• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా పట్టుబడిన గంజాయి

    విశాఖలోని పెందుర్తిలో భారీగా గంజాయి పట్టుబడింది. వేపుగంటలోని ఓ ఇంట్లో పోలీసులు 200 కిలోల గంజాయిని గుర్తించారు. దీన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టుకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు దంపతులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    తిరుపతిలో జంట హత్యల కలకలం

    తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తన భార్య మనీషా, బామ్మర్ధి హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో వెళ్లి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోాయాడు.

    చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వాయిదా

    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదివరకే చంద్రబాబును కస్టడీకి అప్పగించినందునా మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

    ఏపీలో టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోంది: కారుమూరి

    ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ‘ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది అంటూ విమర్శలు గుప్పించారు.

    లండన్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్ పర్యటనకు వెళ్లారు. ఆమె శుక్రవారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ‘మహిళా రిజర్వేషన్ చట్టం- ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అటుమ్ని సమావేశంలో కవిత పాల్గొంటారు.

    తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉంది: సీఈసీ

    రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు – మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు’ అని పేర్కొన్నారు.

    పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

    మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

    అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

    ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.