ మొదలవుతుంది. బడా ప్రాజెక్టులో నటిస్తున్నారంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ చూపు కూడా హీరోయిన్‌పై పడుతుంది. అలా అవకాశాలు మెరుగవుతాయి. అచ్చం ఇలాగే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఫీలయ్యింది. కానీ, బర్త్ డే(Nidhi Agarwal BirthDay) రోజున ఈ అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. కారణం ఏంటో చూద్దాం.&nbsp; అదృష్టమేనా.. టాప్ హీరోతో బడా సినిమాలో ఛాన్స్ రావడం ఒక రకంగా అదృష్టమే. చాలా మంది ఎగిరి గంతేస్తారు. నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలాంటి ఫీలింగ్‌‌నే ఎక్స్‌ప్రెస్ చేసింది. ప్రస్తుతం నిధి చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ బ్యూటీ. చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా గొప్ప విషయమని ఇటీవల నిధి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. కల నిజమైందంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే కల కలగానే మిగిలి పోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం.. ‘హరిహర వీరమల్లు’ భవితవ్యమే.&nbsp; https://twitter.com/AgerwalNidhhi/status/1680791420440023040?s=20 రెండేళ్లకు పైగా.. సాధారణంగా పెద్ద సినిమా చిత్రీకరణకు కాస్త సమయం పడుతుంది. ప్రారంభం నుంచి రిలీజ్ వరకు కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. కానీ, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వచ్చిన పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ 2021లో వచ్చింది. భారీ తారాగణంతో బిగ్ బడ్జెట్ చిత్రంగా దీనిని తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో మళ్లయోధుడి పాత్ర పోషిస్తున్నారు. నిధితో పాటు సోనాల్ చౌహాన్, బాబీ డియోల్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న ఆందోళన.. ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ పది కాలాల పాటు సాగాలంటే కచ్చితంగా చిత్రాలు విజయం సాధించాలి. అప్పుడే అవకాశాల ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. గ్లామర్ డోజ్ ఏ మాత్రం తగ్గకూడదు. వీటన్నిటితో పాటు సమయ పాలన తప్పనిసరి. ఎక్కడ చిన్న లోపం జరిగినా సినిమా అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే రిలీజైన సినిమాలు హిట్ కావాలి. నిధి అగర్వాల్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతా ప్రాజెక్టులు పెద్దగా ఆదరణను పొందలేక పోయాయి. కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ అవకాశంతో ఇక సెట్ అయిపోయినట్లేనని భావించింది. కానీ, చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్న కొద్దీ నిధిలో ఆందోళన పెరిగిపోతోందని టాక్. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు నిధిని భయపెట్టిస్తున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్. దీంతో ఈ సినిమానైనా త్వరగా వస్తుందేమో అన్న ఆశ అమ్మడిలో నెలకొంది.&nbsp; వెయిట్ చేయాల్సిందే హరిహర వీరమల్లు, ప్రభాస్-మారుతిల సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు లేవు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలంటే నిధి మరో ఏడాది కాలం ఆగాల్సిందే. ఆ లోపు తనని మరచిపోకుండా ఉండటానికి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. నిధి మల్టీ టాలెంటెడ్. ఈ అమ్మడు డ్యాన్సర్ కూడా. జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేస్తుంది.&nbsp;&nbsp;
    ఆగస్టు 17 , 2023
    Actress Sreeleela: పవన్‌, మహేష్‌, విజయ్‌ చిత్రాల్లో ‘ధమాకా’ బ్యూటీ.. నం.1 హీరోయిన్ అవ్వడమే టార్గెట్..!
    Actress Sreeleela: పవన్‌, మహేష్‌, విజయ్‌ చిత్రాల్లో ‘ధమాకా’ బ్యూటీ.. నం.1 హీరోయిన్ అవ్వడమే టార్గెట్..!
    టాలీవుడ్‌ భామ శ్రీలీల సినిమా కెరీర్‌ టాప్‌లో దూసుకుపోతోంది. నటన, గ్లామర్‌, డ్యాన్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. స్టార్‌ హీరోల సరసన చేసే గోల్డెన్‌ ఛాన్స్‌లను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుసగా 9 సినిమాలకు ఓకే చెప్పింది. వీటిలో బాలయ్య, మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, విజయ్‌ దేవర కొండ, రామ్‌ పోతినేని వంటి బడా హీరోల చిత్రాలు ఉన్నాయి.&nbsp; మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో పాటు నితిన్‌తోనూ శ్రీలీల జోడి కడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రోజు’ అనే చిన్న బడ్జెట్‌ సినిమాలోనూ నటిస్తోంది.&nbsp; ఇటీవల వచ్చిన ‘ధమాకా’ చిత్రం శ్రీలీల కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇందులో శ్రీలీల నటన, డ్యాన్స్‌ చూసిన తెలుగు ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇది గమనించిన టాలీవుడ్‌ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు శ్రీలీల వద్దకూ క్యూ కడుతున్నారు.&nbsp; 2001 జూన్‌ 14న అమెరికాలో శ్రీలీల జన్మించింది. విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే జరిగింది. శ్రీలీల తల్లి గైనకాలజిస్టుగా పనిచేస్తోంది.&nbsp; 2019 లో వచ్చిన ‘కిస్‌’ అనే కన్నడ సినిమాతో శ్రీలీల సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడంతో పాటు శ్రీలీలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న శ్రీలీల.. కిస్‌ సినిమాకు గాను బెస్ట్‌ డెబ్యూట్‌ హీరోయిన్‌గా సైమా అవార్డ్స్‌ అందుకుంది. అటు తెలుగులో రిలీజైన పెళ్లి సందD సినిమాకు కూడా మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ పురస్కారం సొంతం చేసుకుంది.&nbsp; ప్రస్తుతం శ్రీలీల ఒప్పుకున్న స్టార్‌ హీరోల సినిమాలు ఘన విజయం సాధిస్తే ఆమె కెరీర్‌కు ఇక తిరుగుండదని చెప్పొచ్చు. తెలుగులోని అగ్రకథనాయకుల సరసన శ్రీలీల చేరిపోవడం గ్యారంటీ.&nbsp; ఓ వైపు బిజీబిజీగా సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీలీల యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ‌అలరిస్తోంది.&nbsp; సోషల్‌ మీడియాలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లను&nbsp; శ్రీలీల సంపాదించుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    మే 16 , 2023
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?
    National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?
    మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్‌ (Cinepolis), మిరాజ్‌(Miraj), సిటీప్రైడ్‌, ఏషియన్‌ (Asian), మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.&nbsp; ఒక్కరోజు మాత్రమే! అక్టోబర్‌ 13న మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అయితే రూ.99 లకే టికెట్‌ కావాలనుకునేవారు ఆఫ్‌లైన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత థియేటర్ల కౌంటర్ల వద్ద టికెట్ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ వస్తే టికెట్‌ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక రిక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్స్‌కు రూ.99 ఆఫర్‌ వర్తించదు.&nbsp; గతేడాదే ప్రారంభం ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (M.A.I).. గతేడాది సెప్టెంబరు 23న ‘నేషనల్‌ సినిమా డే’ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్‌ ఇచ్చింది.&nbsp; కరోనానే కారణం..!&nbsp; తొలుత సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’ నిర్వహించాలని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ భావించింది. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో దానికి గుర్తుగా సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’గా జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో దానిని సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. చివరకూ అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’గా ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులకు పండగే! ఇక వచ్చే వారం పలు బడా చిత్రాలు రిలీజ్‌ కాబోతున్నాయి. రామ్‌ పోతినేని ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్‌ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) తదితర చిత్రాలు వచ్చే శుక్రవారం (సెప్టెంబరు 28) రిలీజ్ కానున్నాయి. అటు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    సెప్టెంబర్ 24 , 2023
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.&nbsp; దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు&nbsp; గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.&nbsp; https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    Chandrika Ravi: సిల్క్‌ స్మితగా చంద్రికా రవి.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Chandrika Ravi: సిల్క్‌ స్మితగా చంద్రికా రవి.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    అలనాటి నటి సిల్క్‌ స్మిత (Silk Smitha) జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నటి చంద్రికా రవి (Chandrika Ravi) ఈ చిత్రంలో సిల్క్‌ స్మితగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో ఆమె అచ్చం స్మితాాలానే కనిపించి అందర్ని ఆశ్చర్యపరించింది. ఇంతకి చంద్రికా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.&nbsp; చంద్రిక భారత సంతతి వ్యక్తి. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి కుటుంబంలో ఆమె జన్మించారు.&nbsp; చిన్నప్పటి నుంచే చంద్రికాకు నటనపై ఆసక్తి. అందుకే మూడేళ్ల వయసులోనే డ్యాన్సింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇక 16 ఏళ్లకే నటిగా, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించారు.&nbsp; కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరాలన్న ఉద్దేశంతో కుటుంబానికి దూరంగా లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లారు చంద్రికా. అక్కడ ఆమె పలు టీవీ షోస్‌లో నటించారు.&nbsp; 2018లో తమిళంలో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కత్తు' చిత్రం ద్వారా ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దయ్యం పాత్ర పోషించి చంద్రికా అందరి దృష్టిని ఆకర్షించింది 2019లో వచ్చిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో చంద్రికా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు'కు ఇది రీమేక్. 'వీర సింహారెడ్డి' సినిమాలో ఓ పాటలోనూ చంద్రికా తళుక్కుమంది. 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ పాట తర్వాత ఆమెకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది.&nbsp; తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని చంద్రికా ఓ ఇంటర్యూలో తెలిపింది. ఇక్కడే స్థిరపడాలని ఉందని చెప్పుకొచ్చింది.&nbsp; కెరీర్‌ కోసం కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం తనకు ఎంతో బాధగా ఉంటున్నట్లు చంద్రికా చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న సిల్క్‌ స్మిత బయోపిక్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని ఈ భామ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం తాను ఎంతగానో శ్రమిస్తున్నట్లు చెప్పింది.&nbsp; సిల్క్‌ స్మిత బయోపిక్‌ కోసం చంద్రికా చాలా రిసెర్చ్‌ చేసిందట. స్మిత నటించిన చిత్రాలు చూడటం, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలను తెలుకోవడం వంటివి చేసిందట. ఈ భామ సోషల్‌ మీడియాలోనూ ఎంతో చురుగ్గా వ్యవహిరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.&nbsp; చంద్రిక గ్లామర్‌ షోకు ఫిదా అయిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అనుసరిస్తున్నారు. ఆమె ఇన్‌స్టా ఖాతాను 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.&nbsp;
    డిసెంబర్ 05 , 2023
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.&nbsp; ఊరు పల్లెటూరు ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు. https://www.youtube.com/watch?v=KpBksxKsrIU బతుకమ్మ సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్‌ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.&nbsp; https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I చమ్కీల అంగీలేసి దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY దండికడియాల్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY దిల్ కుష్ తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE సౌ శర(పరేషాన్) పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని&nbsp; చెబుతున్నాయి.&nbsp; https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
    జూన్ 07 , 2023
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో&nbsp; యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)&nbsp; అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.&nbsp; https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.&nbsp;&nbsp; https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.&nbsp; https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.&nbsp; https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.&nbsp; https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.&nbsp; https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    మలయాళ నటి 'మమితా బైజు' (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన 'ప్రేమలు' (Premalu) చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూగా కనిపించి యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్‌ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్‌ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్‌, మిని. మమితా సోదరుడి పేరు మిథున్‌.&nbsp; కిడంగూర్‌లోని మేరి మౌంట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌ హైయర్‌ సెకండరీ స్కూల్స్‌లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.&nbsp; పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే 'సర్వోపరి పలక్కరన్‌' (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.&nbsp; ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్‌ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌’, ‘ఆపరేషన్‌ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది.&nbsp; 2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్‌ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకుంది.&nbsp; గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్‌ అండ్‌ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.&nbsp; 'ఖోఖో' సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో 'కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్ అవార్డ్‌' అందుకుంది.&nbsp; మమిత 16వ చిత్రం 'ప్రేమలు'.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.&nbsp; ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'రెబల్‌' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.&nbsp; తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది.&nbsp; తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది.&nbsp; తెలుగులో ఇష్టమైన నటుడు 'అల్లు అర్జున్' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది.&nbsp; మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్‌లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట. ఆమె తండ్రి బైజు క్రిష్ణన్‌ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్‌ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.
    మార్చి 14 , 2024
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.&nbsp; మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.&nbsp; https://twitter.com/Nithish13771106/status/1671007811839623170 దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536 లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.&nbsp; https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365 లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/s_siechojithu/status/1670955824305569795 రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656 తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది. https://twitter.com/sunny5boy/status/1671039650897510400 మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/always_dasari9/status/1670959463367598082 మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040 డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328 ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705 ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.&nbsp;&nbsp; https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818 అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.&nbsp; https://twitter.com/gnani0414/status/1670985319297212416 పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. https://twitter.com/gnani0414/status/1671012059625168897 రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు. https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529 మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది. https://twitter.com/s_siechojithu/status/1671026894760992770 నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు. https://twitter.com/KingLeo_007/status/1671348946755805191 చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది. https://twitter.com/Noori_NN/status/1671045618079506433
    జూన్ 21 , 2023
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రేణూ దేశాయ్‌ (Renu Desai) కొడుకు అకిరా నందన్‌ (Akira Nandan) గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా యానిమల్‌ (Animal) సినిమాలోని ఓ పాటకు పియానో వాయించిన వీడియో మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947 పవన్ కొడుకు పియానో వాయించిన ఈ వీడియోను ఉపాసన (Upasana) షేర్‌ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదు.. కానీ, అకీరా జస్ట్ సూపర్’ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా యానిమల్‌(Animal)లోని 'నాన్న నువ్వు నా ప్రాణం అనినా...' అనే పాటకు అకిరా పియానా వాయించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తండ్రి ప్రేమకోసం తపన పడే కొడుకుకి సంబంధించిన పాటను అకిరా ఎంచుకోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రిని అకిరా ఎంతగా మిస్‌ అవుతున్నాడో అకిరా ఈ ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అకిరా నందన్‌ (Akira Nandan)కు సంబంధించిన లేటెస్ట్‌ పిక్స్‌ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అతడి లుక్‌ వింటేజ్‌ పవన్‌ను (Pawan Kalyan) గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.&nbsp; ఇదిలా ఉంటే అకీరా నందన్‌కు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అకిరా లేటెస్ట్‌ ఫొటోలను చూసిన ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తర్వాత మెగా లెగసీకి అసలైన వారసుడు అకీరానే అవుతాడని అంటున్నారు.&nbsp; రామ్ చరణ్ ఎరా (Era) అయ్యాక మెగా లెగసీ బాధ్యత అంతా అకిరా నందన్ మీదే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అకిరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అతడి కటౌట్‌కు రికార్డులన్నీ పరారవుతాయని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది.
    జనవరి 23 , 2024

    @2021 KTree