అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పుష్ప టీమ్ తాజాగా తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియో సినీ లవర్స్‌లో కొత్త భయాలను సృష్టిస్తోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్గెస్ట్ మూవీ కోసం శ్రమిస్తున్న సుకుమార్!
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై యావత్ దేశం ఎదురుచూస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయమే ఉండటంతో అందరూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ టీమ్ ఓ ఆసక్తికర వీడియోను ఎక్స్‌లో పెట్టింది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్న వీడియోను పంచుకుంది. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కోసం ‘ఏరౌండ్ ది క్లాక్’ సుకుమార్ పనిచేస్తున్నారని మూవీ టీమ్ రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్ టీమ్ వ్యక్తికి సుకుమార్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.
ఆందోళన ఎందుకంటే?
‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ సుకుమార్ పోస్టు ప్రొడక్షన్ పనులే చేస్తూ ఉండటంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఇంకా పోస్టు ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తుండటం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా నాలుగో పాట షూటింగ్ కూడా శుక్రవారం (నవంబర్ 22) నుంచి స్టార్ట్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న టాక్ ఉంది. ఇటీవల థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంపై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడని కథనాలు కూడా వచ్చాయి. ఇన్ని పెండింగ్ వర్క్స్ పెట్టుకొని రెండు వారాల్లో సినిమాను ఎలా రిలీజ్ చేస్తారోనని బన్నీ ఫ్యాన్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి క్షణంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి హ్యాండ్ ఇస్తారేమోనని అనుమానిస్తున్నారు.
అదుర్స్ అనేలా ‘కిస్సిక్’ ప్రోమో
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. మొదటి సినిమా ‘ఆర్య’లో ‘అ అంటే అమలాపురం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ కూడా అందరినీ ఊర్రూతలూగించింది. గత చిత్రం పుష్పలోని ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ సాంగ్ యావత్ దేశాన్ని స్టెప్పులు వేసేలా చేసింది. ఇప్పుడు ‘పుష్ప 2’లోనూ అలాంటి సాంగ్ ఉంది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులు వేసింది. నవంబర్ 24న ‘కిస్సిక్’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్ పక్కా హిట్ అయ్యేలా కనిపిస్తోంది. ఓ సారి ప్రోమోను మీరూ చూసేయండి.
‘కిస్సిక్’ హైప్‌కు కారణం ఇదే
డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. అయితే ‘కిస్సిక్’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే ‘కిస్సిక్’కు మాత్రమే ఈ స్థాయి హైప్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్ డ్యాన్సర్ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం