• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్య, పిల్లల్ని చంపి కానిస్టేబుల్ సూసైడ్

    కడప – కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. అతని భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

    సెన్సార్ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

    ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హీరో విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మార్క్ ఆంటోని చిత్రం సెన్సార్ కోసం రూ.7 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించిన సెన్సార్ బోర్డు.. ఇకపై సినిమా నిర్మాణ సంస్థలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

    పెడనలో పవన్ ఫ్లాప్ షో: జోగి రమేష్

    పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. పెడనలో ప్రజల అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ‘సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశారు. రెండు వేల మందితో దాడులు అన్నారు. పవన్‌ సభకు రెండు వేల మంది కూడా రాలేదు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో. జనసేన-టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్’ అంటూ ఎద్దేవా చేశారు.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని మొత్తం 28 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 76,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 32,238 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకటేశ్వర స్వామీ హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    నారా భువనేశ్వరి బస్సు యాత్ర?

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమైంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. కుప్పం నుంచి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆమెకు పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బస్సు యాత్ర తేదీ ఇంకా ఖరారు కాలేదు.

    ఇవాళ ముదినపల్లే నుంచి వారాహి యాత్ర

    నేడు విజయవాడ- ముదినేపల్లిలో పవన్ కల్యాణ్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లికి పవన్ చేరుకోనున్నారు. ముదినేపల్లిలో బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మాటల దాడి పెంచారు. 32 కేసులున్న జగన్ అవినీతిపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. సమస్యలపై గళం విప్పిన నేతలను జైలుకు పంపించి జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

    నేటి నుంచి జగన్ ఢిల్లీ టూర్

    నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    బీజేపీతో జనసేన పొత్తు లేనట్లేనా?

    పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నా తప్ప లేదు. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమతో జగన్‌ను పాతాళానికి తొక్కేయవచ్చు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని మద్దతు తెలిపా. ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు వస్తా. కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుంది” అని ఆశిస్తున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆయా శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.