• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసియా క్రీడల్లో మెరిసిన తెలుగు తేజం

    ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతిసురేఖ పతకాలను గెలుచుకోవడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల బ్యోతిసురేఖ ఆర్చరీలో దేశం గర్వపడేలా మూడు బంగారు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 102 పతకాలు సాధించింది. అందులో 27 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి

    డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు

    సినీ నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు అందజేసింది. 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవల 6 గంటల పాటు నవదీప్‌ను విచారించిన నార్కోటిక్స్ పోలీసులు ఆయన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా నవదీప్‌ను విచారించిన అధికారులు ఆయన వాట్సాప్ చాట్‌ను రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ చాట్ డేటా ఆధారంగా మరోసారి విచారించే అవకాశం ఉంది.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ‘టీడీటీ అధికారంలోకి వస్తే పరిస్థితేంటి’

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలన్నారు. వాలంటీర్లు 90 శాతం మంది వైసీపీ మద్ధతుదారులు ఉన్నారని చెప్పారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మారుస్తామని బాలినేని పేర్కొన్నారు.

    హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ క్లినిక్’ మెషిన్

    దేశంలోనే మొదటి సారిగా ‘ఎనీ టైమ్ క్లినిక్’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్‌ ద్వారా జ్వరం నుంచి కేన్సర్ వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు స్వయంగా మనమే చేసుకోవచ్చు. దీన్ని తొలిసారిగా చందానగర్‌లోని ప్రణామ్ ఆస్పత్రిలో ప్రారంభించారు. నార్మల్ హెల్త్ చెకప్, జ్వరం, కంటి పరీక్షలు వంటి 75 రకాల టెస్టులు చేసుకునేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. మెషిన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం సైతం ఉంది.

    జగన్‌ది అసమర్థ పాలన: పవన్

    ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు సైతం 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జగన్ అసమర్థ పాలనలో సమస్యలు లేవనెత్తితే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు వాయిదా వేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

    భారీగా పట్టుబడిన గంజాయి

    విశాఖలోని పెందుర్తిలో భారీగా గంజాయి పట్టుబడింది. వేపుగంటలోని ఓ ఇంట్లో పోలీసులు 200 కిలోల గంజాయిని గుర్తించారు. దీన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టుకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు దంపతులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    తిరుపతిలో జంట హత్యల కలకలం

    తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తన భార్య మనీషా, బామ్మర్ధి హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో వెళ్లి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోాయాడు.