• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!

    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం. 

    ఊరు పల్లెటూరు

    ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు.

    బతుకమ్మ

    సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్‌ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు. 

    చమ్కీల అంగీలేసి

    దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు.

    దండికడియాల్

    రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు. 

    దిల్ కుష్

    తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు.

    సౌ శర(పరేషాన్)

    పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని  చెబుతున్నాయి. 

    గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్)

    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv