• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 400 పెరిగి రూ. 53,150కి ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 440 పెరిగి 57,980కి పెరిగింది. అటు కిలో వెండి ధర రూ. 75 వేల వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. డిమాండ్ పెరగడంతో మళ్లీ పెరిగాయి.

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి … Read more

    తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,515 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,230 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసు ఐటెం నంబర్ 59గా లిస్టైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సేక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్‌ చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లాయర్లు వాదిస్తున్నారు.

    అమిత్‌షాతో పురందేశ్వరి భేటి

    కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ భాజపా చీఫ్‌ పురందేశ్వరి భేటి అయ్యారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఓ మద్యం దుకాణంలో రూ.లక్ష వరకూ విక్రయాలు జరగ్గా.. కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు జరిగాయని ఇటీవల పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నగదు వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు.

    ఫ్లాగ్‌ను మార్చిన భారత వైమానిక దళం

    భారత వైమానిక దళం తన ఫ్లాగ్‌ను మార్చింది. వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కొత్త జెండాను ఆవిష్కరించారు. 72 సంవత్సరాల తర్వాత వైమానిక దళం ఫ్లాగ్‌ను మార్చడం విశేషం. CDS జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లాగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కొత్త జెండాను వైమానిక దళం విలువలు, సేవలను ప్రతిబింబించేలా రూపొందించారు. పాత ఫ్లాగ్‌ను ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.

    వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

    AP: వైసీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు విసిరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    మంత్రి ఇంటిపై బాంబు దాడి

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్‌లో ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట బాంబు పేలింది. శనివారం రాత్రి 10 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంత్రి ఇంటిపై గ్రెనెేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న CRPF జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. పేలుడు గురించి తెలుసుకున్న సీఎం బీరెన్ సింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి భద్రత పెంచాలని ఆదేశించారు.

    బండారుపై సుప్రీంకోర్టుకు వెళ్తా: రోజా

    AP: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మంత్రి ఆర్కే రోజా అన్నారు. న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’ అని రోజా అన్నారు.

    బైడెన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు

    ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు బాధాకరం. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఈ దాడులకు అమెరికా నుంచి నిధులు అందడం అత్యంత అవమానకరం. బైడెన్‌ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని ట్రంప్ ఆరోపించారు.