• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్- చంద్రబాబు పొత్తుపై సెటైర్లు

    పనవ్- చంద్రబాబు పొత్తుపై సీఎం జగ్ సెటైర్లు విసిరారు. ‘చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చేవి.. మోసాలు వెన్నుపోట్లు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైళ్లో ఉన్నా ఒకటే. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి. పవన్ పార్టీ పెట్టి 15 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటివరకు కనీసం గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తే లేడు. పవన్ జీవితమంతా చంద్రబాబు భజన చేయడానికే సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

    చంద్రబాబు పిటిషన్‌ వాదనలు వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టులో వాదించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో స్కిల్ స్కాం 2018లో జరిగిందని ఎక్కడా లేదన్నారు. 17ఏ ఈ కేసులో కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్ననికి వాయిదా వేసింది. లంచ్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.

    యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ విడుదల

    సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని యాత్ర 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర సినిమాలో మమ్మూటి ప్రధాన పాత్రలో హిట్ కాగా.. దానికి సిక్వేల్‌గా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. తాజాగా ఆ చిత్రం నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వీ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

    అన్నం పెట్టిన అమ్మాయిపైనే అత్యాచారం

    ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. బిహార్‌కు చెందిన ధర్మేందర్, ఓ బాలిక వారం రోజులుగా అద్దె ఇంట్లో ఊంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేందర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారందరికీ బాలిక వంట చేసి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత ధర్మేందర్‌ను బయటకు గెంటేసి ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన జగన్

    వైసీపీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం జగన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రకటనలు చేశారు. ఈమేరకు నాలుగు కీలక కార్యక్రమాలు రూపొందించారు. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు జగన్ ప్రకటించారు. అలాగే చంద్రబాబు- పవన్ కళ్యాణ్‌ను ఎలా ఎదుర్కోవాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు.

    చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ

    చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు YSRTP పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పాలేరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరు సీటు కోసం ఆమె పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఖమ్మం ఎంపీ స్థానానని ఆఫర్ చేసింది. దీంతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ అయింది. ముందు నుంచి షర్మిల రాకను పీసీసీ … Read more

    39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    నేడు వైసీపీ ప్రతినిధుల సభ

    నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. 8,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తొలిసారి బార్ కోడింగ్ పాస్‌లను వైసీపీ జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.