టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాలిడ్ విజయాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇవాళ (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టిన రోజు. 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో చైతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి ఘనమైన కుటుంబ నేపథ్యం అక్కినేని నాగ చైతన్యకు ఉంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని చైతూ కొణికి పుచ్చుకున్నాడు.
1986 నవంబర్ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మీ (డి. రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరి) దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు.
నాగచైతన్య చిన్నప్పుడే లక్ష్మీతో నాగార్జున విడిపోయారు. దీంతో చెన్నైలో తల్లి వద్దనే చైతన్య పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాడు.
హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో కామర్స్ చేశాడు. చదువులో చైతన్య బ్రిలియంట్ ఏమి కాదు. తాను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రస్తుతం నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)ను చూస్తే చాలా ఫిట్‌గా 38 ఏళ్లు వచ్చినట్లు అసలు కనిపించడు. కానీ టీనేజ్‌లో అతడు చాలా లావుగా ఉండేవాడు. 98 కేజీల వరకూ బరువు ఉండేవాడట.
చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుండటంతో అప్పట్లో అందరూ ‘డంబూ’ అని చైతూను పిలిచేవారట. అక్కినేని కంటే దగ్గుబాటి ఫ్యామిలీ వారే చైతూనూ బాగా ముద్దు చేశారని సమాచారం.
హీరో కావాలన్న కోరిక నాగచైతన్య చిన్నప్పటి నుంచి లేదట. డిగ్రీ మిడిల్‌కు వచ్చాక కూడా కెరీర్‌పై స్పష్టత లేదట. తండ్రితో షూటింగ్స్ వెళ్లడం వల్ల సినిమాలపై చైతూకి ఆసక్తి వచ్చింది.
సినిమాల్లోకి వస్తానని నాగార్జునకు చైతూ చెప్పగా నీ ఇష్టమని ఆయన బదులిచ్చారు. అయితే బరువు తగ్గాలని మాత్రం సూచించినట్లు తెలిసింది.
నాగార్జున సూచనతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన నాగచైతన్య బాగా బరువు తగ్గాడు. దాంతోపాటు కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్ స్కూల్లో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాడు.
అలా 2009లో ‘జోష్’ సినిమాతో నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చేసిన ‘ఏం మాయ చేశావే’ సినిమా నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పింది.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుడు అనగానే ముందుగా నాగ చైతన్యనే గుర్తుకు వస్తాడు. ఈ మధ్య పర్వాలేదు గానీ మెుదట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సైతం చైతూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు.
సోషల్ మీడియాలో పంచుకుంటే ఇక మన ప్రైవసీ ఏముందని నాగ చైతన్య తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేటుగానే ఉండాలని ఈ కుర్ర హీరో అభిప్రాయం.
నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) చూడటానికి సాఫ్ట్‌గా కనిపించినా రేసింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంటాడు. హైస్పీడ్ బైక్స్, కార్లు అవలీలగా నడిపేస్తుంటాడు
వాస్తవానికి రేసర్ కావాలని తొలుత నాగ చైతన్య భావించాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నట్లు అతడి సన్నిహితులు చెప్పారు. కొన్ని కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.
ప్రొఫెషనల్ రేసర్ కానప్పటికీ ఇప్పటికీ రేసర్‌గానే తనని తాను భావిస్తుంటాడు చైతూ. రేసింగ్ కార్లను కొనుగోలు చేయడం అభిరుచిగా పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో ఫుల్ స్పీడుతో డ్రైవింగ్ చేస్తుంటాడు.
ప్రస్తుతం చైతూ గ్యారేజీలో ఫెరారీ, నిస్సాన్ జీటీ-ఆర్, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్ రోవర్ వోగ్ లాంటి అత్యంత వేగంగా వెళ్లే కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి రేసింగ్ బైక్స్ కూడా ఉన్నాయి.
ఫిట్‌నెస్‌కు చైతూ (HBD Akkineni Naga Chaitanya) చాలా ప్రాధాన్యత ఇస్తాడు. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు. ఇందుకోసం ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
చైతూకి మెుహమాటం చాలా ఎక్కువ. అతడితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరికైనా ఇది తెలిసిపోతుందని ఆయన ఫ్రెండ్స్ చెబుతుంటారు.
చైతూకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువేనట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా. బంధుత్వానికి మించిన స్నేహం చిన్నప్పటి నుంచి వారి మధ్య ఉంది.
చైతూ మంచితనం, వ్యక్తిత్వం చూసి ‘స్వీట్ కిడ్’ అని పేరు పెట్టానని రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చైతూని ఎవరైనా ఇష్టపడతారని పేర్కొన్నారు.
చైతూ ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే ‘బటర్ చికెన్’ అంటే అతడికి బాగా ఇష్టం. వారంలో కనీసం రెండుసార్లైనా అది ఉండాల్సిందేనని చైతూ చెబుతుంటాడు.
నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)కు ఓ ఊతపదం ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప అది గుర్తించలేరు. ఇంతకీ ఆ పదం ఏంటంటే ‘యూ నో’.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిపై టీనేజ్ నుంచి నాగచైతన్యకు క్రష్ ఉండేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.
ఏడేళ్ల పాటు ప్రేమించి స్టార్ హీరోయిన్ సమంతను 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతే నాలుగేళ్లకే (2021) వారు విడిపోయారు.
ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను 2024 ఆగస్టు 8న చైతు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.
ఇక సినిమాల విషయానికొస్తే విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ (నవంబర్ 23) చైతూ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘NC 24’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ నిర్మించనున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం