• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    నేడు ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష

    ఆరోగ్య శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ జరుగుతున్న తీరును పరిశీలించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీల పనుల పురోగతి, హాస్పిటళ్ళల్లో నాడు -నేడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పై అధికారులతో చర్చించనున్నారు.

    చంద్రబాబుకు స్కిన్ అలర్జీ

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఉక్కపోత కారణంగా ఆయనకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు ప్రకటించారు.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

    ఏపీలో నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

    దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

    తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో బస్టాండ్‌లు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని బడులలో నిన్న పరీక్షలు ముగిసాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాలలు ముగిసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు విద్యార్దులతోె కిటకిటలాడుతున్నాయి..

    ‘అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు’

    చంద్రబాబు తప్పు చేయకుండానే అక్రమ కేసులో జైల్లో పెట్టారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు? అని ప్రశ్నించారు. ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా అని నిలదీశారు. అదే నేరమైతే ఇక ప్రజలకు దిక్కెవరని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.

    అమిత్‌ షాకు అన్ని విషయాలు చెప్పా: లోకేష్

    కేంద్రమంత్రి అమిత్‌ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై షాకు అన్ని విషయాలు వివరించినట్లు లోకేష్ వెల్లడించారు. ‘అమిత్‌ షా నన్ను కలవాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు అమిత్ షాను కలిశాను. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భద్రత పరంగా ఆందోళన ఉందని చెప్పా. సీఐడీ ఎన్ని కేసులు పెట్టిందని షా అడిగారు. రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పాను’ అని లోకేష్ … Read more