అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa: The Rule). ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. మరో పది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో ఐటెం సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బన్నీ, రష్మిక, శ్రీలీల సహా ‘పుష్ప 2’ టీమ్ అంతా హాజరయ్యింది. ఈ క్రమంలో రష్మిక చేసిన కామెంట్స్ ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండతో రిలేషన్, పెళ్లి గురించి ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక ఏమన్నారంటే?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక మందన్న (Rashmika Mandanna) లవ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జోడి చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ఈ క్రమంలో చెన్నై వేదికగా జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్‌లో తామిద్దరం లవ్‌లో ఉన్నట్లు రష్మిక పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా ఫటా ఫట్ ఆన్సర్స్ ఇచ్చేసింది. ‘మీకు చాక్లెట్ బాయ్ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్ అంటే ఇష్టం’ అని రష్మిక బదులిచ్చింది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో అందరూ అనుకున్నట్లుగానే రౌడీ బాయ్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాని రష్మిక హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మళ్లీ దొరికేసిన విజయ్-రష్మిక!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇద్దరూ కలిసే డిన్నర్లు, పర్యటనలు కూడా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మరోమారు విజయ్ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.
గతంలోనే క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది.
డేటింగ్ గురించి ఒప్పుకున్న విజయ్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల ‘సాహిబా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబర్ 5న ఇది విడుదల కానుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ