• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?

    మలయాళ నటి ‘మమితా బైజు’ (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూగా కనిపించి యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్‌ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్‌ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్‌, మిని. మమితా సోదరుడి పేరు మిథున్‌. 

    కిడంగూర్‌లోని మేరి మౌంట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌ హైయర్‌ సెకండరీ స్కూల్స్‌లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. 

    పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే ‘సర్వోపరి పలక్కరన్‌’ (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది. 

    ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్‌ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌’, ‘ఆపరేషన్‌ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది. 

    2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్‌ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకుంది. 

    గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్‌ అండ్‌ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది. 

    ‘ఖోఖో’ సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్ అవార్డ్‌’ అందుకుంది. 

    మమిత 16వ చిత్రం ‘ప్రేమలు’.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 

    ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది.

    ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు.

    ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రెబల్‌’ అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది. 

    తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది.  తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది. 

    తెలుగులో ఇష్టమైన నటుడు ‘అల్లు అర్జున్’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది. 

    మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్‌లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట.

    ఆమె తండ్రి బైజు క్రిష్ణన్‌ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్‌ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv