రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గారాల పట్టి క్లీంకార (Klikara)కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇటీవల కాలంలో తరచూ వైరల్ అవుతున్నాయి. క్లీంకారతో దిగిన ఫొటోలను ఇప్పటికే చరణ్, ఉపాసన పలుమార్లు నెట్టింట పంచుకున్నారు. అయితే ఎక్కడా ముఖం రివీల్ కాకుండా జాగ్తత్త పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్లీంకారకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన తండ్రి రామ్‌చరణ్‌ను తొలిసారి టీవీ స్క్రీన్‌లో చూస్తూ ఆ బంగారు తల్లి మురిసిపోతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
నాన్నను స్క్రీన్‌పై చూస్తూ..
రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా తన కూతురు క్లీంకార (Klikara) వీడియోను పోస్టు చేసింది. ఇందులో క్లీంకార.. రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ (RRR: Behind & Beyond) డాక్యుమెంటరీని వీక్షిస్తూ కనిపించింది. టీవీ స్క్రీన్‌పై తన తండ్రి చరణ్ కనిపించగానే క్లీంకార ఎంతో మురిసిపోయింది. ముద్దుముద్దుగా మాట్లాడుతూ మురిసిపోతూ అలానే చూస్తూ ఉండిపోయింది. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో సంతోషపడటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
‘చరణ్‌ను చూసి గర్విస్తున్నా’
క్లీంకార వీడియోను పోస్టు చేస్తూ ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోకు తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. ‘RRR చిత్రం మాకు ఎన్నోవిధాలుగా మధుర జ్ఞాపకాలు అందిస్తోంది. నాన్నను తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందించింది. రామ్‌చరణ్.. నీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఉపాసన రాసుకొచ్చింది. కాగా, రామ్‌చరణ్ దంపతులకు 2023లో క్లీంకార జన్మించింది. పాపకు ఇబ్బంది లేకుండా చరణ్ జంట ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నా అందులో పాప ముఖాన్ని చూపించడం లేదు.
డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్..
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘RRR’. భారీ వసూళ్లతోపాటు ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ డాక్యుమెంటరీని తీసుకొచ్చారు. మూవీ చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ (RRR: Behind & Beyond) డాక్యుమెంటరీని చిత్రబృందం రిలీజ్ చేసింది. తొలుత ఎంపిక చేసిన థియేటర్లలో డిసెంబర్ 20న ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. ఓటీటీలో ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు తెలిపాయి.
ఒకే వేదికపై బాబాయి – అబ్బాయి
ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ (Game Changer) ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్ బిజీ బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ విడుదల కానుంది. ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!