హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ కీతో టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తోంది.
హోండా ద్విచక్ర వాహన కంపెనీ మార్కెట్‌లోకి సరికొత్త యాక్టివా స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో ఆన్‌బోర్డు డయాగ్నస్టిక్స్ 2 (OBD2) ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది. మరిన్ని అధునాతన ఫీచర్లను బైక్‌లో యాడ్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ధర?
సరికొత్త హోండా యాక్టీవా 125 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్ వేరియంట్లలో కొనొచ్చు.
Drum: Rs. 78,920
Drum Alloy: Rs. 82,588
Disc: Rs. 86,093
H-Smart: Rs. 88,093
కలర్స్:
న్యూ మోడల్ యాక్టివా మెుత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. పెరల్ నైట్ స్టార్ట్ బ్లాక్, హెవీ గ్రే మెటాల్లిక్, రెబెల్ రెడ్ మెటాల్లిక్, పెరల్ ప్రీషియస్ వైట్, మిడ్‌నైట్ బ్లూ మెటాల్లిక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్స్:
ఈ కొత్త వెర్షన్ యాక్టివాలో స్మార్ట్ స్టార్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్ కీ సాయంతో స్కూటీని 2 మీటర్ల దూరం నుంచే స్టార్ట్ చేయోచ్చు. అలాగే పార్కింగ్ ఏరియాలో 10మీ. దూరం నుంచే స్కూటీ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.
డిజిటల్ మీటర్:
2023 యాక్టివా 125లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. ఇది ఓడోమీటర్, క్లాక్ , ECO ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ వంటి అదనపు సమాచారాన్ని అందిస్తుంది.
ఇంజిన్
యాక్టివా ఇంజిన్.. 123.97cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటార్‌ను కలిగి ఉంది.
మైలేజ్:
ఈ నయా యాక్టివాపై ఒక లీటర్ పెట్రల్‌తో 60 కి.మీ దూరం అలవోకగా ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడు 90 KMPHగా ఉంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?