బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల దూకుడు తగ్గించడంతో కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కామెంట్స్‌తో మరోమారు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అనసూయ ఏమన్నదంటే..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ (Anasuya Bharadwaj) మాట్లాడింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉండగా మూడో బిడ్డ కనాలని ఉందని చెప్పింది. ‘నాకు మూడో బిడ్డని కనాలని ఉంది. అది కూడా ఆడబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా. మా ఆయన మాత్రం మూడో బిడ్డ ఎందుకు అని అంటున్నాడు. నీకేంటి కనేసి నీ సినిమా షూటింగ్స్‌కు, పనులకు వెళ్తావు అని అంటాడు. మూడో బిడ్డను కనడానికి నా భర్త కోపరేట్ చేయట్లేదు. నాకు ఆడ బిడ్డ పుట్టకపోతే నేను వేస్ట్ అని, నా జీవితం వృథా అని అనిపిస్తుంది. కూతురు ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడే అబ్బాయిలకు ఎలా ఉండాలో తెలుస్తుంది. బిడ్డలు ఉంటేనే ఇల్లు చక్కబడుతుంది. మనమే ఈ యూనివర్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంటాం. కాబట్టి నాకు ఆడబిడ్డ కావాలి’ అని చెప్పుకొచ్చింది.
నెటిజన్ల ఫైర్..
అనసూయ తాజా కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆడవారితోనే ఇల్లు చక్కబడుతుందన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. చాలా ఇళ్లల్లో మగపిల్లలే ఉన్నారని, వాళ్లు తమ ఇళ్లను చక్కబెట్టుకోవడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఫేమస్ అవ్వడం కోసం ఏది పడితే అది మాట్లాడవద్దని సూచిస్తున్నారు. అప్పుడు కూడా మగ బిడ్డ పుడితే ఏం చేస్తావ్? అంటూ నిలదిస్తున్నారు. ఈ లేటు వయసులో బేబీ అవసరమా? అంటూ మరికొందరు ఘాటు పదజాలంతో సెటైర్లు వేస్తున్నారు. అయితే మహిళా నెటిజన్లు మాత్రం అనసూయ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు. ఆమె చెప్పినదాంట్లో తప్పేముందని కామెంట్స్ చేస్తున్నారు.
‘పుష్ప 2’లో తేలిపోయిన అనసూయ!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ (2021) చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దాక్షయణి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ‘పుష్ప 2’లోనూ ఆమె పాత్ర అంతే స్థాయిలో హైలెట్ అవుతుందని అంతా భావించారు. అయితే మూవీ రిలీజయ్యాక సీన్ అంతా రివర్స్ అయ్యిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’లో దాక్షయణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. తొలి భాగంతో పోలిస్తే ఆమె పాత్ర నిడివి కూడా చాలా పరిమితంగా ఉందని చెప్పవచ్చు. అటు ఆమె భర్తగా చేసిన సునీల్ రోల్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ‘పుష్ప 3’లోనైనా అనసూయకు లెంగ్తీ సీన్స్ దొరకాలని కోరుకుంటున్నారు.
అనసూయ.. ఎలా ఎదిగిందంటే?
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో ‘సోగ్గాడే చిన్ని నాయన’, క్షణం, విన్నర్, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. రంగస్థలం సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్’, తాజాగా ‘పుష్ప 2’ చిత్రాలతో అనసూయ ప్రేక్షకులను పలకరించింది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి