• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి జగన్ ఢిల్లీ టూర్

    నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    బీజేపీతో జనసేన పొత్తు లేనట్లేనా?

    పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నా తప్ప లేదు. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమతో జగన్‌ను పాతాళానికి తొక్కేయవచ్చు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని మద్దతు తెలిపా. ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు వస్తా. కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుంది” అని ఆశిస్తున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆయా శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    చంద్రబాబు అరెస్టు బాధాకరం: తలసాని శ్రీనివాస్‌

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.

    ఓట్ల కోసమే జగన్ పథకాలు: పవన్

    వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే జగన్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం. నిధుల మళ్లింపులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు..

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

    పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మచిలిపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో కొంత మంది క్రిమినల్స్, అసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచిదికాదు. విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తే పర్యవసనాలు ఉంటాయి. మా సమాచార వ్యవస్థ మాకుంది. ఆయన దగ్గర ఏమైన ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి’ అని సూచించారు.

    పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.