• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్

    ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మోదీకి ఛాలెంజ్ చేస్తున్న.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్‌కు లేదు.. ఎన్డీఏలో చేరేందుకు మాకు పిచ్చి కుక్క కరవలేదు. మేం కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

    శ్రీవారి దర్శనానికి 10 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    భారీగా తగ్గిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ.52,600కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.660 తగ్గి రూ.57,380కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.2000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,200 వద్ద కొనసాగుతోంది.

    బీజేపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన

    జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుపై పవన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. పవన్‌ అభిప్రాయంపై వెంటనే స్పందించలేమన్నారు. పవన్ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పురందేశ్వరి పేర్కొన్నారు.

    పోకిరిల తాట తీస్తున్న షీ టీమ్స్

    బహిరంగ ప్రదేశాలలో మహిళలను అసభ్యంగా తాకుతూ అమర్యాదగా ప్రవర్తిస్తున్న పోకిరిల ఆటకట్టిస్తున్నారు షీ టీమ్స్. ఇటీవల జరిగిన గణేష్ శోభాయాత్రలో మహిళలను వేధించిన 280 ఈవ్ టీజర్లను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన అసభ్య ప్రవర్తనను వీడియోల్లో రికార్డు చేశారు. ప్రతి ఒక్కరి ప్రవర్తనపై నిఘా ఉంటుందని మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు.

    వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

    వారాహీ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి హిట్లర్‌ పరిస్థితిలా ఉంది.’ అని పవన్‌ విమర్శించారు.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

    ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. చంద్రబాబుపై కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ నమోదు చేసిందని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    రైతుల త్యాగాలు వృథా కావు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అడ్డదారిలో వెళ్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం జరిగితీరుతుందన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.