Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?

    Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?

    September 13, 2024

    న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, మ‌నీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైప‌ర్ ఆది, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కృష్ణ భ‌గ‌వాన్‌, వీటీవీ గ‌ణేష్‌, సింగీతం శ్రీనివాస్‌, లీలా శాంస‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు

    దర్శకత్వం: జె శివసాయి వర్ధన్

    సంగీతం: శేఖర్ చంద్ర

    ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బానెల్లా

    నిర్మాత: N.V కిరణ్ కుమార్

    స‌మ‌ర్ప‌ణ: మారుతి

    విడుద‌ల తేదీ: 13-09-2024

    రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రాజ్‌తరుణ్‌ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ‘భలే ఉన్నాడే!’ సినిమాపై రాజ్‌ తరుణ్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌తరుణ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    రాధ (రాజ్‌త‌రుణ్‌) వైజాగ్‌లో శారీ డ్రాపర్‌ (అమ్మాయిల‌కు చీర క‌ట్టే వృత్తి)గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గౌరి (అభిరామి) పెంపకంలో పెరుగుతూ ఆమెకు చేదోడుగా ఉంటాడు. గౌరి ప‌ని చేసే బ్యాంకులోనే కొత్త‌గా కృష్ణ (మ‌నీషా) ఉద్యోగంలో చేరుతుంది. ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంట‌ల‌కు ఫిదా అవుతుంది. రాధ‌ మొహం కూడా చూడ‌కుండానే అత‌నిపై మ‌న‌సు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణ‌ను చూడ‌కుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖ‌లు చ‌దువుతూ త‌న‌తో ప్రేమ‌లో ప‌డిపోతాడు. వీళ్లిద్ద‌రూ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి సిద్ధ‌మ‌వ్వ‌గా నిశ్చితార్థం స‌మయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విష‌యం చెబుతుంది. దీంతో రాధ పెళ్లికి ప‌నికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? రాధ అమ్మాయిల‌కు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    రాధ పాత్ర‌లో రాజ్‌త‌రుణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నటనకు బాగా స్కోప్‌ దొరికింది. అతడి లుక్స్‌, భావోద్వేగాలు మెప్పిస్తాయి. కృష్ణ పాత్ర‌లో మ‌నీషా అందంగా క‌నిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది. త‌ల్లిగా అభిరామి పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సింగీతం శ్రీనివాస్ క‌నిపించేది నాలుగైదు స‌న్నివేశాలైనా బలమైన ప్రభావాన్ని చూపించారు. అమ్ము అభిరామి, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర ఉంటాయి. హైప‌ర్ ఆది, నెల్లూరు సుద‌ర్శ‌న్ పాత్ర‌లు అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచుతాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    రాముడిలా ఉండాలనుకునే అబ్బాయిని నేటి సమాజం, అమ్మాయిలు ఎలా చూస్తారన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్ర‌థమార్ధం మెుత్తం హీరో, హీరోయిన్‌ ల‌వ్‌ట్రాక్‌, తల్లీకొడుకుల అనుబంధంతో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వార‌ధిగా నడిచే ప్రేమ రాయబరాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిశ్చితార్థ సమయంలో వచ్చే మలుపుతో తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉన్నాడనే నేపథ్యంతో సెకండ్‌పార్ట్‌ను తీసుకెళ్లారు. ప్ర‌థమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చ‌ప్ప‌గా సాగినట్లు అనిపిస్తుంది. హీరోను పరీక్షించేందుకు కేరళ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చేసే హంగామా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. రాధ‌-కృష్ణ విడిపోయిన తీరులోనూ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్‌ కూడా బలహీనంగా ఉండటం మరో మైనస్‌గా చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ చక్కటి పనితీరు కనబరిచారు. తన అద్భుత పనితీరుతో స్క్రీన్‌ను ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చేశారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • రాజ్‌ తరుణ్‌ నటన
    • కథా నేపథ్యం
    • ప్రథమార్థం

    మైనస్‌ పాయింట్స్‌

    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం
    • సెకండాఫ్‌

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version