ఈ వారం చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వచ్చే వారం ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలేవి ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు. అటు ఓటీటీలో రీసెంట్ సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వెబ్‌సిరీస్‌లు సైతం అలరించేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. (This Week Telugu Movies)
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ వారమే రిలీజ్ కాబోతోంది. నవంబర్ 28న తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
మిస్ యూ (Miss You)
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (Siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా చేసిన తాజా తమిళ చిత్రం ‘మిస్ యూ’ (Miss You). ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ జానర్లలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.
భైరతి రణగల్ (Bhairathi Ranagal)
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Sivaraj Kumar) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరతి రణగల్’. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నవంబరు 29 (This Week Telugu Movies)న విడుదల కానుంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
క (Ka)
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘క’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం వారమే (This Week Telugu Movies) ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)
దుల్కర్ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ సైతం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్ నిలిచింది.
Title | Category | Language | Platform | Release Date |
Bloody Beggar | Movie | Telugu/Tamil | Amazon | Nov 29 |
Sikandar Ka Muqaddar | Movie | Hindi | Netflix | Nov 29 |
The Trunk | Movie | Korean | Netflix | Nov 29 |
Our Little Secret | Movie | English | Netflix | Nov 27 |
Find Me In Paris | Movie | English | Netflix | Nov 28 |
The Snow Sister | Movie | English | Netflix | Nov 29 |
The Madness | Movie | English | Netflix | Nov 28 |
Parachute | Series | Telugu/Tamil | Netflix | Nov 29 |
Vikatakavi | Series | Telugu | Zee 5 | Nov 28 |
Divorce Ke Liye Kuch Bhi Karega | Series | Hindi | Zee 5 | Nov 29 |
Krishnam Pranaya Sakhi | Movie | Telugu/ Kannada | SunNXT | Nov 29 |
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ