• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!

    నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని

    డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల 

    నిర్మాత: చెరుకూరి సుధాకర్

    సంగీతం: సంతోష్ నారాయణ

    సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్ 

    భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ

    కథ:

    వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్), అతని స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?. వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేశాడు? వంటివి తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

    ఎవరెలా చేశారంటే:

    శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రంలో నాని తన నటనతో అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు మెుత్తం నానినే కనిపిస్తాడు.

    ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నాని నటన ఉంటుంది. ముఖ్యంగా నాని భాష, యాస, తన రూపురేఖలతో ఊరమాస్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్‌లో తన మార్క్‌ చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు నాని పాత్రకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ మూవీ నాని కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నానితో పాటుగా కీర్తి సురేష్ పోటీపడి నటించారు. ఆమె నటన సినిమాకు బాగా ప్లస్‌ అయిందనే చెప్పాలి. అటు దీక్షిత్ శెట్టి సైతం నానితో సమానంగా ఎక్కడ తగ్గకుండా నటించారు. ఈ ముగ్గురి నటన సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ కూడా విలన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. సముద్రఖని, సాయికుమార్ వారి పరిధిమేరకు నటించి మెప్పించారు.

    సాంకేతిక విభాగం:

    టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. నానిలోని నటుడ్ని ఆయన పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో ఎలివేషన్లు బాగా చూపించాడు. కొన్ని సీన్స్‌లో డైరెక్టర్‌ గూస్ బంప్స్ తెప్పించారు. సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.  ‘చంకీలా అంగీలు వేసి’ పాట చిత్రానికే వన్నెతెచ్చింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్టు నాని నటనతో అదంతా కవర్ అయిపోతుంది. మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

    ప్లస్ పాయింట్స్:

    • నటీనటుల నటన 
    • కథ
    • ఎమోషనల్ సన్నివేశాలు
    • సంగీతం
    • సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్:

    • సూటిగా సాగే కథ
    • కథలో వేగం లోపించడం

    రేటింగ్‌: 4/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv