• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

    ఏపీలో నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

    దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

    తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో బస్టాండ్‌లు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని బడులలో నిన్న పరీక్షలు ముగిసాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాలలు ముగిసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు విద్యార్దులతోె కిటకిటలాడుతున్నాయి..

    ‘అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు’

    చంద్రబాబు తప్పు చేయకుండానే అక్రమ కేసులో జైల్లో పెట్టారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు? అని ప్రశ్నించారు. ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా అని నిలదీశారు. అదే నేరమైతే ఇక ప్రజలకు దిక్కెవరని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.

    అమిత్‌ షాకు అన్ని విషయాలు చెప్పా: లోకేష్

    కేంద్రమంత్రి అమిత్‌ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై షాకు అన్ని విషయాలు వివరించినట్లు లోకేష్ వెల్లడించారు. ‘అమిత్‌ షా నన్ను కలవాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు అమిత్ షాను కలిశాను. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భద్రత పరంగా ఆందోళన ఉందని చెప్పా. సీఐడీ ఎన్ని కేసులు పెట్టిందని షా అడిగారు. రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పాను’ అని లోకేష్ … Read more

    హైదరాబాద్ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఇన్‌చార్జ్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, పది మంది ఎస్పీలతో సహా మొత్తం 20 మంది ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లను నియమించారు.

    ‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని కేఏపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. వారు గెలిచి మళ్లీ ఆ పార్టీలోనే చేరుతారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న తమ వాళ్లను గెలిపించుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.. అలాగే తెలంగాణ జనసేన, వైసీపీ పార్టీలను కూడా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో 60శాతం మంది బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తమ పార్టీ అభ్యుర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    హరీష్, కేటీఆర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

    ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో కీలక సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇద్దరితో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ ఆలోచనలు పంచుకోనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.

    మూడేళ్లకోసారి పవన్ భార్యలు మారుతారు: జగన్

    సామర్లకోట సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దత్తపుత్రుడికి ఇక్కడ శాశ్వత చిరునామా లేదు. ఆయన ఇల్లు హైదరాబాద్‌లోనే. రెండు సినిమాల షూటింగ్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతాచు. యూజ్ అండ్ త్రో పవన్ పాలసీ. మూడు నాలుగేళ్లకోసారి ఆయన భార్యలు మారుతుంటారు. ఫస్ట్ లోకల్, తరువాత నేషనల్, ఆతర్వాత ఇంటర్నేషనల్ స్థాయికి భార్యల మార్పు జరిగిందన్నారు. ఆడవాళ్లన్నా, పెళ్లిలన్నా గౌరవం లేదు అని ఆరోపణలు గుప్పించారు.

    సొంత అత్తను కాల్చిచంపిన కానిస్టేబుల్

    హనుమకొండ- గుండ్ల సింగారంలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఆస్తి గొడవల కారణంగా సొంత అత్తను అల్లుడు కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న హతురాలు కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రసాద్‌ కోటపల్లి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రసాద్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

    అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

    టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్న లోకేశ్ ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి అమిత్ షాను కలవడంపై చర్చ జరుగుతోంది. తన తండ్రి అరెస్ట్, కోర్టుల్లో జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు వివరించినట్లు లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.