ఒకప్పుడు పాలు – నీళ్లలా కలిసున్న మెగా – అల్లు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినప్పటికీ ఈ వివాదం మెుదలైంది. ఆ తర్వాత బన్నీ పేరు ప్రస్తావించకుండానే పవన్ కల్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఈ గాసిప్స్‌కు బలాన్ని చేకూర్చాయి. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మూలాలు మర్చిపోకూడదు’ అని పవన్ చేసిన కామెంట్స్‌ను మెగా ఫ్యాన్స్ బన్నీకి ఆపాదించారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన సెన్సేషన్ వ్యాఖ్యలు సైతం హీరో అల్లు అర్జున్ గురించే చేశారని అంటున్నారు. చిరు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
చిరు ఏమన్నారంటే..
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ – 2025 కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై పలు విషయాలను పంచుకున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు తర్వాతి స్థానం కోసం ఇండస్ట్రీలో ఇద్దరు, ముగ్గురు పోటా పోటీగా ఉన్నారని చిరు గుర్తు చేశారు. రామారావు తర్వాత ఆయన నిర్మాతలంతా తనతో సినిమాలు చేసేందుకు వచ్చారని చెప్పారు. నెం.1 హీరో అవ్వాలనుకున్న తనకు ఆ క్షణం అయ్యానన్న ఫీలింగ్ కలిగిందన్నారు. అలాగని కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో తనకు తెలుసని.. అందుకే అణిగిమణిగి ఉన్నానన్నారు. ‘టాలెంట్ ఉంది కదా.. అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్‌గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంటా అని కాలర్ ఎగరేసామనుకోండి. అబ్బో వీడితో ఎక్కడ పడతాం రా బాబు!.. అని దర్శక నిర్మాతల సైడ్ అయిపోతారు’ అని చిరు చెప్పుకొచ్చారు.
బన్నీ గురించే అన్నారా?
మెగాస్టార్ చిరంజీవి చేసిన లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ (Allu Arjun)ని ఉద్దేశించే చిరు ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో బన్నీలో యాటిట్యూట్ బాగా పెరిగిపోయిందన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించిన తీరు కూడా సరిగ్గా లేదని ప్రచారం జరిగింది. ఒక మహిళ చనిపోయి, ఆమె బిడ్డ ప్రాణపాయ స్థితిలోకి వెళ్లినప్పటికీ బన్నీలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదని పలువురు ఆరోపించారు. అంతేకాదు ‘పుష్ప 2’ ప్రమోషన్స్ సమయంలోనూ ఆయన యాటిట్యూడ్‌లో మార్పులు గమనించామని చెప్పారు. ఈ క్రమంలో చిరు చేసిన కామెంట్స్ సందర్భానుసారంగా వచ్చినవే అయినా వాటిని బన్నీకి ఆపాదిస్తున్నారు. ఒకటి రెండు హిట్లకే పొంగిపోతున్న ఈ తరం హీరోలకు సైతం చిరు మాటలు గట్టి చురకలని కామెంట్స్ చేస్తున్నారు.
పవన్, చరణ్ నా అచీవ్‌మెంట్: చిరు
గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ – 2025 ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ తాను తన అచీవ్‌మెంట్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సభా ప్రాంగణమంతా కేరింతలు, హర్షద్వానాలతో మార్మోగింది. ‘పవన్, చరణ్‌తో పాటు నా ఫ్యామిలీ ఉన్న అందరూ కూడా నా అచీవ్‌మెంట్. వీళ్లందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించిందనిపిస్తుంది. మెున్న పవన్ ఇంటికి వచ్చినప్పుడు ఓ మాట అన్నాడు. మరోక రాజ్ కపూర్ ఫ్యామిలీ మనది కావాలని గతంలో నువ్వు చెప్పావ్ అన్నయ్య. ఈ రోజు చూస్తుంటే నీ మాట ప్రభావం మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది నటులం ఉన్నాము’ అని పవన్ అన్న మాటలను చిరు గుర్తుచేసుకున్నారు. అయితే చిరు.. పవన్, చరణ్ పేర్లతో పాటు బన్నీ పేరును ప్రస్తావించకపోవడాన్ని కూడా నెటిజన్లు హైలేట్ చేస్తున్నారు. అతడి పేరును మెగాస్టార్ కావాలనేే స్కిప్ చేశారని ఆరోపిస్తున్నారు.
అల్లు అర్జున్‌కు నోటీసులు..
సినీనటుడు అల్లు అర్జున్‌కు (Allu Arjun) రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్‌కు నోటీసులు అందజేశారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని అందులో సూచించారు. ఆసుపత్రికి బన్నీ వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని, ఏదైనా జరిగితే అల్లు అర్జున్‌దే బాధ్యతని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి