• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఆదిలాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

    నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌లోని 7 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. సుమారు లక్షమందిని సభకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలు సభకు హాజరుకానున్నారు.

    15 నుంచి ప్రజల్లోకి సీఎం కేసీఆర్

    ఈ నెల 15 నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి.. 17న సిద్ధిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

    మళ్లీ పెరిగిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ వారంలో వరుసగా రెండో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 పెరిగి రూ.53,350కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ.58,200కు ఎగబాకింది. కిలో వెండి ధర రూ. 500 పెరగింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,500కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    చంద్రబాబు పిటిషన్ వాయిదా

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.

    చంద్రబాబుకు పిటిషన్ డిస్మిస్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది.

    చంద్రబాబుపై సింపతి పెరిగింది: మురళీమోహన్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం బాధను కలిగిస్తోందని నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదన్నారు. అవినీతి మచ్చలేకుండా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో ఆయనపై సింపతి పెరిగిందన్నారు. ఎచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మురళీమోహన్ అన్నారు..

    పవన్- చంద్రబాబు పొత్తుపై సెటైర్లు

    పనవ్- చంద్రబాబు పొత్తుపై సీఎం జగ్ సెటైర్లు విసిరారు. ‘చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చేవి.. మోసాలు వెన్నుపోట్లు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైళ్లో ఉన్నా ఒకటే. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి. పవన్ పార్టీ పెట్టి 15 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటివరకు కనీసం గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తే లేడు. పవన్ జీవితమంతా చంద్రబాబు భజన చేయడానికే సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

    చంద్రబాబు పిటిషన్‌ వాదనలు వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టులో వాదించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో స్కిల్ స్కాం 2018లో జరిగిందని ఎక్కడా లేదన్నారు. 17ఏ ఈ కేసులో కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్ననికి వాయిదా వేసింది. లంచ్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.

    యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ విడుదల

    సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని యాత్ర 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర సినిమాలో మమ్మూటి ప్రధాన పాత్రలో హిట్ కాగా.. దానికి సిక్వేల్‌గా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. తాజాగా ఆ చిత్రం నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వీ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.