టాలీవుడ్‌కు చెందిన మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (2021) యావత్ దేశాన్ని ఊర్రూతలూగించింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోమారు మాయ చేసేందుకు అల్లు అర్జున్‌తో కలిసి సుకుమార్ వస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మూవీ విడుదలకు ఇంకా పది రోజుల సమయమే ఉండటంతో పోస్టు ప్రొడక్షన్ పనుల్లో డైరెక్టర్ సుకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. అదే సమయంలో చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సుకుమార్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సుకుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్తలోని నిజానిజాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
రోజుకు 20 గంటలు వర్క్!
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Director Sukumar) కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం సరిగ్గా పది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో పెండింగ్ వర్క్ ఫినిష్ చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 20 గంటలు ‘పుష్ప 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమే కేటాయిస్తున్నట్లు సమాచారం. బెస్ట్ ఔట్‌పుట్ కోసం పని రాక్షసుడిగా సుకుమార్ మారిపోయారని మూవీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ వర్క్ నేపథ్యంలోనే బిహార్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం, తాజాగా జరిగిన చెన్నై ఈవెంట్‌కు సుకుమార్ హాజరుకాలేదని అంటున్నారు.
రాత్రిళ్లు సైతం శ్రమ..
‘పుష్ప2’ కోసం సుకుమార్ శ్రమిస్తున్న వీడియోను మూవీ టీమ్ ఎక్స్ వేదికగా పంచుకుంది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారని తెలియజేస్తూ పోస్టు చేసింది. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కోసం ‘ఏరౌండ్ ది క్లాక్’ సుకుమార్ పనిచేస్తున్నారని రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్ టీమ్ వ్యక్తికి సుకుమార్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.
సినిమాలకు గుడ్‌బై చెబుతారా?
‘పుష్ప పార్ట్ 1 మెుదలైనప్పటి నుంచి సుకుమార్ (Director Sukumar) ఆ సినిమానే లోకంగా గడుపుతున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ‘పుష్ప.. పుష్ప..’ అంటూ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ తర్వాత ఆయన ఇండస్ట్రీ నుంచి దూరమవుతారన్న కామెంట్స్ నెట్టింట స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. పూర్తిగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. అయితే ఇందులో నిజమున్నా శాశ్వతంగా మాత్రం కాదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘పుష్ప 2’ విడుదలయ్యాక 6 నెలల నుంచి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తారని చెబుతున్నాయి. ఆ తర్వాతనే రామ్‌చరణ్ (Ramcharan)తో అనౌన్స్ చేసిన ‘RC 17’ ప్రాజెక్ట్‌ను సుకుమార్ పట్టాలెక్కిస్తారని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి.
చరణ్‌కు జోడీగా సాయిపల్లవి!
‘రంగస్థలం’ (Rangasthalam) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ’RC17’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందనుంది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి సైతం ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్‌ను చాలా బలంగా చూపించే సుకుమార్ సాయిపల్లవిని ఇంక ఏ స్థాయిలో చూపిస్తారోనని ఇప్పటినుంచే చర్చ మెుదలైంది. చరణ్, సాయిపల్లవి జోడీ మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పెయిర్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ‘RC 17’ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ