• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్

    బీఆర్ఎస్ ఎన్నికల సింబల్ అయిన కారును పోలిన గుర్తును అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి కేటాయించొద్దంటూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమెషిన్, ఓడ, ఆటోరిక్షా వంటి కారును పోలిన గుర్తులను వచ్చే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించొద్దని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించనుంది.

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున?

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజేందర్ కుటుంబం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పూడూరులో నివాసం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల విషయంలోనూ వారి కుటుంబానికి మేడ్చల్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ టికెట్ కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    శ్రీవారి దర్శనానికి 6 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,388 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.3.74కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    20 మంది అధికారులకు ఈసీ షాక్

    తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. కాగా, వీరిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఉన్నారు.

    అన్‌స్టాపబుల్ సీజన్-3 డేట్స్ ఫిక్స్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 ఈనెల 17 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘బాలయ్య నటించిన భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనుంది. డెరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌తో కూడిన ఫొటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. బాలకృష్ణ మరోసారి ఈ ప్రోగ్రామ్‌లో సందడి చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ 19న రిలీజ్ కానుంది.

    కవితను కాపాడేది బీజేపీనే: నారాయణ

    కేసీఆర్‌ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే. వైసీపీ, కేసీఆర్‌, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని చెప్పారు. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    విద్యార్థినిపై అధ్యాపకుడు అత్యాచారం

    Ap: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రైవేటు అధ్యాపకుడు దారి తప్పాడు. ఓ విద్యార్ధిని బెదిరిస్తూ పులుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ కళాశాలలో విద్యార్ధిని ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటి వద్ద దింపే నెపంతో సదరు విద్యార్థినిని ఓ రోజు అధ్యాపకుడు బైక్‌పై తీసుకెళ్లాడు. పట్టణ శివార్లలోకి తీసుకెళ్లి ఆమె అసభ్యకర చిత్రాలను ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

    హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట

    చంద్రబాబు పిటిషన్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంగళ్ల కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయోద్దని ఆదేశించింది. IRR కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయోద్దని స్టే ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఉత్తర్యులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.

    అన్నీ వేళ్లు చంద్రబాబు వైపే: సజ్జల

    చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ‘నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించుకోగలరా? ఊరు పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేయించారు. సీమెన్ సంస్థ కూడా మాకు సంబంధం లేదని తెలిపింది. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అన్నీ ఆధారాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చారు.