Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!

    Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!

    August 19, 2023

     బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. శ్రీ బూర‌ వినయ్ కుమార్ – పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయితే వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో బ్రహ్మీ చిన్న కోడలు ఎవరా? అన్న ఆసక్తి  ఫ్యాన్స్‌లో మొదలైంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి నెట్టింట్లో శోధించడం మొదలు పెట్టారు. ఇంతకు ఆమె ఎవరంటే?

    బ్రహ్మానందం ఇంట్లోకి చిన్న కోడలుగా  పెట్టిన అమ్మాయి బ్యాగ్రౌండ్ చాలా బలంగానే ఉంది. కరీంనగర్‌లో ప్రముఖ వైద్యులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పద్మజా వినయ్‌ల గారాల పట్టినే బ్రహ్మీ చిన్న కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు ఐశ్వర్వ. డాక్టర్ చదివింది. తను కూడా గైనకాలజిస్ట్. వీరికి స్థిరచరాస్తులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య పేరుతో ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు టాక్.  కరీంనగర్‌తో పాటు తెలంగాణలోని పలుచోట్ల వీరికి ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిసింది. ఇక అమ్మాయి కూడా చక్కని రూపంతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని లావణ్యంతో మెరిసిపోయింది. అందుకే కొత్త కోడలికి ఎంగేజ్‌మెంట్ సమయంలో బ్రహ్మీ గారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వజ్రాలు పొదిగిన నక్సెస్‌ను పెళ్లికానుకగా బహూకరించారు. దీని విలువ రూ.30 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.

    బ్రహ్మానందం ఆస్తి గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్లలో ఆయనది తొలి స్థానం. రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తన స్తోమతకు తగినట్లుగా ఉంటారని బ్రహ్మానందం భావించడంతో డాక్టర్ సంబంధానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  వీరి పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరయ్యారు.

    ఇక బ్రహ్మానందం పెద్ద కొడుకు  రాజా గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. తండ్రి బాటలో సినిమా రంగంలో నడుద్దామని ప్రయత్నించాడు. పల్లకిలో పెళ్లికూతురు – చారుశీల, బాసంతి వంటి సినిమాలలో నటించాడు. అయితే ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయితే మళ్లీ ఓ వెబ్‌సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

    బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్థ గురించి బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. సిద్ధార్థ విదేశాల్లో చదివాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఇక్కడే స్థిరపడి వ్యాపారం చేయాలని సిద్ధార్థ్ భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర నుంచి తెలిసింది. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం తన ఇద్దరు కుమారులను మాత్రం సినీరంగంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version