• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?

    మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్‌ (Cinepolis), మిరాజ్‌(Miraj), సిటీప్రైడ్‌, ఏషియన్‌ (Asian), మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. 

    ఒక్కరోజు మాత్రమే!

    అక్టోబర్‌ 13న మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అయితే రూ.99 లకే టికెట్‌ కావాలనుకునేవారు ఆఫ్‌లైన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత థియేటర్ల కౌంటర్ల వద్ద టికెట్ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ వస్తే టికెట్‌ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక రిక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్స్‌కు రూ.99 ఆఫర్‌ వర్తించదు. 

    గతేడాదే ప్రారంభం

    ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (M.A.I).. గతేడాది సెప్టెంబరు 23న ‘నేషనల్‌ సినిమా డే’ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్‌ ఇచ్చింది. 

    కరోనానే కారణం..! 

    తొలుత సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’ నిర్వహించాలని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ భావించింది. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో దానికి గుర్తుగా సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’గా జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో దానిని సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. చివరకూ అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’గా ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    సినీ ప్రియులకు పండగే!

    ఇక వచ్చే వారం పలు బడా చిత్రాలు రిలీజ్‌ కాబోతున్నాయి. రామ్‌ పోతినేని ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్‌ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) తదితర చిత్రాలు వచ్చే శుక్రవారం (సెప్టెంబరు 28) రిలీజ్ కానున్నాయి. అటు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv