నటీనటులు: రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు
దర్శకత్వం: అంజి గరుడవేగ
సంగీతం: చరణ్ అర్జున్
ఎడిటర్: చింతాల మధు
నిర్మాత: రాకింగ్ రాకేష్
నిర్మాణ సంస్థ: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (Kesava Chandra Ramavat Movie) . షార్ట్ కట్లో ‘కేసీఆర్’ (కేసీఆర్)’. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్ హీరోయిన్గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్, రచ్చరవి, లోహిత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్ రాకేష్ మెప్పించాడా? కేసీఆర్ అభిమానిగా హిట్ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review)
కథేంటి
వరంగల్ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్ అలియాస్ కేసీఆర్ (రాకింగ్ రాకేష్) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్ నటుడు లోహిత్, మామ పాత్రలో మైమ్ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ఏవిధంగా డెవలప్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- రాకింగ్ రాకేష్ నటన
- భావోద్వేగ సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- పొలిటిషియన్‌ను హైలేట్ చేయడం
- కొన్ని సాగదీత సన్నివేశాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం