పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రేణూ దేశాయ్ (Renu Desai) కొడుకు అకిరా నందన్ (Akira Nandan) గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా యానిమల్ (Animal) సినిమాలోని ఓ పాటకు పియానో వాయించిన వీడియో మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ కొడుకు పియానో వాయించిన ఈ వీడియోను ఉపాసన (Upasana) షేర్ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదు.. కానీ, అకీరా జస్ట్ సూపర్’ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఎవరూ ఊహించని విధంగా యానిమల్(Animal)లోని ‘నాన్న నువ్వు నా ప్రాణం అనినా…’ అనే పాటకు అకిరా పియానా వాయించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తండ్రి ప్రేమకోసం తపన పడే కొడుకుకి సంబంధించిన పాటను అకిరా ఎంచుకోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రిని అకిరా ఎంతగా మిస్ అవుతున్నాడో అకిరా ఈ ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు అకిరా నందన్ (Akira Nandan)కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అతడి లుక్ వింటేజ్ పవన్‌ను (Pawan Kalyan) గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదిలా ఉంటే అకీరా నందన్‌కు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అకిరా లేటెస్ట్ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ రామ్‌చరణ్ (Ram Charan) తర్వాత మెగా లెగసీకి అసలైన వారసుడు అకీరానే అవుతాడని అంటున్నారు.
రామ్ చరణ్ ఎరా (Era) అయ్యాక మెగా లెగసీ బాధ్యత అంతా అకిరా నందన్ మీదే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అకిరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అతడి కటౌట్‌కు రికార్డులన్నీ పరారవుతాయని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు.
అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్