• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్బన్ ఫారెస్టులో హైదరాబాద్ సిటీ సరికొత్త రికార్డు

    హైదరాబాద్లో ఏ మెట్రో సిటీలో లేనంత దట్టమైన అర్బన్ పారెస్ట్ ఇక్కడ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ అటవీ విస్తీర్ణం గత కొన్నేళ్లుగా 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చ.కిలోమీటర్లకు (147%) పెరిగిందని వెల్లడించారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మరో 6 అర్బన్ పార్కులను ప్రారంభించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. HMDA పరిధిలో 60 వేల ఎకరాల్లో 59 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. Perhaps, no other metro has such … Read more

    ఈ మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ అంకిత‌భావాన్ని మెచ్చుకోవాల్సిందే!

    తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ PHCలోని కుదురుముల్ల వద్ద ఒక మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ కోవిడ్ వ్యాక్సినేష‌న్ అందించేందుకు మోకాళ్ల లోతు నీటిలో న‌డుచుకుంటూ వెళ్ల‌డం క‌నిపించింది. మా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అడ్డంకుల‌ను దాటుకొని ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని చెప్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఆమె అంకిత‌భావాన్ని మెచ్చుకుంటూ పోస్టు పెట్టింది. వీడియో చూసేందుకు … Read more

    బ్రిడ్జి మ‌ధ్య‌లో చిక్కుకున్న వ్య‌క్తిని కాపాడిన పోలీసులు

    గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలో వ‌ర్షాలు కుండ‌పోత‌గా కురుస్తున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న ఈ వ‌ర్షాలు వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్లు కార్లు, మ‌నుషులు నీళ్ల‌లో కొట్టుకుపోతున్న ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. తాజాగా హిమాయ‌త్ సాగ‌ర్ స‌ర్వీస్ రోడ్డు బ్రిడ్జి వ‌ద్ద ప్ర‌మాదం అంచున‌ ఉన్న ఒక వ్య‌క్తిని సైబ‌రాబాద్ పోలీసులు కాపాడారు. బ్రిడ్జి దాటేందుకు ప్ర‌య‌త్నించిన ఆ వ్య‌క్తి బైక్‌తో స‌హా అదుపుత‌ప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    కాంగ్రెస్ నేత జ‌ట్టు ప‌ట్టుకొని లాగిన పోలీసులు.. వీడియో వైర‌ల్

    నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారిస్తున్న నేప‌థ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈడీ విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బి.వి జుట్టు ప‌ట్టుకొని లాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై … Read more

    NDRF నిధుల్లో తెలంగాణకు సున్నా..ప్రశ్నించిన KTR

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా NDRF ఫండ్స్ ఫొటోలు జతచేశారు. వాటిలో 2018 నుంచి ఇప్పటివరకు NDRF నిధుల్లో కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఫండ్స్ ను ఇచ్చినట్లు మ్యాపులో పేర్కొన్నారు. 2020 హైదరాబాద్ వరదల నుంచి 2022 గోదావరి వరదల వరకు రాష్ట్రానికి సాయం అందించలేదన్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష అంటూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ ఇదేనా అని KTR … Read more

    వైభవంగా సాగుతున్న ఉజ్జయిని మహంకాళీ బోనాలు

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జాము నుంచి అతివలు బోనమెత్తి అమ్మవారి సన్నిధికి పోటెత్తారు. మంత్రి తలసాని దంపతులు తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత, కిషన్ రెడ్డి దంపతులు సహా అనేక మంది బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    చూస్తారా చీకటి వెలుగుల్లో భాగ్యనగర సోయగాలు

    హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక సొగసులను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అలాగే దాబాపై నిలుచుని విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న భాగ్యనగర అందాలను చూసి మురిసిపోని వారుండరు. అలాంటి సమయంలో పక్షిలా నగరమంతా వీక్షిస్తే ఎంత బాగుటుందో అని ఊహించుకుంటారు. అలా చేయలేకపోయినా ఆ సుందర దృశ్యాలను మాత్రం చూడొచ్చు. ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియోలో హైదరాబాద్ అందాలు మైమరచిపోయేలా చేస్తున్నాయి.

    ‘మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతాం’

    ప్రజా సమస్యల గురించి చర్చించకుండా TRS, BJP చిల్లర రాజకీయాలు చేస్తాన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు కట్టిన TRS, BJP ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని తొలిగించేందుకు వచ్చిన మా కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ కు బుద్ది ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ విజ్ఞత పాటించాల్సిన సందర్భంలో ఇలా చేయడమెంటన్నారు. మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతామని హెచ్చరించారు.

    Live: హైదరాబాద్లో ప్రారంభమైన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు

    హైదరాబాద్లో ప్రారంభమైన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలు రేపు మధ్యాహ్నం సెషన్లో ప్రధాని మోదీ, అమిత్ షా ప్రసంగాలు జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షతన సమావేశం పార్టీ బలోపేతంపై చర్చిస్తామని మోదీ ట్వీట్ రెండు రోజులపాటు జరగనున్న కార్యవర్గ సమావేశాలు రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ సమావేశం రేపు కూడా హైదరాబాద్లోనే ప్రధాని మోదీ

    TRS ఫ్లెక్సీలపై కేంద్ర మంత్రి ఆగ్రహం

    TRS ఫ్లెక్సీల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం TRS కావాలనే అహంకారంగా వ్యవహరిస్తుందని వెల్లడి మా పార్టీ మీటింగ్ ఉంటే రెచ్చగొట్టే విధంగా TRS ఫ్లెక్సీలు పెట్టిందని వెల్లడి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తుందన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తుందని మండిపాటు ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా అడ్డుకోవడం ఎక్కడా చూడలేదని వెల్లడి TRSను కుకటి వెళ్లతో సహా పెకిలిస్తామన్న కిషన్ రెడ్డి