తెలుగు జానపద గీతాలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పడతాయి. మన పల్లె జీవన విధానంలో ప్రతి చిన్న సంఘటనను, ఆచారాలను, ఆనందాలను, బాధలను ఈ పాటలు ప్రస్తావిస్తాయి. జానపద గీతాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనశైలిని, జీవన విలువలను ప్రతిబింబించే అద్భుత సాధనాలుగా నిలిచాయి. పంట పండుగలు, వివాహ వేడుకలు, పిల్లల ఆటలు, జాతరలు మొదలైన ప్రతి సందర్భంలోనూ జానపద గీతాలు అనేక భావాలను వ్యక్తపరుస్తాయి.
ఈ పాటల్లోని పదాలు సూటిగా, సరళంగా ఉండి ప్రతి వ్యక్తిని ఆవేశపరుస్తాయి ఆలోచింపజేస్తాయి. గ్రామీణ జీవితం నుండి పుట్టుకొచ్చిన ఈ పాటలు, మన ప్రాచీన జ్ఞానాన్ని, జ్ఞాపకాలను భావితరాలకు అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసిన ఈ పాటలు, ఆవల కదలకుండా మన సంస్కృతి వారసత్వాన్ని తరతరాలపాటు నిలుపుతున్నాయి.
ఈ కథనంలో, తెలుగు జానపద గీతాల ప్రత్యేకత, వాటి గాధ, వాటి వినూత్నతను అవగాహన చేసుకుందాం.
Contents
- 1 మందేంట పోతండే ఎలమంద…
- 2 కష్టపడ్డా ఇష్టపడ్డా
- 3 మా గల్లీల ఒక్కడు పోరడు
- 4 ఓ పిల్లగా యంకటేషు…….
- 5 ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా
- 6 ఎందిరా ఓరి వెంకటి
- 7 కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో
- 8 నిండు పున్నమి వేళ
- 9 ఏ…ఏలో ఏలో ఎన్నెల్లో
- 10 సయ్యారే సయ్యారే సారంగ
- 11 వన్నె సిన్నల సక్కనోడే
- 12 ముసురు ముసురుబట్టి
- 13 ఉరుముల రమ్మంటినే
- 14 మెరిసేటి మెఘమైన
- 15 చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు
- 16 ఎమున్నాడే పిల్లడు
- 17 నీ కనుచూపులలో నడిచేవాడు
- 18 ఆ సిన్న సిన్న సింతల బావయో
- 19 మనసుల మనసుంటలేదు
- 20 బోనాల పాట- అమ్మ బయలెల్లినాదో
- 21 నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో..!
- 22 వ్యవసాయానికి సంబంధించిన జానపదాలు
- 23 చేతి వృత్తి జానపద గేయాలు
- 24 వృత్తి పాటలు
- 25 పండుగ పాటలు
- 26 శ్రామిక జానపదాలు
- 27 పెండ్లిలో జానపద పాటలు
- 28 జానపద గేయాలు- వ్యక్తులు
- 29 కొలాటం పాటలు
- 30 హాస్యపు జానపద పాటలు
- 31 లాలి పాటలు
మందేంట పోతండే ఎలమంద…
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద!
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద… (2 times)
అన్గిలేనివోట్టి పై గొంగలేసుకుండు,
అడ్డపంచెను బుడ్డ గోసిగ కట్టిండు,
కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు…..(2 times)
కందిజొన్న కోయ ఎలమంద, కౌంజు పిట్టవలె పోతుండు ఎలమంద
వేలెడంత లేదు ఎలమంద, వేయి మందకే వస్తాదు ఎలమంద..ఆ..
(మందేంట పోతండే ఎలమంద 2 times)
ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతాడు,
ఎత్తైన గుట్టలెల్ల తిరుగుతాడు
వాగుల వంకల రాగాలు తీస్తాడు…..(2 times)
చెరువు గట్టున నిలిచి ఎలమంద చందమామోలె నవుతాడు ఎలమంద
తుమ్మనీడ ఉంటె ఎలమంద అమ్మావొడిని మరుసుతాడే ఎలమంద
(మందేంట పోతండే 2times)
మూతికి జానెడు మోదుగ సుట్టను
సేతి సద్దున పెట్టి గుప్పున గుంజేటి
తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు…..(2times)
పిర్ర గిల్లంగనే ఎలమంద వాడు టిర్రుమంటడమ్మ ఎలమంద
వీడు కూత పెట్టంగనే ఎలమంద వేట తోడేళ్ళు పరారు ఎలమంద
(మందేంట పోతండే 2 times)
తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన
ముల్లుకొట్టి గొర్రె కాలిడ్చిన గాని
తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు….(2times)
కొట్టకులోట్టకు ఎలమంద చెట్టు నూరి కట్టుతాడే ఎలమంద
యాడ నేర్చిన విద్య ఎలమంద,గొల్ల కురమవాడ విద్య ఎలమంద..
(మందేంట పోతండే- 2times)
యడాదికోసారి గోర్లేల్లి పోతుంటే…
తోడుగున్న గొర్లు యాడికిపొతున్నయని తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు
గొర్ల కటికివనికమ్మ ఎలమంద కండ్ల నీళ్ళు పెడతాడమ్మ ఎలమంద
గొర్లు తరలిపోతువుంటే ఎలమంద వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద(వాడు గోల్లుమంటడమ్మ..)…ఓ..
కష్టపడ్డా ఇష్టపడ్డా
నీ మీద మన్నుపోత్తే, నీ మీద దుమ్ముపోత్తే, నిన్నెత్తుకపోతే, నీ ఏట్ల పెట్ట, నీ తాడు దెంప, నీ తలపండ్లు పలగ, నీ దింపుడుగల్లం గాను బుజ్జే, ఓ బుజ్జీ..!
అతడు: ఏయ్, ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు..!
(జుమ్ జుమ్)
కష్టపడ్డ, ఇష్టపడ్డ, లవ్ ల బడ్డ
అది కాదంటే కాళ్ళమీద బడ్డ
అది సరే అంటే సంబరపడ్డ
దానన్నలతోటి తన్నులపడ్డ
కిందపడ్డ, మీద పడ్డ
కర్మగాలి జైళ్ల పడ్డ
వాన్ని వీన్ని బతిలాడి
ఆఖరికి బైటపడ్డ
(ఏ, కొంచెం బీట్ల ఏడువు..!)
(జుమ్ జుమ్ జుమ్)
అతడు: మోసం చేత్తివి కదరా బుజ్జో, ఓ బుజ్జీ
ఏం పాపం చేసిన్నే బుజ్జో, ఓ నా బుజ్జి
ఊకో ఊకో… సిగ్గు లేదు
ఏడ్తవా మొగోనివై
ఊకో ఊకో, జుమ్
అవవవవవవ బుజ్జో
అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా
లాకరు బోకరు గాన్ని తెచ్చి
లచ్చల కట్నం ఇత్తరె బుజ్జో, ఓ బుజ్జీ
అచ్చంగా లవ్ జేత్తే బిచ్చపోడంటరే బుజ్జే
(ఊకో)
పిత్త బలిసినోళ్లకే పిలిశి పిల్లనిత్తరే బుజ్జో, ఓ బుజ్జీ
ప్రాణంగా ప్రేమిత్తే ప్రాణమే తీత్తరా బుజ్జే
(అయితే ఏవంటవ్..!)
ఆడు కట్నకానుకలు తీసుకునే వేస్ట్ గాడైతే
నేను ఎదురుపెట్టబోతులు పెట్టి పెళ్ళి చేసుకొనే
గట్సున్న మోతగాన్ని బుజ్జో, రా బుజ్జీ…
(ఏయ్ సరేగాని అమ్మాయి కోసం
ఏం కొన్నవో చెప్పో, జుమ్..!)
పాలమ్మిన, దానికి పట్టుశీరె కొన్న
(ముప్పై వేలు)
పూలమ్మిన, దానికి పుస్తెల్ తాడు కొన్న
(యాభై వేలు)
బోర్ వెల్ నడిపిన, ఇంట్లె బాసన్లు కొన్న
(డెబ్భై ఐదు)
బర్లను పెంచిన, దానికి బంగారం కొన్న
(లచ్చ)
ఒళ్ళు వంచి ఇల్లు కొన్న
సెమట కార్చి కారు కొన్న
బెడ్డుమీద పరుపు కొన్న
పదిమందిల పరువుగున్న
ఇజ్జత్ తీత్తివి కదనే బుజ్జో, ఓ బుజ్జీ
ఏం పాపం చేసిన్నె బుజ్జో, ఓ నా బుజ్జి
వదినె వీడు జైళ్ళుండే కదా
బైటికొచ్చిండు కదు, తెల్వదా
ఒరెక్కొ… మరి పొల్లెంజేత్తంది
ఆ, అటుంటంది… ఇటుంటంది
మనకెందుకులే వదిన, ఊకో
ఊకో ఊకో ఊకో… సిగ్గు లేదు
ఏడిపిత్తరా మొగోన్ని..!
అవవవవవవ బుజ్జో
అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా
నా కళ్ళ నీళ్లు జూసి
నీ కంటికి నిద్రెట్ల పట్టె బుజ్జో, ఓ బుజ్జీ
మన జ్ఞాపకాలు మర్శి నీకు
బువ్వెట్టా వంటబట్టె బుజ్జీ
ఊరంతా పొక్కినంక
ఊరిచ్చుడెందుకింక బుజ్జో, ఓ బుజ్జీ
మనుసులు కలిసీనంక
డొంకతిరుగుడెందుకె ఇంకా బుజ్జో
(మరిఇప్పుడేమంటవ్..!)
దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు
మనం ఎప్పుడో పెట్టుకున్న కనెక్షనుకు మీ అన్నల
రియాక్షనేందో నీ ఓవరా క్షనేందో
అర్ధం కావట్లేదు బుజ్జో, ఓ బుజ్జీ
(ఓయ్, ఇప్పుడేమంటవ్ మరి..! జుమ్)
లొల్లిజేత్తె… పబ్లికైత
పెళ్లి జేత్తే… ధావతైత
హాయిగుంటే… హనీమూనైత
మీ అండ ఉంటె… దండం పెడతా
లైకు కొడితే ఐకానైత
షేరు జేస్తే ప్యారుగుంట
సబ్ స్క్రైబ్ జేస్తే సక్సెసైత
(జుమ్ జుమ్ జుమ్)
భోలే ఆఫీసియల్ ఛానల్
పెట్టుకున్నమె బుజ్జో, ఓ బుజ్జీ
భోంబాటుగా చూసుకుంటనే
బుజ్జో, ఓ నా బుజ్జీ
మా గల్లీల ఒక్కడు పోరడు
మా గల్లీల ఒక్కడు పోరడు
అందగాడడు నన్ను జూత్తడు
నన్ను జూసిన జూడనట్టుంటడు
నవ్వుతుంటడు, కన్నుగొడతడు, సైగ జేత్తడు
వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు, సరసమంటడు, లొల్లి జేత్తడు
ఇగ పొద్దున్నే మా వాడకత్తడు
కావలుంటడు అడ్డమొత్తడు
నన్ను కాలేజికే బోనీయడు
బండిదెత్తడు, ఎక్కమంటడు, పోదామంటడు
నాకు ఊరు వాడ జూపిత్తడు
జాతరంటడు తొల్కవోతడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు, రాజునంటడు, మురిసిపోతడు
వాడు సక్కని మనసున్న పోరడు
ఊరినిడవడు ఊళ్ళే ఉంటడు
ఈ ఊరంతా నా వోళ్లే అంటాడు
తోడుగుంటడు, సాయమైతడు, సాగిపోతడు
వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
కాని లేనోడు అన్నట్టుంటడు
అందరితోని గలిసి మెలిసుంటడు
బుద్ధిమంతుడు, సదువుకున్నోడు, సక్కనైనోడు
వాడు సుక్కల్లో మెరిసేటి సెంద్రుడు
కలవ కళ్ళోడు… కాంతి నవ్వోడు
పారాయి అమ్మాయిలని జూడడు
దారి ఇస్తడు, పక్కకెలతడు, పారిపోతడు
మరి నేనంటే పడి సచ్చిపోతడు
నన్ను ఇడవడు, కలవరిత్తడు
వాడు పడుకున్నా… నా పేరే తల్తడు
మొండి గుణమోడు, మాయజేశాడు
మనసు దోశాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు, ఏలుకుంటాడు, తోడుగుంటాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడు
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు, ఏలుకుంటాడు, తోడుగుంటాడు
ఓ పిల్లగా యంకటేషు…….
ఓ పిల్లగా యంకటేషు…….
ఓ పిల్లగా యంకటేషు…….
సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో
ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూబిస్తవో
సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో
ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూబిస్తవో
ఓ పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
ఆ.. అందాల గుమ్మ నేను ఆగక పొతున్నవో అలుసుగా చుస్తున్నవో
నీ సొమ్మేమన్న అడిగిన్న నా సోకులవడుతున్నవో సొమ్మసిల్లి పోతవో
నీయంట తిరుగుతున్ననని అలుసైపోతున్నన నువ్వేగావాలనొస్తే నన్నేగాదంటావా
ఓ పిల్లగా.. ఓ పిల్లగా..
యహ ఓ పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
ఏ కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి
బొమ్మల నడుమ బొట్టువెడితే పల్లెతనంగుంటను నిన్నే ఇడిసిపెట్టను
అవ్వఅయ్యకు సిన్నదాన్ని సివంగీ పిల్లను సిన్నచూపు చూస్తే నిన్ను నేను ఇడిసిపెట్టను
ఓ పిల్లగా.. అరెరే ఓ పిల్లగా..
అమ్మో ఓ పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగా యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
యహె మనవూరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె నేనురో
ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే గోరుకుంటిరో నీతోన వస్తనంటిరో
నువ్వే నాపానమంటి నీతోన బతుకంటి నిన్నిడిసి ఉండలేను నీ యంటే వస్తా.. నీ యంటే వస్తరో
ఓ పిల్లగా యంకటేషు…….
ఓ పిల్లగా యంకటేషు…….
ఓ పిల్లగా యంకటేషు…….
తా నా నే న న్న నే, తా నే న న్న నే
తా నా నే న న్న నే..
తా నా నే న న్న నే, తా నే న న్న నే
తా నా నే న న్న నే..
ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా
ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
అందమైనదాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
మన ఆస్తిపాస్తులన్నీ దానింట్ల పెడుతుంటే మన ఇల్లు సిన్నగవుతున్నదే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
పదిమందిచూస్తుండ్రు పదిమాటలంటుండ్రు పరువంతావోతుంది రావోయి రాజా
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
రాత్రంతా దానింట్ల పగలంతా దానింట్ల ఎప్పుడూ దానింట్ల వుంటివే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
మాఇంట్ల సుకంగా నీఇంట్ల కష్టాలు దుఃఖంతో నేనెల్లదీస్తున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
నన్నిడిసి నువ్వుంటే నేబతకలేకున్నా నేను సచ్చిపోతాను సెలవియ్యే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకంటూ నేనుండా పోతున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా…
ఎందిరా ఓరి వెంకటి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
మగ: నిన్ను చూడకుంటే
పాణం ఆగమైతున్నదే ఒంటికి
నిదుర లేదే కంటికి
నిన్న కప్పుకున్న దుప్పటి
నిదుర లేదే కంటికి
నిన్న కప్పుకున్న దుప్పటి
ఆడ: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
సిగ్గులేదేరా వెంకటి
సిరగుంజుతావు దేనికి
సిగ్గులేదేరా వెంకటి
సిరగుంజుతావు దేనికి
మగ:: లగ్గమాడేటోడ్నే నేనే
నంగాతనం దేనికి
నీకు మేనబావని
నెట్టాకే నన్ను పొమ్మని
నీకు మేనబావని
నెట్టాకే నన్ను పొమ్మని
ఆడ: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎహే ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందుకురా వెంకటి
ఫోను కొట్టుడు గంట గంటకి
ఎందుకురా వెంకటి
ఫోను కొట్టుడు గంట గంటకి
మగ:: నీ మాట వినకుంటే
పాణం గాయి గాయి గుండెకి
సొయా లేదే ఒంటికి
జరమొచ్చినట్టు పెయ్యికి
ముద్దియ్యే ఒకటి వెళ్ళిపోతాడు వెంకటి
మగ:: ఇజాత్తు పోతది వెంకటి
వత్త పోరా మాపటికి
ఇజాత్తు పోతది వెంకటి
వత్త పోరా మాపటికి
మగ:: చెట్టెక్కిన గౌడన్న కళ్ళు తియ్యా ఆగడే
పోనే పోడు వెంకటి
ఏమైనా గాని పూటకి
పోనే పోడు వెంకటి
ఏమైనా గాని పూటకి
ఆడ: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
గోసపెట్టకు వెంకటి
మా అయ్యా వత్తాడు ఇంటికి
గోసపెట్టకు వెంకటి
మా అయ్యా వత్తాడు ఇంటికి
మగ:: మీ అయ్యా వత్తె ఏమైతది
మైల పోలె పూటకి
బండి కడతా ఎడ్లకి
బైలెళ్లు ఇంటికి
బండి కడతా ఎడ్లకి
బైలెళ్లు ఇంటికి
ఆడ: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
నా ముద్దుల వెంకటి
మాటింటాడే సంగటి
నా ముద్దుల వెంకటి
మాటింటాడే సంగటి
మగ:: ఇక పోతున్న పోతున్న
మరిచిపోకే మాపటికి
గౌన్ల అరటి తోటకి
వచ్చి పోవే ఆడకి
గౌన్ల అరటి తోటకి
వచ్చి పోవే ఆడకి
ఆడ: గౌన్ల అరటి తోటకి
వత్త పోరా ఆడికి
గౌన్ల అరటి తోటకి
వత్త పోరా ఆడికి
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ…
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో…..
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ…నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ…
పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు… ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు…
వెండి మెరుపుల నవ్వునీదే….. వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో…..
నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ….. $కంచరేగి తీపి$
మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె….నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును…
వాలిపోయిన కందిసేనే….. వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో…..
నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ….. $కంచరేగి తీపి$
కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి…ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన…
పొద్దే ముద్దయి గోరింటైతదే ….. పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో…..
పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ….. $కంచరేగి తీపి$
ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి…దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన…
అలసినీవు కునుకుపడితే….. అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో…..
ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ….. $కంచరేగి తీపి$
నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి…జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి…
దారిలో పల్లేరుముల్లె….. దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో…..
నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ….. $కంచరేగి తీపి$
ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు…..నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు…
నీ సెమటసుక్కలు రాలుతుంటే…. నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో…..
ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ…… $కంచరేగి తీపి$
నిండు పున్నమి వేళ
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే
కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించు నీమాట రా
నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే
కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించు నీమాట రా
చినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
ఓ పిల్లా పాట కోయిలమ్మా వే
మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
ఓ పిలగా నన్నేదో సేయకురా.. ఆ…
పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్ల నేవిడువనే..
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే
కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించు నీమాట రా
తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా
ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా
ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే
కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రా
ఓ పిలగా సాలించు నీమాట రా
ఆశలు ఎన్నోలోన చిగురిస్తున్నవి నన్ను అడుగు తున్నావే
ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
మాయేదోచేసి నువ్ నా మనసు దోసినావ్ నా లోకం అయినావురా
ఓ పిలగా నీ మీద మనసాయారా
నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
ఓ పిల్లా కలకాలం కలిసుందామే
ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
ఓ పిలగా కలకాలం కలిసుంటారా
ఏ…ఏలో ఏలో ఎన్నెల్లో
ఏ…ఏలో ఏలో ఎన్నెల్లో
పచ్చని పందిళ్లు కురిసేనల్లో
ఏలో ఏలో ఎన్నెల్లో
ఏలుబట్టేవాడు ఎక్కడున్నాడో
అరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడు
ఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడు
అరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడు
అహే ఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడు
గుండెనే పంచి ఇస్తడా
పక్కనే కాసుకుంటడా
పండుగై కదిలొస్తడా
ప్రాణాలే రాసి ఇస్తడా
నా ప్రాణమే ఆగనన్నది
ఆడి పాడి ఆరాటమైనది
సయ్యారే సయ్యారే సారంగ
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
ఏదారిలొస్తాడో ఎంతెత్తువుంటాడో
ఏవూరీలుంటాడో ఎంతటందగాడో
ఏదారిలొస్తాడో ఎంతెత్తువుంటాడో
ఏవూరీలుంటాడో ఎంతటందగాడో
ఈడ ఎంజెస్తున్నవే కోయిలమ్మ
వాడు ఎక్కడున్నాడో జూడవమ్మా
వాని అందాన్ని జూసిపాడవమ్మా
నీ గొంతునుంచో ఓ పాటనమ్మా
ఎన్నాళ్ళు ఎదురుచూపులు
ఎదురయి వస్తాడేప్పుడు
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
వాడు రోజు కల్లోనే నాకు కలవరింతలే
అందగాడో ఏమో నే నాకందకున్నాడే
వాడు రోజు కల్లోనే నాకు కలవరింతలే
అందగాడో ఏమో నే నాకందకున్నాడే
వాని కన్నుల్లో మందార మాయాజాలం
కట్టిపడేసి నన్నింతకాలం
నేనెప్పుడు ఎక్కడ సూడలేదు
నాలోన ఇంతటి గందరగోళం
వాడే నా వాడై
సూడ వస్తే ఎం చెయ్యాలే
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
నను చూసి మెచ్చుకుంటే నా చూపులు రాసిస్తా
నన్ను కట్టుకోని పోతే నా జిందగి వానికిస్తా
నను చూసి మెచ్చుకుంటే నా చూపులు రాసిస్తా
నన్ను కట్టుకోని పోతే నా జిందగి వానికిస్తా
పారాణి పెట్టిన పాదాలకు పెట్టి మెట్టెలు పెట్టేటోడు
మారాణి లెక్క సూడకున్నా నా రాణి వంటూ సూస్తే సాలు
మొగిలి పువ్వుల అందగాడు మొగుడై వచ్చేదెన్నడే
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
సయ్యారే సయ్యారే సారంగ సన్నాయి సప్పుడు మొగంగా
సయ్యారే సయ్యారే సామీ రంగా సంపెంగ నవ్వులు పూయంగా
వన్నె సిన్నల సక్కనోడే
వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే
అరె సిగ్గు బిడియాన్నంత వాడు
ఓయ్ దోసుకోని పోయినాడు సూడే
వద్దంటే గుండెల్లో జేరి
అరె పొమ్మంటే పోనే పొడే
వాడు పొమ్మంటే పోనే పొడే
వాడే అందగాడే
అరె సుక్కల్లో సెందురుడే
నన్నే ఏలుకోని
ఓయ్ మహారాణిల చూసుకుంటడే
వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే
అలక మానుకోవ నా అందాల బావ
చేరదీసుకొని జర నన్నేలుకోవ
మనసు ఇడవకుంది నీ మీద ఉన్న యావ
నీ మీద ఉన్న ప్రేమెంటో తెలుసుకోలేవా
సణుగుడు గొణుగుడింక పక్కనెట్టి జూడయ్యో
ఇష్టపడ్డ పిల్లనింత కష్టపెట్టకూ
వలపు వన్నెలున్న సిన్నదాన్ని కాదంటూ
ఆగంగా ఒక్కతీరు ఇడిసిఎల్లకూ
ఆగంగా ఒక్కతీరు ఇడిసిఎల్లకూ
వీడే అల్లరోడే
వరసైన నా వన్నెలాడే
నా వాడే తుంటరోడే
నన్ను ఉన్నసోట ఉండనీయడే
వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే
పొద్దువాలుతుంది వయసు తోడుకోరుకుంది
చెలిమిచేరుకోని నిన్ను సేద తీరమంది
నిలిచి నిన్ను జుడా కంగారు కలుగుతుంది
నను దూరముంచుతుంటే మనసు తల్లడిల్లుతోంది
పరమటబట్టలేక ఎంటబడి వస్తుంటే
సిన్న సూపు జూసి నన్ను బాధపెట్టకూ
సక్కనైన సిన్నదాన్ని తగ్గి జర వస్తుంటే
పొంగిపోయి లేని పోనీ బెట్టు జేయకూ
పొంగిపోయి లేని పోనీ బెట్టు జేయకూ
వీడే అల్లరోడే
వరసైన నా వన్నెలాడే
నా వాడే తుంటరోడే
నన్ను ఉన్నసోట ఉండనీయడే
వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే
ముసురు ముసురుబట్టి
ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన
పరుపు బండలమీద పారాణివైనావు
సేను సెలక మీద పరుపై సేరావూ
వాగు వంకలల్లే వడి వడిగా పారావు
చెరువమ్మా కడుపాన సల్లంగా వదిగావూ
అలుగులువారుతూ కనువిందు చేసేవూ..
అలుగులువారుతూ కనువిందు చేసేవు
పాల నురగలు చిలికి పైపైకి తేలేవూ..
ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన
నెర్రవారిన నల్లరేగళ్లు ముద్దాడి నాగళ్లకు కొత్త నడకను నేర్పావూ
తొలకరిజల్లువై చిటపటరాలావు రైతుల కంఠాన ఊపిరి పోసేవూ
ఆ నీలినింగిలోన నిగ నిగ మెరిసేవూ..
ఆ నీలినింగిలోన నిగ నిగ మెరిసేవు
నల్లమబ్బులుకమ్మి నేలపై కురిసేవూ..
ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన
అడవితల్లికి పట్టువస్త్రాలే కట్టినవు
జీవాల అందాల నిలయమై వెలిసినవూ
మూగజీవులనేమో మురిసేలా జేసినవు
నేలమ్మా నుదుటన సింధూరమైనావూ
కోటిజీవరాసులకల్లా జీవాన్ని పోసినావూ..
కోటిజీవరాసులకల్లా జీవాన్ని పోసినావు
అన్నిగత్తులు తడిపి గంగమ్మవైనావూ..
ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన
ముసురు ముసురుబట్టి మురిపంగా కురిసేవే వాన వాన
చినుకు చినుకు రాలి సిత్తడి జేసేవే వాన వాన
గట్లపైన రాలి గల గల పారావే వాన వాన
చెట్లపైన కురిసి చెలిమల్లె చేరావే వాన వాన
ఉరుముల రమ్మంటినే
ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే
ఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఉరుముల రమ్మంటినే
మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా
నిన్నే రమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
సినుకై రమ్మంటినే తనువే తాకంటినే
సినుకై రమ్మంటినే తనువే తాకంటినే
తొలుసూరి మొలకల్లే ముస్తాబైతుంటినే
ఓ బావో ఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
కడుపల కూసుంటినే కనులు మూసుకుంటినే
కడుపల కూసుంటినే కనులు మూసుకుంటినే
కలలోనైనా నిన్ను కలిసిపొమ్మంటినే
ఓ బావో ఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
అలుకలు మానంటినే సిలుకై రమ్మంటినే
అలుకలు మానంటినే సిలుకై రమ్మంటినే
ఎంగిలి జెయ్యని జామై ఎదురుసూస్తుంటినే
ఓ బావో ఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
మాటకు సై అంటినే ఆశగా కూసుంటినే
మాటకు సై అంటినే ఆశగా కూసుంటినే
నీ ఊసులు తలుసుకుంటు గోసల నేనుంటినే
ఓ బావో ఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
మెరిసేటి మెఘమైన
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసనే కురవాలి
వానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి
వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలి
వానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి…
పావురాల గువ్వను బాయి మీద గిలకను
పట్టుకుంటే దొరకవోను పల్లెటూరి పిల్లను
అందాల కులుకును పసిపాప పలుకును
పొత్తింట పొంగుతున్న పాల మీద నురగను
చెట్టుమీద జామకాయ కొరికే రామ సిలకను
కొండల్లో కూసేటి కోయిలమ్మనూ
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసమే కురవాలి
వానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి
వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలి
వానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి…
రాములోర జంటను రాతిరేళ మంటను
చెంగు చెంగు ఎగురుతున్న నేను లేడి కూనను
పచ్చాని పైరును విచ్చుకున్న పువ్వును
అందుకుందమంటే కాదు అల్లుకున్న బంధమో
నీలి మబ్బులోన తేలి ఆడు చందమామను
నీటి లోన ఆడేటి చేప పిల్లను
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసమే కురవాలి
వానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి
వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలి
వానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి…
వెలుగుతున్న దివ్వెను మోగుతున్న మువ్వను
పిల్ల గాలి జోల పాడే తల్లి లాలి పాటను
పరువాల జల్లును రంగు హరివిల్లును
పట్టుకుంటే దొరకవోను పల్లెటూరి పిల్లను
పల్లెటూరిలోన ప్రతిఇంటి ఆడబిడ్డను
పకృతమ్మ ఒడిలోన పసిపాపను
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసమే కురవాలి
వానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి
వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలి
వానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి…
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు
అ బల్లె
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
అరె
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
అబ్బా
బొడ్డు కింద చీరగట్టుకొని పిల్ల బోనాల జాతర పోతావుంటే పిల్లా
ఓ పిల్లా
కోడిపుంజులా చీరగట్టుకొని పిల్ల కొమరెళ్లి జాతర పోతావుంటే పిల్లా
అగ్గో
బొడ్డు కింద చీరగట్టుకొని పిల్ల బోనాల జాతర పోతావుంటే పిల్లా
అరె
కోడిపుంజులా చీరగట్టుకొని పిల్ల కొమరెళ్లి జాతర పోతావుంటే పిల్లా
కోరి కోరి నీకొంగువడితినే రాతిరేళగాడ నీచెయ్యిబడితినే
చేతిలో చెత్తిరి అబ్బబ్బ
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
మరి
ముక్కుకు ముత్యాల ముక్కెర దేస్తా చెవులకు కమ్మల బుట్టాలు దేస్తా
వేళ్ళకు వంక ఉంగురాలు దేస్తా మెడలోన మెరిసేటి నక్కులెస్సు దేస్తా
ముక్కుకు ముత్యాల ముక్కెర దేస్తా చెవులకు కమ్మల బుట్టాలు దేస్తా
అరె వేళ్ళకు వంక ఉంగురాలు దేస్తా మెడలోన మెరిసేటి నక్కులెస్సు దేస్తా
కళ్ళకు గజ్జెలు పట్టీలు దేస్తా కట్నాలు లేకుండా పెళ్లి జేసుకుంటా
చేతిలో చెత్తిరి అ బల్లె
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
అబ్బా
నీగాజులేమో గల్లు గల్లు నాపానమేమో జల్లు జల్లు
అరె
నీనవ్వులేమో కిల కిల నాపానమంతా మిల మిల
అబ్బో
నీగాజులేమో గల్లు గల్లు నాపానమేమో జల్లు జల్లు
నీనవ్వులేమో కిల కిల నాపానమంతా మిల మిల
ఏలుబట్టి ఏలుకుంటానే తలంబ్రాలుబోసి తాళికడతానే
చేతిలో చెత్తిరి అ బల్లె
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
అరె
సుక్కలసీర కట్టుకోని పిల్ల పక్కపపడ తీసికోనిపిల్లా
అబ్బా
ఒడ్డుమీద నువ్వు నిల్చుంటే పిల్ల గడ్దిగోసిన గమ్మత్తేపిల్లా
అరె
సుక్కలసీర కట్టుకోని పిల్ల పక్కపాపడ తీసికోనిపిల్లా
మరి
ఒడ్డుమీద నువ్వు నిల్చుంటే పిల్ల గడ్దిగోసిన గమ్మత్తేపిల్లా
నీచీరకొంగు రువ్వు రువ్వు నాపానమంతా లప్పు డప్పు
చేతిలో చెత్తిరి బాలే
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
చేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారి
ఓ ఎర్రజీర పోరి
ఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాల
నా చేతి తువ్వాలా
ఎమున్నాడే పిల్లడు
ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడే
నా మదిలో దూరి తీనుమారు అడుతున్నడే
ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడే
నా హీరో అతడే లవ్వులోన ముంచేశాడే
ఆరడుగులా బుల్లెట్లా మస్తుగున్నడాడే
చూడగానే గుండెలోకి దూసుకొచ్చినాడే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
మాయజేస్తడో మంత్రమేస్తడో గుర్తుకొస్తడు పిల్లడే
ఇంటిగుట్టునే బయటపెట్టి నా వెంట తిప్పుకుంటాడే
దగ్గరుంటడు దూరమంటడు అర్దమవ్వడు పిల్లడే
ఏమి జెప్పనే ఎంత జెప్పనే నన్నుజంపుతున్నాడే
కసురుకుంటడు కయ్య్ మంటడు కొడతనంటూ వస్తాడే
కన్నుగొట్టినా సైగజేసినా అస్సలట్టించుకోడే
ఎం చేయనే సూర్యుడిలాగ కాల్చుతున్నడే
చూడబోతే చెంద్రుడి లాగే ముద్దుకుంటడాడే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
సెల్లుఫోనులో సొల్లుమాటలే ఎందుకంటడు పిల్లడే
సెరువు గట్టునా పలకరించిన కనికరించకున్నాడే
గుండె నిండుగా ప్రాణమంతగా మనసుపడ్డరా పిల్లడా
నెలతల్లికి ఓ బాధ చెప్పి నా మొక్కు చెప్పుకున్నారా
కనులపండగే ఎదుటవుండగా వలపు గుట్టు విప్పాడే
పంట నీరునే ఆపలేనులే గెలుపు తలుపు తెరిచాడే
నీ ప్రేమలో ముత్యంలా మెరిసిపోతినల్లే
అందమైన లోకంలోకి తీసుకెళ్త నిన్నే
నువ్వు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
నీ చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
నువ్వు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
నీ చూపు తాకుతువుంటే నా వొళ్ళు జల్లంటుందే
నీ కనుచూపులలో నడిచేవాడు
నీ కనుచూపులలో నడిచేవాడు
నీ మాటలతోనే మురిసిపోయేటోడు
నలుగుతున్నాడే నీ కోసం పిల్లా
వెతుకుతున్నాడే నీ రూపం
నలుగుతున్నాడే నీ కోసం పిల్లా
వెతుకుతున్నాడే నీ రూపం
పొద్దు పొడుపు సుక్కలా బాగున్నావే ఎన్నెలా
నువ్వు లేక నేనిలా కాలుతున్న కట్టేలా
అంతలోనే నవ్వులు అంతలోనే బాధలు
దేవుడే పగబట్టినాడో రాసె పిచ్చి రాతలు
మేడెమిద్దె ఆస్తులు అందు నీ నవ్వులు
అందుకే చులకనయ్యానా ఎందుకీ కోపాలు
ఓ ఎన్నెలా ఎంత మంచోడమ్మ నిన్ను కోరుకున్న ఈ పిల్లోడు
ప్రాణంగా నువ్వు ప్రేమించిజూడు నీడల్లె ఉంటాడు నీ తోడు
ఓ ఎన్నెలా కష్టబెట్టబోకమ్మ తట్టుకోలేడీసిఎన్నోడు
తనువంతా నువ్వు నిండిపోయినావు నమ్మపోతే గుండెల్లోసూడు
ఏనాడు చూడలేదమ్మ నీ చుట్టున్న ఆస్తులు
గుండెల్లో గుడిగట్టుకున్నా నువ్వే పంచప్రానాలు
మనసులో బాదెంత ఉన్న పైకి నవ్వుతున్నాను
మా అమ్మసాచ్చిగా నువ్వే అమ్మవైతవనుకున్నాను
ఎల్లకే ఎల్లకే యెన్నలా నీ ఎనక పడుతుంటే నేనిలా
సింతనే ఉంటానే సివరణ సేదుగచూడకే నన్నలా
ఓ ఎన్నెలా యేడిపించబోకమ్మ ఎలుకోరాదీసిన్నొన్ని
ఏలు బట్టుకో యెనకనుంటాడే ఎల్లిబోకమ్మ వదిలేసి
ఓ ఎన్నెలా రెండి బెట్టుకున్నాడే రాయే పిల్ల ఓసారి
మన్నులోన కలిసిపోతాడు ఏమో సూడే ఈ పిచ్చి పిల్లొన్ని
నేను నీకు దూరంగున్నా నిన్ను మర్చిపోలేను
సచ్చె అంత ప్రేమే ఉన్నా నీకు దగ్గరవ్వలెను
నీతోనే జీవితమంటూ ఎన్నో కలలు కన్నాను
కలలన్నీ చెదిరిపోయాయి నా రాత పాడుగాను
రాతట్ట రసిండో దేవుడు మనకు వచ్చినాయే తిప్పలు
ప్రేమలో ఉన్నన్ని రోజులు తెలియలేదే ఈ బాధలు
ఓ ఎన్నెలా సందమామలాంటి నువ్వు సిన్నబోకమ్మ సిన్నారి
సక్కనైన నీ నవ్వుకు తలవంపు తెచ్చుకోకే నా బంగారి
ఓ ఎన్నెలా ఎంతముద్దుగుంటావే అల్లరి పిల్లవి అమ్మాడి
నువ్వు బాదగుంటే మనసుకైతలేదు మంచిగుండవే సిన్నారి
నీ కనుచూపులలో నడిచేవాడు
నీ కనుచూపులలో నడిచేవాడు
నీ మాటలతోనే మురిసిపోయేటోడు
నలుగుతున్నాడే నీ కోసం పిల్లా
వెతుకుతున్నాడే నీ రూపం
నలుగుతున్నాడే నీ కోసం పిల్లా
వెతుకుతున్నాడే…
తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా
ఓ.. బుజ్జి నీ మనసే
ముద్దు మాటల మూట సద్ది
ఓ.. ఓ కన్నా నిన్ను జూత్తె
కరిగిపోయె వెన్నా
కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
నింగి నేల సాక్షి నిప్పు నీరు సాక్షి
గాలిపటమోలే ఎగిరిపోదామా
నువ్వు నేను గూడి గువ్వగోరింకాయి
ప్రకృతమ్మ ఒడిలో సేదదీరుదామా
నీ ముదుట పలికే కోయిలమ్మా
ప్రేమ కురిపించే చల్లని జాబిలమ్మా
నీ గుణము మచ్చ సల్లకుండా
నీ చెలిమి బంగారుకొండా
ఓ కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
ఊడుగు సెట్టుకు ఉయ్యాల గట్టి
ఊపనా రత్తాల సారంగి
ఊపర ఉయ్యాల నను నిదురపుచ్చగ
రావయ్యా బంగారుసామి
నిండు పున్నమోలే నీ మోము
మెరువవట్టె ఎంత సక్కదనమూ
పండు వెన్నెల్ల తీరు నీ నవ్వు
అయ్యో వెలుగుతూందిరో ఈ జాము
కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
ఇంద్రధనస్సు తెచ్చి నింగి నక్షత్రాల
రంగవల్లి సీర నీకు కట్టనా
చంద్రవంక తిలకం నీకు నుదుటవెట్టి
ఇంద్రలోకానికే రాజు సెయ్యనా
గా గలగల పారేటి గోదారి
మనకు సూపబట్టే మనువు రహదారి
గా కిలకిల పలికేటి పక్షులు
పాటబాడి వేస్తున్నాయి అక్షింతలు
ఓ కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా
ఆ సిన్న సిన్న సింతల బావయో
వచనం: ఆమె- ఓయ్ బావ నిన్నట్నుంచి నీతోవజూస్తున్నా
మరి మరి ఓ ముద్దిచ్చిపోరాదే
అతడు: వామ్మో నేన్ రానే జానకి
మీఅయ్య అస్సలే మంచోడు కాదు)
ఆ సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
ముద్దు ముద్దు మేనబావ రావయో
నాతో ముచ్చటైన బెట్టిపోరా బావయో
ముద్దు ముద్దు మేనబావ రావయో
నాతో ముచ్చటైన బెట్టిపోరా బావయో
ఆ మర్రిసెట్టు కిందా
ఇద్దరమే గూడి
ఆడిన ఆటలు పాడిన పాటలు
మీఅయ్యా నన్నుజూసి పెట్టిన వాతలు
మనసంతా నింపుకున్నా నీ ప్రేమ దాసుకున్నా
అవ్వతోడు మరవలేని జానకి
మల్ల నిన్ను జూడ రాలేను ఊరికి
అవ్వతోడు మరవలేని జానకి
మల్ల నిన్ను జూడ రాలేను ఊరికి
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
ఆ . . . . . .
నా రాజు నువ్వే బావో నీ రాణి నేనే బావ
ఇన్నేళ్ల ప్రేమని గుండెల్లో దాసుకున్న
ఏనాటికైనా నీతో ఏడడుగులు ఏస్తానన్న
ఆశతోనే నేను ఇన్నాళ్లు వేచి ఉన్నా
ప్రాణామోలే జూసుకుంటా జానకి
నీసెయ్యి ఇడిసి ఉండనమ్మా జానకి
ప్రాణామోలే జూసుకుంటా జానకి
నీసెయ్యి ఇడిసి ఉండనమ్మా జానకి
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
ఆ సిన్నీ కృష్ణుడల్లే సిన్నినాడు
నువ్వు నెమలీకవెట్టుకొని వేణువు ఊదుతుంటే
రాధాల్లే పక్కనున్న నీప్రేమ పంచుకున్నా
నీ వేణు రాగాలకు నా మనసే ఇచ్చుకున్నా
ముత్యాల మురిపాల జానకి
నా పానమంతా నువ్వేనమ్మ జానకి
ముత్యాల మురిపాల జానకి
నా పానమంతా నువ్వేనమ్మ జానకి
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
సిన్న సిన్న సింతల బావయో
నేను సిల్కుసీర గట్టుకున్న రావయో
మనసుల మనసుంటలేదు
మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు
కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను
నీ ఎన్నెల ఈడును జూసి మందిలో సైగాలు జేస్తే
సందుల సాటుకు వచ్చి సీకటి సోకులుజేసే
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను
కన్నఒళ్ళే కాదనన్న కులపోళ్లే కావలన్న
తొడగొట్టి సెప్పుతున్న నీ నుదుట బొట్టు నైత
ఇగ అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు
అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు
మూడుపూట ముచ్చట్లు ఎన్నిజూస్త నేనేడు
వాడుకోని వదిలేసె నీలాంటి మగవాళ్లు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు
నువ్ లేని నా గుండె ఆగిపోతా అంటుందే
నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
చల్ ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను
ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను
పిల్లగా సిగ్గులేక రమ్మంటే ఇంటికొస్తవా ఇంటి
ఎవలైనాజూసినంటే నెత్తినిండానువ్వంటే
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి
ఒక్కసారి సోపతైతే సచ్చెదాక ఇడిసిపోను
నమ్మబుద్ది కాకపోతే గుండె కోసి ప్రేమజూడు
అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము
నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము
ములకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
మందిలున్న మనసునంతా ముంచి ముద్దజేసినావు
ఇగనుండి నువ్వే నాషాను దుమ్ము దులిపేద్దాం రావోయ్ దునియాను
ఇగనుండి నువ్వే నాషాను ఏది ఏమైనా నీతోనే నేను…
బోనాల పాట- అమ్మ బయలెల్లినాదో
అమ్మ బయలెల్లినాదో……… అమ్మ తల్లి బయలెల్లినాదో…………. అమ్మ తల్లి బయలెల్లినాదో….
అమ్మ బయలెల్లినాదో నాయన…..తల్లి బయలెల్లినాదో..$అమ్మ&
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మ $లస్కరు$
అమ్మ బయలెల్లినాదో నాయన…..తల్లి బయలెల్లినాదో…$అమ్మ$
పోతరాజులేగురంగా…….అమ్మ మంకాళీ
శివసత్తులుగంగా… తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు… అమ్మ మంకాళీ
డప్పులతో జనాలు… తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు డప్పులతో జనంతో…
అమ్మ బయలెల్లినాదో నాయనా…..తల్లి బయలెల్లినాదో….$అమ్మ&
పోరగాన్లు, పోట్టెగాన్లు…. అమ్మ మంకాళీ
తీనుమారు ఆడుకుంటా… తల్లి మంకాళీ
చారుమీనారుకాడ…. అమ్మ మంకాళీ …
గల్లి గల్లి లొల్లి లొల్లి… తల్లి మంకాళీ
చారుమీనారుకాడ గల్లి గల్లి లొల్లి లొల్లి……..హ
అమ్మ బయలెల్లినాదో నాయనా…..తల్లి బయలెల్లినాదో… $అమ్మ&
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో….$లస్కరు$
కల్లు సాగ కోడి పుంజు… అమ్మ మంకాళీ
కొత్త సీరా కొత్త రవిక…తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని… అమ్మ మంకాళీ
నిన్ను సూడ వత్తునమ్మ… తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని…నిన్ను సూడ వత్తునమ్మ
అమ్మ బయలెల్లినాదో నాయనా…..తల్లి బయలెల్లినాదో… $అమ్మ&
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో $లస్కరు$
అమ్మమ్మో మాయమ్మో…….ఓ…అమ్మమ్మో మాయమ్మో… తల్లీ మంకాలమ్మో
మా పిల్ల పాపలనమ్మో…మాయమ్మ
సల్లంగా దీవించమ్మో…..
మా పిల్ల పాపలనమ్మో…మాయమ్మ..
సల్లంగా దీవించమ్మో…..
లస్కరు బోనలమ్మో….మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ..
లస్కరు బోనలమ్మో….మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ..
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో..!
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో
నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో
నను గన్నవాళ్ళకు ఏడేండ్లప్పుడు దూరమయ్యాను
దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యాను
మూడు మూరలకర్రతో ముప్పైగాడ్లతో సోపతి నాదయ్యో
దిక్కు దిక్కూన ఉరుకంగ లేలేతకాళ్ళకు గుచ్చెనుముండ్లయ్యో || నా చిట్టి చేతులు||
వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను
మా అమ్మాఅయ్యా రాకముందే నిదురపోతాను
సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరుకాడుంట
తెల్లవెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయికాడుంట || నా చిట్టి చేతులు||
బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య బెడుతుంటే
తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే
అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే || నా చిట్టి చేతులు||
వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే
కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే
చిన్నవొళ్ళుకు చిల్లులు పడ్డా అంగీ ఒక్కటున్నాదే
వాళ్ళ బిడ్డల ఒంటికి రంగు బట్టలు రోజు మారేనే || నా చిట్టి చేతులు||
పెద్దోళ్ళ బిడ్డలు ఏమీజేసిన ఎంతో ప్రచారం
నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో యికారం
చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెలమీద పుండునుజేసే పనులకు పంపకురే || నా చిట్టి చేతులు||
అమ్మా నాన్నా అందరికీ నే దండం పెడుతున్నా
నా బాధను గాథను ఆలోచించురి కాళ్ళు మొక్కుతున్నా
వ్యవసాయానికి సంబంధించిన జానపదాలు
మాపల్లె పాలించు వానదేముడా
మాపల్లె పాలించు వానదేముడా
మమ్మెల్ల రక్షించు వానదేముడా
మాకెల్ల వర్షమిచ్చి వానదేముడా
మాకెల్ల పంటలిచ్చి వానదేముడా
మాకెల్ల నీరినిచ్చి వానదేముడా
మా దప్పికలు దీర్చి వానదేముడా ॥మా॥
మాపల్లె పాలించి వానదేముడా
మమ్మేలుకోవయ్య వానదేముడా
ఉత్తరాన ఉరుమురిమె వానదేముడా
దక్షిణాన జల్లుకురిసె వానదేముడా ॥మా॥
ఏదిక్కు నున్నావో వానదేముడా
మాదిక్కు రావోయి వానదేముడా
మాకెల్ల వర్షమిచ్చి వానదేముడా
మాచెరువు నిండించి వానదేముడా
మాకెల్ల పంటలిచ్చి వానదేముడా
మామొరలు వింటివయ్య వానదేముడా ॥మా॥
[ఈ పాట పల్లెలలో హరిజనస్త్రీలు గుంపులుగా చేరి కప్పను తలమీద పెట్టుకొని ఊరేగిస్తూ పాడుకొంటారు. వర్షము లేని రోజులలో ఈ పాటలు పాడితే వానలు కురుస్తాయని పల్లెటూళ్ళల్లో నమ్మకం.]
ఏరువాకపాట
ఏరువా కొచ్చింది ఏరువాకమ్మ
ఏళ్ళు నదులు పొంగి వెంబడొచ్చాయి॥
నల్ల మేఘాలలో నాట్యమాడింది
కొండ గుట్టల మీద కులుకు లాడింది
ఇసక నదిలో దూరి బుసలు కొట్టింది
పాడుతూ కోయిలా పరుగు లెట్టింది ॥ఏ॥
ఆడుతూ నెమలి అలిసిపోయింది
నవ్వుతూ మా అయ్య బువ్వ తిన్నాడు
ఆకాశమున మబ్బులవతరించాయి
ఉఱు మొక్క టావేళ ఉఱిమిపోయింది ॥ఏ॥
కాపు పిల్లల మనసు కదిలిపోయింది
అటకమీద గంప అందుకోవయ్య
విత్తనాలు దీసి విరజిమ్మవయ్య
మృగశిరా కార్తిలో ముంచెత్తు వాన ॥ఏ॥
కలపరా అబ్బాయి కొత్త దూడల్ని
కట్టరా అబ్బాయి కొత్త నాగళ్ళు
దున్నరా ఓఅయ్య దుక్కుల్లు మీరు
ఒకగింజ కోటియై వర్ధిల్లు మీకు
ఏరువాక సాగి ముసురు కోవాలి
కొత్త పంటలు మనకు కోరుకోవాలి ॥ఏ॥
వరి నాట్లు వేసేటప్పుడు పాడే పాట
ఓ తానిననీ తానినని తానిననీ నా
తానిననీ తానిననీ తానిననీ నా॥
ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో
ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో
కుంట పూ వాసనకు రాయుడు రాంగా
కుసుమ పూ వాసనకు కుంట దారల్లె ॥ఓ॥
కుంట ముంగిటకు రాయుడు రాంగ
మల్లె పూ వాసనకు మారుదా రెల్లె ॥ఓ॥
చెరువు ముంగిటికి రాయుడు రాంగ
సెనగ పూ వాసనకు చెఱువుదా రెల్లె ॥ఓ॥
దాయి ముంగటికి రాయుడు రాంగ
బంతి పూ వాసనకు బాయి దా రెల్లె
ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో ॥ఓ॥
పొలిపాట
ఒలియా ఒలియో ఒలియా
రావేలు గలవాడ రార పొలిగాడ॥
తూర్పునా ఒక వాన తుమ్మెదలమోత
పడమట ఒక వాన పట్టి కురవంగ
ఈ వాన ఆ వాన ఏకజడివాన
ఏవిలీ చేనుకు ఎద వానలాయె ॥ఒలి॥
వెండి తూములకింద వెల్లడము పండు
పైడి తూములకింద పాలంకి పండు
రావేలు పోవేలు రాసి పదివేలు
రావేలు మీదయ్య రాసి మాదయ్యా ॥ఒలి॥
పోయెనే పొలిగాడు పొన్నూరు దాటి
వచ్చెనే పొలిగాడు వదగాని బాట ॥ఒలి॥
వా యెక్కి పొలిగాడు వాల లాడంగ
రాసెక్కి పొలిగాడు రంప టిల్లంగ
పొలిగాడు కొట్టంగ పోగాయె రాసి
ఎద్దులూ తొక్కంగ ఎదిగెనె రాసి ॥ఒలి॥
పొలోపొలి చాల పొలి
తిరుప తెంకన్నిచ్చిన పొలి
వినుకొండెంకమ్మిచ్చిన పొలి
బెజవాడ కనకదుర్గమ్మిచ్చిన పొలి. ॥ఒలి॥
[కోతలు కోయునప్పుడు పంటలక్ష్మికి పూజచేసి “పొలి” వేసేటప్పుడు పాడేపాట.]
చేతి వృత్తి జానపద గేయాలు
నూలు వడికే విధము తెలపండి
నూలు వడికే విధము తెలియండి
జనులార మీరు
విధము గనుగొని మోదమందండి
నూలు వడికే విధము తెలియక
సాలు కరువది కోట్ల రూపా
యీలు వ్యర్థముగాగ పరదే
శాల పాలను చేయబోవక ॥నూ॥
రాట్నమే మనమూట యనుకోండీ
జనులార మీరు
పాటపాడుచు నూలు వడకండి
రాట్నమే మనమూట యనుకొని
పాటపాడుచు నూలు వడకిన
కాటకము లెన్నింటినైనా
దాటగల మనుమాట నమ్ముచు ॥నూ॥
మిల్లు గుడ్డల మాట మరువండీ
జనులార మీరు
తెల్లతనమునకు మోస పోకండి
మిల్లుగుడ్డల మాట మరువక
తెల్లతనమునకు తెల్ల బోయిన
కల్ల కాదిది మనకు యొక నొక
చిల్లి గవ్వయినను మిగులదు ॥నూ॥
వృత్తి పాటలు
సర్వాయి పాపన్న
ధీరుడు వస్తాదు పాపన్నా పాపన్నా॥
రాయిడు సర్వాయి పాపన్నా
పాపడొక్క పేరు చెబితే
ఊరపిచ్చుక ఊరుచేరదు
పొట్టిపిచ్చుక పొలం చేరదురా ॥పాప॥
పుట్టినాది పులగాము
పెరిగినాది తాడికొండ
కులమందు గమళ్ళవాడు
పేరు సరదారి పాపన్నా ॥పాప॥
తల్లికి దండాముపెట్టి అమ్మరో సర్వమ్మతల్లి
నన్ను గన్నతల్లి రావే నాకు తగ్గ పనులుచెప్పవే ॥పాప॥
వినరా సర్దారిపాప కలవిద్యలు యెన్నిచేర్చిన
కులవిద్యకు సాటిరావు ఇంకా కొన్నాళ్ళు కొడుక
ఇంటి యావులు మేపమంటాది సర్వమ్మ తల్లి
ఈతచెట్టే గీయమంటాది ॥పాప॥
ఈదులు గొడితే యీడిగవాడు
కల్లు గొడితే గమళ్ళవాడు
మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లీ
పాళెగాడి చట్టమొచ్చునా ॥పాప॥
ఊరు గొడితే యేమి ఫలము
పల్లెగొడితే యేమి ఫలము
పడితే బందరే పడతానే సర్వమ్మ తల్లి
కొడితే గోల్కొండ కొడతానే ॥పాప॥
తిన్నగా తిరుచూర్ణ మద్ది
పాలు అన్నం భోంచేసి
పసిడిబెత్తం చేతబట్టాడోయ్ పాపన్నా
అవత లివతల వెండికట్లు
నడుమ బంగారు కట్లు
డాలుబల్లెము చేతబట్టాడోయి పాపన్నా
మండీబజారు కొచ్చి సోపుదారి కేకలేశాడోయ్ ॥పాప॥
[గోలకొండ కోటకొట్టి ఒకరోజు ‘గోలకొండ’ రాచరికం చేసిన సర్వయి పాపన్న వీరగాధ.]
దూదేకుల సిద్ధయ్యగారి తత్వం
ఏకులమని నను వివరమడిగితే
యేమని దెల్పుదు లోకులకూ
లోకులకూ పలుగాకులకూ
దుర్మార్గులకూ యీ దుష్టులకూ
ఫాలభాగమున ఏలలు బాడుచు
భావము కన్నది నా కులము ॥ఏ॥
ఇంటి లోపలను యిల్లు గట్టుకొని
మంటలోపల రాట్నం పెట్టుకు
కంటిలోపల కదురు బెట్టుకు
ముక్కులోపల యేకు బెట్టుకొని
చెవులో బారా చేతికి దీసుకు
నారాయణ యను నరము తీసుకొని
అష్టాక్షరి యను తడిక వేసుకొని
పంచాక్షరి యను పంచ దీసుకొని
తధిమి దధిమి గుబదెబ గుబదెబ
ఏకిన కులమె మా కులము ॥ఏ॥
ఏకిన ఏకులు పీకిన పిందెలు
లోకమంత నొక పాపము చేసుకు
ఏకిన కులమె మా కులమూ ॥ఏ॥
రొమ్మున లక్ష్మీ చీరగట్టుకొని
చక్కగా సిరిపావడ దొడిగి
ఆనందమైన వీరబ్రహ్మ
శాల్వ కపుకొని నిండియున్నదే
నా కులము ఒంటరిగాదె నా కులము ॥ఏ॥
దంపుళ్ళ పాట- అత్తలేని కోడ లుత్తమురాలు ఓలమ్మా
అత్తలేని కోడ లుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని యత్త గుణవంతురాలు
కోడలా కోడలా కొడుకుపెళ్ళామా ఓలమ్మా
పచ్చి పాలమీద మీగడేదమ్మా
వేడి పాలల్లోన వెన్నయేదమ్మ ॥ఆహుం॥
అత్తా నీచేత ఆరళ్ళెగానీ ఓలమ్మా
పచ్చిపాలమీగ మీగ డుంటుందా
వేడిపాలల్లోన వెన్న యుంటుందా ॥ఆహుం॥
చిలక తిన్నపండు నేనెట్టా తిందు ఓలమ్మా
చిలకతో మాటొస్తె నే నెట్టా పడుదు॥
మెచ్చి మేనరికంబు యిచ్చేటికంటె ఓలమ్మా
మెడకోసి నూతిలో వేసితే మేలు
లేకుంటె గంగలో కలిపితే మేలు॥
మా తాతపెళ్ళికి నే నెంతదాన్ని ఓలమ్మ
తలదువ్వి బొట్టెడితె తవ్వంతదాన్ని
అన్ని సొమ్ములు పెడితె అడ్డంతదాన్ని॥
నట్టింట కూర్చొని నగల కేడిస్తే ఓలమ్మ
ఊరుకో మనవరాల ఊరేగొస్తా నన్నాడే॥
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓలమ్మ
కొడుకు ఊళ్ళోలేడు మల్లె లెక్కడివీ॥
ముద్దుచేసిన కుక్క మూతి కఱచేను
చనువుచేసిన ఆలి చంకనెక్కేను॥
మొండి కెత్తినదాన్ని మొగుడేమి చేసు ఓలమ్మ
లజ్జ మాలినదాన్ని రాజేమి చేసు
సిగ్గుమాలినదాన్ని శివుడేమి చేసు॥
సాధారణంగా ఈ పాటను వడ్లు దంచేటప్పుడు ఇద్దరు, ముగ్గురు స్త్రీలు కలిసి పాడేవారు.
పండుగ పాటలు
సీతసమర్త
సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తిసాంద్ర సువ్వి
సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మా॥
సృష్టిలో సీతమ్మ సమర్త కొట్నాలు దంచ
వేడ్కతో పేరంటాండ్రు వేగవచ్చిరీ ॥సు॥
పసిడిరోకళ్ళు బట్టి పద్మకుఖులు సువ్విదంచ
కనుల పండుగాయె కౌసల్య కప్పుడు
ఘల్లు ఘల్లుమనుచు హస్త కంకణమ్ము లెల్ల కదల
కొబ్బరీ బెల్లమ్ము కోరిదంచిరీ॥
నువ్వులా పప్పుదంచి నూటికీ పంచిబెట్ట
ఘనముగా పేరంటాండ్రు కలసి దంచిరీ॥
చిమిలి పళ్ళెరముల సమ్మతిగా దోడుకొని
ఇమ్ముగ నుండలు చేసిరి కొమ్మలు॥
కౌసల్యపుడు వచ్చి కాంతలందరిని బిలిచి
బంగరూ తబుకులతో పంచిబెట్టెను॥
సంక్రాంతి- జంగం దేవర
సంకురాత్రిపండుగొచ్చె సిద్ధేశ్వరా
తల్లి పిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
సాంబమూర్తి కరుణగల్గి సిద్ధేశ్వరా
కలకాలం వర్ధిల్లు సిద్ధేశ్వరా
కృపతోడ నిచ్చునండి సిద్ధేశ్వరా
ఏడాది కొక్కసారి సిద్ధేశ్వరా
వాడవాడ కొత్తుమండి సిద్ధేశ్వరా
కోటిపల్లి సోమన్న
ద్రాక్షారం భీమన్న
అరసవిల్లి సూరన్న
సింహాచలం అప్పన్న
హువ్వ హక్క హుం – శంఖం
ఏమయా స్వామి శివశివా
కైలాసవాసా
ఏమయా స్వామి సొమ్ము
లేమి లేకపోయె నయ్య
పాములను ధరించు టెవరి
కోసమో శివశివా
వెఱ్ఱివాడవయ్య నీవు వెండికొండ నుండలేక
వల్లకాడులను వసించు
టెవరికోసమో శివా ॥ఏ॥
రాచవాడవయ్యు నీవు రాచపాడి లేకపోయె
గోచిపాతలను ధరించు టెవరికోసమో ॥ఏ॥
గౌరమ్మ పండుగ
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
ఎంత చల్లని తల్లివే ఓ గౌరమ్మ
ఒక్కొక్క పోకందునా గౌరమ్మ
ఒక్కొక్క ఆకందునా
కస్తూరి చలమందునా గౌరమ్మ
రాచబాటాలందునా ॥ఎంత॥
మము జూచి యా యన్నలూ గౌరమ్మ
ఏడు మేడలెక్కిరీ
ఏడు మేడలమీద గౌరమ్మ
ఏడాది కొక దీపమూ
ఏడు కోటలెక్కిరీ గౌరమ్మ
ఎలుక కోటలెక్కిరీ ॥ఎంత॥
పల్లె కోటాల నెక్కే గౌరమ్మ
పత్తిర్లు దూయంగను
దొంగలేమొ దోచిరీ గౌరమ్మ
బంగారు గుండ్లవనము ॥ఎంత॥
తబుకులో తబికెడు గౌరమ్మ
ముత్యాలు తీసుకొని
ఇమ్మడి కుచ్చులతో గౌరమ్మ
సొమ్ములతో వచ్చిరీ ॥ఎంత॥
సొమ్మూల పెట్టూకొని గౌరమ్మ
ఇమ్ముగనూ వచ్చిరీ
గుమ్మడిపూలన్నీ గౌరమ్మ
గుత్తూల కట్టుకు నొచ్చే ॥ఎంత॥
ఈడనే పెండ్లాడవే గౌరమ్మ
ఈడనే పసుపాడవే
వాడవాడల జనమూ గౌరమ్మ
వాలలాడింతు రమ్మ ॥ఎంత॥
శ్రీకృష్ణ జన్మాష్టమి
కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా
శ్రీరంగ రంగ రంగా నినుబాసి యెట్లు నేమరచుందురా॥
కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను॥
ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను
ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను॥
తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు
యెదురుకాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు॥
తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి యెత్తుకొనుచు
అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను॥
వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మ
నవనీత చోరుడమ్మ ఈబిడ్డ నందగోపాలుడమ్మా॥
శ్రామిక జానపదాలు
ఇది మిసనీ అది మిసనీ
ఇది మిసనీ అదిమిసనీ
గుంటూరూ పెదమిసనీ
ఏ మిసనీకి పోదాంరో
లంబాడోళ్ళ రామదాసా
మనమే మిసనీకి పోదంరో॥
చీరాలా చినకారూ పేరాలా పెదకారు
ఏకారెక్కి పోదాంరో లంబాడోళ్ళ రామదాస॥
నీచాయ నాచాయ కలబందాపూచాయ
కలసినట్లు ఉందమురో లంబాడోళ్ళ రామదాస॥
ఇది యొకటీ అదియొకటి అప్పన్న గుడియొకటి
ఏ గుళ్ళోకి పోదాంరో లంబాడోళ్ళ రామదాస॥
ఊడుపుల పాట
రాయినా శందనాలో ఓయిబామల్లాలా బామ
లాల బావన్నిలాలా॥
రామలచ్చనుల్లాంటి రాజులు లేరు
సీతమ్మలాంటి ఇల్లాలు లేదు ॥రాయి॥
పాడిపంటలు సల్లగుండాలి మా
కూలిరైతుల కడుపు నిండాలి
కామందులు సల్లగుండాలి
దండిగ మాచేలు పండాలి ॥రాయి॥
ఉత్తర వచ్చె ఎత్తర గంప
కాఱు మొయిలు ఆకాశమ్ము నిండె
తొలకర్లో వర్షాలు కురువాలి
ఎకరానికి బస్తాలు పండాలి ॥రాయి॥
నీరుపెట్టి దుక్కి దున్నాలి
దుక్కిదున్ని మొక్క నాటాలి
పక్కలిరిగే రాగుపండాలి పంట
కరవులేకుండ మనముండాలి ॥రాయి॥
మా! రైతుబాబులు బాగుండాల
ఆరి! పిల్లపాపలు సల్ల గుండాల
ఆరి! ఆవుల్ని గోవుల్ని కాయాలి
కాసినందుకు మాకు కానుకలియ్యాలి
రాయినా శందనాలో ఓయి బామల్లాలా ॥రాయి॥
బెస్తవాళ్ళ పాట
ఏలియాలా – ఏలియాలా
ఏలియాలా
ఐలేసా జోరిసెయ్యి! ఐలేసా బారుసెయ్యి॥
గంగమ్మ తల్లీకి చెంగల్వ పూదండ
కాళిందికీ తెల్లకల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి జోర్సెయ్యి బార్సెయ్యి॥
గోదారి తల్లికి గొజ్జంగిపూదండ
సరస్వతికి సన్నజాజిదండ
కృష్ణవేణమ్మకు గేదంగి పూదండ
కావేరికీ చంద్రకాంతదండా
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥
పిల్ల జెల్లల్నంత సల్లంగ రక్షించి
యిల్లుచేర్చండి ఓ తల్లులారా ॥గంగ॥
సిక్కాలు నిండించి సింగాలు నిండించి
యిల్లు చేర్చండి ఓ తల్లులార
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥
గోదారి తల్లీకి కొట్టర టెంకాయి
కోరి దండాలెట్టి కుంకుమ బెట్టి
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥
నీటిని నమ్మి ఏలేలో నీవు ఉన్నావు ఏలేలో
నిన్ను నమ్మి ఏలేలో నేను ఉన్నాను ఏలేలో॥
రోడ్డు కూలీల పాట
ఓ చిన్నదాన ఒగలమారిదాన
ఓ చిన్నదాన ఒయ్యారిదాన॥
బందారు చిన్నదాన బాజా బందులదాన
బాజ బందూలమీద మోజెంతొ లేదే ॥ఓ చిన్న॥
గుంటూరు చిన్నదాన గులుకుమట్టెలదాన
నీ గులుకుమట్టెలపైన తళుకెంత లేదో ॥ఓ చిన్న॥
ఎర్ర ఎర్రనిదాన ఎత్తు పిఱ్ఱలదాన
ఎత్తు పిఱ్ఱలజూసి ఎగిరెగిరె మనసు ॥ఓ చిన్న॥
నల్ల నల్లనిదాన నడుము సన్ననిదాన
కళ్ళ కాటుకదాన సల్లంగరాయె ॥ఓ చిన్న॥
పెండ్లిలో జానపద పాటలు
ఏదేశాన్నుంచొచ్చారయ్యా
ఏదేశాన్నించొచ్చారయ్యా మా దేశానికి
చక్కని త్రిలోకసుందరి జానికమ్మకు॥
దొడ్డ దొడ్డవారలని బిడ్డనిస్తిమి
దొడ్డికాళ్ళ పెండ్లికొడుకని యెరక్కపోతిమి ॥ఏ॥
మేడలు మిద్దెలు గలవారని చేరె నిస్తిమి
దిబ్బలు గుడిసెల కాపురమని ఎరక్కపోతిమి ॥ఏ॥
గాబులు గంగాళాలు గలవారని మీకిస్తిమి
డాబు చేసుకు చేతికి చెంబేలేదని యెరుగము ॥ఏ॥
దానిమ్మగింజలు పళ్ళనిచాలగ నిస్తిమి
గొగ్గిపళ్ళ పెళ్ళికొడుకని యెరక్కపోతిమి ॥ఏ॥
చదువు సంధ్యలుగలవారని చాన నిస్తిమి
ఓనమాలురాని మొద్దబ్బాయని యెరుగము ॥ఏ॥
కోటి కోట్లుగలవారని కొమ్మనిస్తిమి
కూటికే వాచియున్నారను సూటితెలియదు॥
ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి ॥ఏ॥
మంగళసూత్రం పాట
ఆనంద మానంద మాయెను
మన రామూడు పెండ్లికొడు కాయెను
మన జానకి పెండ్లికూతు రాయెను
మన కౌసల్యనోము ఫలించెను॥
రత్నాల పలకను వేసిరి సీత
రాము లిద్దరు కూర్చుండిరీ
చెలు లతివేగ సింగారించిరీ
చెలువముతో శ్రీరాముడు లేచెను ॥ఆనం॥
ముందుగ పురోహితులు మంత్రముల్ చదువగ
పొందుగ మేళతాలములు మ్రోయించగ
మందయానలు మంచిపాటలు పాడంగ
అందముగ రాముడు మంగళసూత్రము గట్టె ॥ఆనం॥
ఎదుటను పార్వతి సరస్వతి
ఇంద్రాణిదేవి యరుంధతి
ఆణిముత్యముల సేసలుచల్లగ
తులలేని రత్నాలు తలబ్రాలు బోసిరి॥
ఆనంద మానంద మాయెను॥
నలుగు పాట
రారాకుమార నలుగుకు
శ్రీరామ అలుగకు
పోరాట మేల సీతతో
భూపాల చంద్రమా…॥
తప్పేమిచేసె భూమిజ
దశరథ నందన
ఒప్పూల కుప్ప జానకి
వసుధేశ నందనా ॥రా॥
కమలా పురీశ గావరా
శ్రీగంధ మిదిగోరా॥
కమలాక్షి సీతబూయగా
కరమీయ వేమిరా॥
రారా కుమార నలుగుకు
శ్రీరామ అల్గకూ॥
కస్తూరి గంధ మలద సీత
కదలి వచ్చెనూ
ఓ రాజ రాజ శేఖరా
కరమీయ వేమిరా॥
అప్పగింతలపాట
సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినామమ్మ
చెలగి మీ అత్తింట బుద్ధిగా నుండమ్మ॥
యెవ్వ రే మాడిన ఎదురాడ కమ్మ
వీధిలో నిలుచుండి విరుల విరబోయకు॥
పలుమారు పలుదెరచి నవ్వబోకమ్మ
పరమాత్ముతోగూడి పడతి నీవుండు॥
ఆకలీ వుంటేను అడుగబోకమ్మ
అత్తగారితో పోరు చేయబోకమ్మా॥
నాతోడి చేసిన మంకుపోరెల్ల
యెరుగని అత్తింట సేయబోకమ్మ॥
ఆడదాని బ్రతుక అరటాకు వంటిది
అడకువతొ అందరిలొ మెలగిరావమ్మ॥
జానపద గేయాలు- వ్యక్తులు
సైరా చిన్నప్ప రెడ్డి
సయిరా చిన్నప్ప రె(డ్డీ)
డ్డి నీ పేరే బంగార్పకడ్డీ
పుట్టింది రెడ్డిపాళెములో పెరిగింది చేబోలు
చిన్నప్పరెడ్డి మాటలకు చుట్టూ నొక్క పన్నెండామడ
నిప్పులేక మండిస్తివి రెడ్డి చుట్టూ నాలుగామడ
బందిపోటు కొట్టిస్తివి రెడ్డి ॥సయిరా॥
చిన్నప్పరెడ్డి యనేటివాడు
యే విధంబుగా జరుపుచున్నాడు
చీరాల పేరాల గొడితివి
వొంగోలు బాపట్ల గొడితివి
పొందుగాను నెల్లూరు గొడితివి
యింపుగాను వినుకొండ గొడితివి
సరసగాను గుంటూరు గొడితివి ॥సయిరా॥
చిన్నప్పరెడ్డీ కట్టేది గోరంచుపంచెలు
చుట్టేది చిలకల తలగుడ్డ
గోరంచు మరి పంచెనుగట్టి
రెడ్డిపాళెము బయలుదేరెను
తిరునాళ్ళెయినా వెళ్ళుచుండెను ॥సయిరా॥
చిన్నప్ప రెడ్డి యనేటివాడు
యేడాది వొక దినంబునందు
కోటప్పకొండకు వెళ్ళడానికి
బండి ప్రభనుగా తయారుచేసి
యాభై మూళ్ళ ప్రభను గట్టెను
నాలుగుగాండ్ల యెద్దులుగట్టెను ॥సయిరా॥
గుఱ్ఱాల గోపిరెడ్డి
ఓగుఱ్ఱాల గోపిరెడ్డి
దాచేపల్లికి దహనమైతివా॥
శేరు శేరు వెండి మురుగుల్
చేతులాకు బెట్టుకోని
కట్టవమీద వస్తా వుంటె
కలకటే రనుకొంటిర కొడకా
వయ్యారి కొడకా బంగారు కొడక
దాచేపల్లికి దహనమైతివా॥
ఈ పక్కను ఒకచేను ఆ పక్కను ఒకచేను
నడుమలోన నాపచేను సందూన నిన్ను నలుగురుబట్టి
నరికిరి కొడక వయ్యారికొడక ॥దాచే॥
ఎక్కేది యెల్లగుఱ్ఱం
కట్టేది కాయపంచ
సుక్కవంటి నీ సక్కదనము
సూడ కన్నులు లేవుర కొడక
వయ్యారి కొడక బంగారుకొడక
దాచేపల్లికి దహనమైతివా॥
ముసలమ్మ గండి
ఎంత ధన్యవో ముసలమ్మా
నీ వెంతసాహసివి ముసలమ్మా॥
ముసలమ్మప్పుడు ముస్తాబయ్యెను
మొగమున పసుపు సొగసుగ నలదెను
అడుగులకును పారాణి పూసెను
కుంకుమ నుదుటను కుదురుగ నిలిపెను॥
కన్నులనిండా కాటుక దిద్దెను
పసుపుచేర దా నొసపరిగట్టెను
మొగ్గల రవికను నిగ్గుగగట్టెను
కొంగును నడుముకు కోరి బిగించెను॥
కూడదీసి తన కురులను దువ్వెను
గొప్పుగ నొప్పగు కొప్పును ముడిచెను
కొప్పునజాజులు కొల్లగ తురిమెను
కాళ్ళకు గజ్జలు ఘల్లనగట్టెను॥
వచనం: ఆ విధంగా అలంకరించుకొన్నదై తన వూరి
వారిని రక్షింపడానికి సిద్ధపడి గంగమ్మకు
బలిగా పోయి ప్రార్థించెను
జాలారివారింట జన్మమెత్తినదానవే గంగాభవాని
ఈశ్వరుని తలపైన నెక్కి ఆడేదానవే ॥గంగా॥
పార్వతమ్మ తోడ పంతాలు గలదానవే
ఆదిశక్తివి నీ వనంతశక్తివి నీవటే॥
జగములేలే తల్లి చల్లగా రక్షింపవే
పట్నములో జనమెల్ల భయముతో నున్నవారె॥
నీకు కోపంవస్తె నిలువునా జాలుదురటే
నేనువస్తిని తల్లి నా కోర్కె చెల్లించవే॥
వచనం: అంటూ ఆ గంగలో గట్టున కడ్డంగా పడింది.
ప్రజలు గట్టువేసి ప్రమాదం తప్పించారు.
పరులకోసమై ప్రాణం విడచెను
ఆత్మత్యాగం అనేది చూపెను
లోకాలను రక్షించే శక్తిని
బోధచేసెను ముసలమ్మా॥
హృదయం నెరిలో ఇంపుగనున్నది
కల్మషాలతో కప్పబడినది
ఓ యని పిలచే ఉత్సాహులకును
ఓ యని పలుకును ముసలమ్మా॥
6.4. పెనుగొండ కోట
కొండగల్గిన కోట, కోటగల్గిన కొండ
కోట కొండలలోన మేటి యా పెనుగొండ॥
ఏనుగుల ఎలుగుతో రౌతుల రవళితో
మేనాల మెరుపుతో మెరిసింది పెనుగొండ॥
కులికేటి గానాలు కుణిసేటి ఖడ్గాలు
పలికేటి ఘంటలు ప్రబలింది పెనుగొండ॥
భళ్ళరాయని బాహుదర్పము లోనె
నేలనీడై ఉంది నెగడింది పెనుగొండ॥
భోజరాయని గద్దె భూస్థాపితము జేసి
బుక్కరాయని కొప్పజెప్పింది పెనుగొండ॥
గజపతుల నోడించి కటకానకంపిన
సాళ్వ నరసింహయ్య సాకింది పెనుగొండ॥
రుద్రుడైనా పట్టి ముద్దర్లుకాల్చిన
తిరుమల తాతయ్య తిరునాళ్ళ పెనుగొండ॥
ద్రాక్షారసములోన దానిమ్మలని జేర్చి
జుంటితేనెలతోడ జుర్రింది పెనుగొండ॥
తిట్లలో తిమ్మయ్య కవితలో బ్రహ్మయ్య
తెనాలిరామయ్య తిరిగింది పెనుగొండ॥
బాపనయ్యల నడుమ పల్లకీ నెక్కించి
భట్టుమూర్తికి కీర్తి తెచ్చింది పెనుగొండ॥
కొలాటం పాటలు
కుమ్మిపాట
పురు: కోలు కోలన కోలుకోలే ఓ చెలియా
కొమ్మ మన మిద్దరము జోడే
స్త్రీ: కోసేది కొయగూర మట్ట నాసామి
వాసనకు దవనాపుకట్ట
పురు: వచ్చిపోయే దోవలోన చినదాన
వంతకారి బొమ్మలాట
స్త్రీ: వీధిలో విస్తారమమ్మా ఈవూరి
కోలాట లెంతేడు కమ్మ
పురు: కోలాట లేసేటి కోరికేనైనా
తప్పక తగలాక విడువనో కొమ్మ
స్త్రీ: వగల గుమ్మడికాయకూర నాసామి
రేతిరిచేసిన చేత
పురు: రేతిరిచేసిన చేత చినదాన
మొగనాలితో పొందు రోత
స్త్రీ: కాగితి కలు బావినీలు నాసామి
కడవనిండా ముంచుకోని
పురు: రెండు చేతులు కడవమీద చినదాన
వాలుకన్నులు దానిమీద
స్త్రీ: కలికి గోపాలుడె కొమ్మా నాసామి
కనులకు వలలొడ్డె నమ్మా
తారంగం తారంగం
తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం
చిన్నారి తారంగం శ్రీకృష్ణ తారంగం
తారంగమ్మని సారెకు సారెకు
అందరు చూడగ ఆడరకృష్ణ
వీరందరు చూడగ ఆడరకృష్ణ ॥తారం॥
దురితమగుచు చెవుల మద్ది
కాయలల్లాడా కృష్ణ
పులిగోరు పతకము గొలుసు
బొజ్జపై నోలలాడగా ॥తారం॥
మురుగులు గొలుసులు చేతులు త్రిప్పుచు
కిలకిల నవ్వులు కెరలు కృష్ణ ॥తారం॥
అద్దంపు చెక్కిళ్ళు నాకు ముద్దులియ్యర
తద్దిక్కు తాకుడు తకధిమి తక తాళమువేయరా॥
చిన్నపిల్లలకు ఉగ్గు పెట్టేటప్పుడు తల్లి పాడేపాట ఇది
కోలాటం
కితకు తైయకు తాధిమ తఝంత తకధిమి
తళాంగు తధిగిణు తళాంగు తధిగిణు
కృష్ణుడు: నీళ్ళాకుబోయేటి ఓ నీలవేణిరో
నిలచుండవే గొల్లభామ నేను
నీకొఱకు వస్తిని లేమ
గోపిక: నిలచుండమని నన్ను నేర్పుతో నడిగేవు
నీకేమి పనిగల్గె కృష్ణ
నిజముగ దెల్పరాదోయి
కృష్ణుడు: పనియేమి యని నన్ను పాటించియడిగేవు
పని నీకు తెలువదె భామ
ఇంత పసిబాలవా ముద్దలేమ
గోపిక: తెలిసిందిగాని నాకు తెచ్చి యేమిచ్చెదవు
తేటగ తెల్పరాదోయి కృష్ణ
మాటన్న నిలుపరాదోయి
కృష్ణుడు: మచ్చు చూచుకొని మాలైన నేగొంటె
మచ్చన్న జూపవె భామ
ఇంత మరుగెందుకే గొల్లలేమ
గోపిక: పెండ్లిచేసుకొన్న పెనిమిటి యిదివరకు
పేరన్న పెట్టలేదోయి కృష్ణ
దారన్న జూపలేదోయి
కృష్ణుడు: వద్దేల సుద్దేల వందనమదియేల
ఒద్దికగా రావె ఓ భామ
ఒక్కసారి ముద్దియ్యవె ఓలేమ
గోపిక: ముద్దు లిచ్చుటకు పెద్దదాననుగాను
పెద్దగ రట్టాయెనోయి నా
పెద్దబావ కెరుకాయెను
చెమ్మచెక్క- చెమ్మచెక్క
చెమ్మచెక్క చేరెడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మాబావ పెళ్ళి చెయ్యంగ
చూచివద్దము రండి సుబ్బారాయుడు పెండ్లి
మావారింట్లో పెండ్లి మళ్ళీవద్దము రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకొద్దము రండి
ఒప్పులకుప్ప ఒయ్యారిభామ
సన్ననిబియ్యం చాయపప్పు
చిన్నమువ్వ సన్నగాజు
కొబ్బరికోరు బెల్లపచ్చు
గూట్లూ రూపాయి నీ మొగుడు సిపాయి
రోట్లో తవుడు నీ మొగుడెవరు
హాస్యపు జానపద పాటలు
వదినపాట
వదినలందరు వచ్చిరి వయ్యారముగ మా
వదినలందరు వచ్చిరీ
వదినలందరు వచ్చిరీ మిగుల సంతోషించిరీ
వగలుచేయుచు వొకరికొకరితొ
వాదించుచు వచ్చిరీ
పిల్లి కుక్కలవలెను మా వదినలందరు
పందిమూతుల వలెను
బాన కడుపులవారుగా కోరపండ్లు తోడను
కూరిమితొ తాబేలునడకల కోరి వా రొచ్చిరి
సారి గమా పాడెదరూ
మా వదినలందరు సంగీతం పాడిరి
మెచ్చి సభవారందరు చింపిగొంగళి కప్పిరీ
వగలుచేయుచు ఒకరికొకరూ
వాదించు కొచ్చిరీ
వివాహ శుభకార్యాలలో .. వదిన వరుస ఉన్నవాళ్లపై పాడే పాట ఇది.
కొత్తల్లుడు అత్తారింటికి వెళ్తే- మరదళ్లు ఆటపట్టించే పాట
అత్తవారింటికి కొత్తల్లు డొస్తేను
కొత్తసున్నందెచ్చి మెత్తరమ్మా
కొత్తసున్నంతోను కోపంబువస్తేను
నల్లేరు తెప్పించి నలవరమ్మ
నల్లేరుతోడను నసనసలాడితే
దూలగుండాకుతో దులపరమ్మ
దూలగుండాకుతో దుఃఖమ్మువస్తేను
బర్రెపలుపులుదెచ్చి బాదరమ్మా
బర్రెపలుపులతోను బాధలువస్తేను
కొరడాలు తెప్పించి కొట్టరమ్మా
అత్తారియింటికి వస్తే సుఖమేమంటు
వచ్చినదారినే పట్టరమ్మా
ఆలుమగల సరసం
మగ: కొట్టకుండ తిట్టకుండ వుంచుకుంటాను పిల్ల
చల్లంగ మెల్లంగ నీవుంటావా
స్త్రీ: చల్లంగ మెల్లంగ నేనుంటను గాని
నవ్వేటి నవ్వుమొగం ఎట్టపెట్టేది
మగ: నవ్వేటి నవ్వుముఖం నీవుబెట్టితే
చేతిలో దుడ్డుకర్ర చెండాడదా
స్త్రీ: చేతిలో దుడ్డుకర్ర చెండాడితే నీ
బండారం బయటికీ నే చెప్పనా
మగ: బండారం బయటికీ నీవుచెప్పితే మీ
అమ్మగారింటి కెళ్ళీ నే చెప్పనా
స్త్రీ: అమ్మగారింటికెళ్ళి నీవు చెప్పితే నే
కూటినీళ్ళ కాయకుండ దిగనూకనా
మగ: నీవు కూటినీళ్ళ కాయకుండ దిగనూకితే నే
స్టేషనుకి పోకుండ ఎగనూకనా
స్త్రీ: స్టేషనుకి పోకుండ ఎగనూకితే
బాయిలో గుంటలో నేనుపడనా
మగ: బాయిలో గుంటలో నీవుపడితే నే
వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించనా
స్త్రీ: వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించితే నే
దెయ్యమై భూతమై నిన్నుపట్టనా
మగ: దెయ్యమై భూతమై నీవుపడితే నే
భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టనా
స్త్రీ: భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టితే నే
తిరుపతికొండెక్కి తిరిగిచూస్తే
మగ: తిరుపతికొండెక్కి తిరిగి చూస్తే
చెన్నపురి రేవుకెల్లి చెక్కెయ్యనా
కలికాలం తీరు
నందామయా గురుడ నందామయా
ఆనందజ్యోతికి నందామయా
అత్తలకు పీటలు కోడలికి మంచాలు
మామనెత్తిన తట్ట పెడతారయా
వరికూడు తిని యేరువరుసలే తప్పారు
మగని పేరు బెట్టి పిలచేరయా
ముండలంతా గూడి ముత్తయిదులౌతారు
గూడూరిసందున గున్న చింతలక్రింద
గువ్వ మూడు మాటలాడేనయ్య
త్రాగునీళ్ళకు కఱువులయ్యేనయా
తాటిచెట్టుమీద తాబేలు పలికింది
తలంబ్రాలు వానకురిసేనయా
మూడునెలలకు కఱువు లొచ్చేనయా
నల్లగొండావల నాగులారముకాడ
నాల్గుకాళ్ళ కోడి పుట్టేనయా
అరువయాయాముడ కూసేనయా
ఆదివారమునాడు ఆబోతుగర్భాన
హనుమంతుడూ పుట్టి పెరిగేనయా
హనుమంతునకు పోయి మ్రొక్కేరయా
లాలి పాటలు
కాలాజ్ఞానం గురించి వీధి బయట బైరాగులు పాడే పాట
జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
తొలుత బ్రహ్మాండములు తొట్టె గావించి
నాలుగూ వేదాలు గొలుసు లమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలులు డోలికలోన చేర్చి లాలించీ
ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
యీజన్మలో నాకు బిడ్డలైనారా
ఉదయాస్తమయములే ఉక్కు స్తంభములో
నిండు ఆకసమూ అడ్డదూలముగ
నాల్గువేదములు బంగారు గొలుసులు
బలువైన భూస్తలము గురుపీఠకంబు
బంగారమనియేటి చలవటుపరచి
నేర్పుతో పాపణ్ణి ఏర్పాటుచేసి
ఏడు భువనముల వారేకమై పాడ
పేటలో భేరీ మృదంగములు మ్రోయ
తొమ్మిదీ వాకిళ్ళ దొడ్డిలోపలనూ
మూర్ఖు లారుగురునూ సాధులైనారు
అంతలో ముగ్గురూ మూర్తులున్నారు
తెలివి తెలిపేటివాడు దేవుడున్నాడు
పట్టవలె ఆర్గురిని పదిలంబుగానూ
కట్టవలె ముగ్గుర్ని కదలకుండానూ
ఉంచవలె నొక్కణ్ణి హృత్కమలమందూ
చూడవలె వెన్నెల భావమందుననూ
జంటగూడినవాని జాడ గనవలెను
ఇంట బ్రహ్మానంద ముంటుండవలెను
ఓంకారమనియేటి తొట్టెలోపలను
తత్వమసి యనియేటి చలువనే పఱచి
లాలీ శ్రీకృష్ణయ్య
లాలీ శ్రీకృష్ణయ్య నవ
నీల మేఘవర్ణ
బాలగోపాలకృష్ణ పవ్వళించవేమయ్య
శృంగారముగ నిన్ను బంగారు తొట్టెలలో
రంగూగ జోలపాడెదాను నిదురపోవయ్యా
ఇందరిలోపల నీకు ఎవరు కావలెనయ్య
ఇందీరాక్షి కాళిందియే కావలెనా
లలితాంగీ రుక్మిణీ లలనయే కావలెనా
పలుకు కోకిల సత్యభామయే కావలెనా
లాలీ శ్రీకృష్ణయ్య నీలమేఘవర్ణ
బాలగోపాల కృష్ణ పవ్వళించవేమయ్య
నిదురబోడూ కృష్ణుడూ- పాపను నిద్రబుచ్చే పాట
నిదురబోడూ కృష్ణుడూ బెదరినా(డు)
అయ్యొ వీడు నేడు
కుదురుగా ముజ్జగములు జో
కొట్టి నిదురబుస్తేగాని
గట్టిగా విభూతి నుదుట
పెట్టి చూచి సంధ్యవేళ
చుట్టుగాను గొప్ప దిష్టి
దీసివేసి తేనుగాని
తంత్రమున నేను మహి
మంత్రవాదుల బిలిపించి
మంత్రింపించి మొలకొక్క
యంత్రము గట్టినగాని
రామలాలీ
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయా లాలీ
అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా
జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ
ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్