• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    చంద్రబాబుకు డీహైడ్రేషన్‌

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. చంద్రబాబు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్‌ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్‌కు గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు.. వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేశారు.

    దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదు: లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. నన్ను సీఐడీ 50 ప్రశ్నలు అడిగింది. అందులో ఈ కేసులో నేను ఎలా లాభపడ్డానో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కక్ష సాధింపు కోసమే నాపై ఎలాంటి ఆధారాలు లేని కేసు పెట్టారు. మళ్లీ రావాలని … Read more

    చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటల నుంచి హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. వాదనలు మొత్తం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని సాల్వే, వర్తించదని రోహత్గి బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

    సీఐడీ విచారణకు లోకేష్

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ చేంజ్ చేశారని లోకేష్‌పై సీఐడీ అభియోగాలు మోపింది. రాష్ట్ర విభజనకు ముందు హెరిటెజ్ సంస్థ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాలు ల్యాండ్ కొంటే అవినీతి ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.

    రాళ్ల మధ్యలో యువతి.. 12 గంటలు నరకం

    విశాఖపట్నం అప్పికొండ బీచ్‌లో రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువతి 12 గంటల పాటు నరకం అనుభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య, వర్మ రాజు ఈనెల 2 నుంచి అప్పికొండ ప్రాంతంలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఫొటోలు తీసుకుంటుండగా కావ్య రాళ్ల మధ్యలో జారిపడిపోయింది. దీంతో రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం ఆమె కేకలు విన్న జాలర్లు అతికష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, కావ్య కనిపించడం లేదంటూ ఆమె తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు

    సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘ఈ కేసు మూలంలోనే తప్పు ఉంది. అన్నీ కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ తయారు చేశారు. ఇందులోని ఎఫ్‌ఐఆర్ చట్టబద్దం కాదు. 164 కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారు. దానిని సవాలు చేస్తున్నాం’ అని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు లభించాక 2021లో సీఐడీ కేసు నమోదు చేసింది. 17A చట్ట … Read more

    శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం

    మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన అంశాలను శ్రీనివాస్ గౌడ్ తప్పుగా చూపించారని పేర్కొన్నారు. ఒకసారి అఫిడవిట్ సమర్పించాక రిటర్నింగ్ అధికారి నుంచి తిరిగి తీసుకుని దానిని సవరించారని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల నిబంధలకు విరుద్ధమని తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.