• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

    ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. చంద్రబాబుపై కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ నమోదు చేసిందని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    రైతుల త్యాగాలు వృథా కావు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అడ్డదారిలో వెళ్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం జరిగితీరుతుందన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

    ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.3శాతం: ప్రపంచ బ్యాంక్

    భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరంలో ఇండియా 6.3శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దేశంలోకి పెట్టుబడుల వరుస, స్థానిక డిమాండ్ వృద్ధిరేటుకు దోహం చేస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో దేశ ద్రవ్యోల్బణం 5.9శాతంగా ఉండబోతుందని అంచనా వేసింది.

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

    చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వినిపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తీసుకునన నిర్ణయాలు అధికార నిర్వాహణలో భాగంగా తీసుకున్నవని కోర్టుకు వివరించారు. ఈ నిర్ణయాలకు 17(A) యాక్ట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష్యపూరితమైనవని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. నేరపూరితమై చర్యలకు 17(A) వర్తించదని కోర్టుకు విన్నవించారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి … Read more

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

    ప్రధాని మోదీ సభకు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహాబూబ్‌నగర్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరు కాలేదు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఇరువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈరోజు ప్రధాని మోదీ నిజమాబాద్ సభకు రానున్నారు. మరి ఈ సభకైన విజయశాంతి, కోమటిరెడ్డి హాజరవుతారో లేదో చూడాలి.

    పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

    ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ

    అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని ఉమ ఇతర టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారించిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

    బిహార్‌లో బీసీలే అధికం

    బిహార్ కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల ప్రకారం బిహార్ మొత్తం జనాభాలో 63.13శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. వీరి సంఖ్య 13.07 కోట్లు. ఇక దళితులు 19.65%, అత్యంత వెనకబడిన వారు 36శాతం, యాదవులు 14.27శాతం, ఇతర వెనకబడిన కులాల వారు 27శాతం మంది ఉన్నారు. అటు హిందువులు 81.99శాతం ఉండగా.. ముస్లింలు 17.7శాతం ఉన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిరాకరించడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టారు.