స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) అనగానే ముందుగా అందరికీ ‘మహానటి’లో ఆమె చేసిన సావిత్రి పాత్రే గుర్తుకు వస్తుంది. అలాగే ‘నేను శైలజ’, ‘నేను లోకల్’, ‘దసరా’ చిత్రాల్లో ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్‌గా కనిపించిన కీర్తినే తెలుగువారికి జ్ఞాపకం వస్తుంది. అటు తమిళంలోనూ ఎక్కడా స్కిన్ షో చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ గాడి తప్పిందన్న మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్లో చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్ ‘బాబీ జాన్’ కీర్తి సురేష్‌కు ఎన్నడు లేనన్ని విమర్శలు తీసుకొస్తోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్లామర్ డోస్ పెచ్చిన కీర్తి..!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ‘బేబీ జాన్’ అనే చిత్రంలో కీర్తి సురేష్ (Keerthi Suresh) నటిస్తోది. హిందీలో ఆమెకు ఇదే ఫస్ట్ డైరెక్ట్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కలిస్ తెరకెక్కిస్తున్నారు. దీనిని వన్ స్టూడియోస్, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, మురాద్, ఖేతానీ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పెషల్ క్యామియో కూడా ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ‘బేబీ జాన్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నయన్ మటక్కా’ ప్రొమోను విడుదల చేశారు. నవంబర్ 25న ఫుల్ వీడియో సాంగ్ రానుంది. అయితే ఈ ప్రోమోలో వరుణ్‌తో కలిసి కీర్తి సురేష్ స్టెప్పులు ఇరగదీసింది. క్రేజీ ఎక్స్ప్రెషన్స్ మెప్పించింది. గతంలో ఎప్పుడు చేయనంత స్కిన్ షోను పాటలో చేయడం విశేషం. మీరు ఓ లుక్కేయండి.
ఏకిపారేస్తున్న నెటిజన్లు
తెలుగు, తమిళ చిత్రాల్లో ఇప్పటివరకూ ట్రెడిషనల్ పాత్రల్లో మెరిసిన కీర్తి సురేష్ (Keerthi Suresh) బాలీవుడ్ మూవీ కోసం ఈ స్థాయి అందాల ప్రదర్శన చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాలీవుడ్లో ఛాన్స్‌ల కోసం ఈ స్థాయి గ్లామర్‌షోలు అవసరమా అని నిలదిస్తున్నారు. బాలీవుడ్‌కు వెళ్లాక కీర్తి అస్సలు ఆగడం లేదని, ఇక బికిని ఒక్కటే బ్యాలెన్స్ అని విమర్శిస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 22) రిలీజ్ చేసిన ‘నయిన్ మటక్కా’ పోస్టర్‌లోని కీర్తి బోల్డ్ లుక్‌ను హైలెట్ చేస్తున్నారు. ఆమె వరకూ క్రాప్ చేసి నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. సౌందర్య లాగా పద్దతిగా కీర్తి సురేష్ ఉంటుందని భావించానని కానీ ఆమె కూడు మెుదలుపెట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇందులో లిప్‌లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెటిజన్లు మరింత ఫైర్ అవుతున్నారు.
చిన్ననాటి స్నేహితుడితో కీర్తి పెళ్లి!
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు. ఆంటోని తట్టిల్ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేసే యంగ్ బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు. ‘ఎస్పిరోస్ విండో సొల్యూషన్స్ ఎల్ఎల్పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించి దానిని దుబాయ్‌కు విస్తరించాడు. అలాగే కొచ్చిలో పలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ