కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. సినిమా విశేష ప్రేక్షకదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ కూడా రాబోతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Kantara Team Accident) గురైనట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను సైతం మేకర్స్ నిలిపేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి నటిస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్‌కు అనుకోని విధంగా బ్రేక్ పడింది. ఆదివారం (నవంబర్ 24) రాత్రి షూట్ పూర్తి చేసుకుని చిత్రబృందంలోని 20 మంది సభ్యులు ఓ మినీ బస్సులో కర్ణాటకలోని జడ్కల్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా (Kantara Team Accident) పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారట. పెద్ద స్టార్స్ ఎవరూ వాహనంలో లేరని అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులేనని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
తప్పంతా అతడితే..!
ప్రమాదాని బస్సు డ్రైవర్ (Kantara Team Accident) నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. డ్రైవర్ ఫోన్ నొక్కుతూ బస్సు నడిపాడని, అందుకే ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే డ్రైవర్‌పై దాడి చేసినట్లు కూడా తెలిసింది. సమాచారం అందుకున్న టూరిస్ట్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని సమాచారం అందింది. అలానే పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేశారు.
యుద్ద విద్యలో ప్రత్యేక శిక్షణ
సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. దీంతో ‘కాంతార చాప్టర్ 1’ మేకర్స్ పట్టాలెక్కించారు. స్టార్ హీరో రిషభ్ శెట్టి సొంత డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపందనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిషబ్ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. 2025 అక్టోబర్ 2న దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని ఇప్పటికే టీమ్ ప్రకటించింది.
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..
‘కాంతార చాప్టర్ 1’ నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇటీవల మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ‘మహావతార్: నరసింహ’ (Mahavatar Narsimha) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయనుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ