Updated On 6-4-2023
రూ.100 కోట్ల క్లబ్‌లో..
నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే ‘దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు..
ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అంతటా హౌస్ ఫుల్..
నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఏప్రిల్ 7 వరకు పోటీలేదు..
హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఈ వికెండ్ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.
దసరా రూ. 100 కోట్లు
ఎంసీఏ రూ.70 కోట్లు
గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు
శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు
నేను లోకల్ రూ.60 కోట్లు
మజ్ను రూ.58 కోట్లు
నిన్ను కోరి రూ.55 కోట్లు
భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు
దేవదాస్ రూ.48 కోట్లు
జెర్సీ రూ.45 కోట్లు
అంటే సుందరానికి రూ.40 కోట్లు
జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు.
Please Note… దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్