NTR 31: తారక్ – నీల్‌ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్‌? తెలిస్తే షాకే! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NTR 31: తారక్ – నీల్‌ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్‌? తెలిస్తే షాకే! 

    NTR 31: తారక్ – నీల్‌ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్‌? తెలిస్తే షాకే! 

    January 6, 2025

    కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), దేవర (Devara) సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. గతేడాది ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. పెద్దగా అప్‌డేట్స్‌ సైతం ఈ మూవీ నుంచి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘NTR 31’కు సంబంధించి సాలిడ్‌ బజ్‌ ఒకటి బయటకొచ్చింది. దీంతో తారక్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 

    సెట్స్‌పైకి ఎప్పుడంటే?

    తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలోని ‘NTR 31’ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న షూటింగ్‌ ప్రారంభ తేదీ ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 16 నుంచి తారక్‌ కొత్త సినిమా షూట్‌ మెుదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళూరులో తొలి షెడ్యూల్‌ను ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు టాక్. ఇదిలా ఉంటే 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనుంది. 

    ‘వార్‌ 2’ ఫినిష్‌ కాకుండానే..

    జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నటిస్తున్నారు. ఆ సినిమాలో తారక్‌ పాత్రకు సంబంధించిన షూట్‌ ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ‘వార్‌ 2’లో తన పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని పూర్తిగా ‘NTR 31’పై ఫోకస్‌ పెట్టాలని ఎన్టీఆర్ భావించారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ‘వార్‌ 2’ ఫినిష్‌ కాకుండానే నీల్‌తో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నాడు తారక్‌. అయితే మంగళూరులో జరిగే ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్‌లో తారక్‌ పాల్గొనడని తెలుస్తోంది. అతడు వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. 

    బిగ్‌ క్యాస్ట్‌ లాక్‌?

    NTR 31’ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే సాలిడ్‌ టైటిల్‌ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్‌కు తగ్గట్లే స్టార్‌ క్యాస్ట్‌ను సైతం ఆయన ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మలయాళ స్టార్‌ హీరో టొవినో థామస్‌ (Tovino Thomas)ను ఈ ప్రాజెక్ట్‌ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు అదే ఇండస్ట్రీకి చెందిన సీనియర్‌ నటుడు బీజు మీనన్‌ (Biju Meenon) సైతం ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ‘NTR 31’ అంచనాలు అమాంతం పెరగడం ఖాయమని చెప్పవచ్చు. కాగా, ఈ సినిమాలో తారక్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ నటించనున్నట్లు గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. 

    రూ.300 కోట్ల ఖర్చుతో..

    తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. ఇక సినిమాలోని ఇతర నటీనటులు, షూటింగ్‌ వివరాలపై రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version