ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    March 11, 2023

    © File Photo

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద వస్తుందని, జీతాలు ఇచ్చేది మాత్రం ఏప్రిల్ 1 అని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఏప్రిల్‌లో చేస్తే 2023 సీరియల్ నంబర్ వస్తుందని పేర్కొంది.

    గత కొద్ది కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు సరైన సమయానికి జీతాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమకు రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి ప్రభుత్వానికి అర్జీ పెట్టారు. దాదాపు 95 డిమాండ్లను ఉద్యోగులు లేవనెత్తారు. దీనికి సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం విభిన్నంగా స్పందించింది. వేతనాలు, పింఛన్లు బిల్లు పెట్టొద్దని ఆదేశించింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను నిర్వీర్వ్యం చేయాలనే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. 

    సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం అమలులోకి వస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఉద్యోగులు వేతనాలు, తదితర సంబంధిత ఖర్చుల కోసం ముందుగానే కొంత మొత్తాన్ని ఖజానాలో భద్రపరుచుతుంది. ఏప్రిల్ 1 రాగానే ఆ నిధులను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కారణం ఉద్యోగులను అయోమయానికి గురి చేసింది. సీరియల్ నంబర్ కారణంగా బిల్లులు పెట్టొద్దని ఆదేశించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. బిల్లులు పెట్టకపోతే వచ్చే నెల జీతాలు వాయిదా పడతాయి. ఫలితంగా ఉద్యోగులకు భారం పడుతుంది.  

    వీటి ద్వారా ఆదాయం.. 

    రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంటుంది. మార్చి నెలలో అది ఎక్కువగా ఉంటుంది. గ్రాంటులు, పన్నులు, లోటు నిధుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చే గ్రాంటుల బకాయిలను మార్చి నెలలో జమచేస్తుంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కూడా ఈ నెలలో రాష్ట్ర ఖాతాలో జమవుతాయి. దీంతో పాటు ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మరి, ఈ నిధులను వేటి కోసం వినియోగిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీటిని జీతాలు, పెన్షన్ల చెల్లింపు కోసం ఉపయోగించొచ్చు కదా అని సూచిస్తున్నారు. 

    జీతం కోసం ఆగాల్సిందే

    ఏప్రిల్‌లో బిల్లులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో 2023 సీరియల్ నంబర్ వస్తుందని స్పష్టం చేసింది. అంటే వచ్చే నెల 1న మార్చి నెలకు సంబంధించిన జీతాలు రావన్నమాట. ఏప్రిల్ మొదటి వారంలో బిల్లుల ప్రక్రియ పూర్తి చేసినా, అవి అనుమతి పొంది ఉద్యోగుల అకౌంట్‌లో జమయ్యే సరికి కనీసం 15 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతో ఈఎంఐలు, నెలవారీ చందాలు చెల్లించడానికి ఉద్యోగులకు ఇబ్బంది తలెత్తుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version