• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి పదవి కోసం లక్ష్మీ పార్వతి వడ్డాణం అడిగారు: ఎర్రబెల్లి

    తెరాస మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఒకప్పు తెదేపా నేత. ఎన్టీఆర్‌కు చాలా సన్నిహితుడిగా ఉండేవారు. అయితే గతంలో తనకు ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇస్తానని చెప్పినపుడు లక్ష్మీపార్వతి వడ్డాణం అడిగారని చెప్పారు. ‘ మా పెళ్లికి వ్యతిరేకించినా నీకు మంత్రి పదవి ఇప్పిస్తున్నాను. నాకు వడ్డాణం కొనివ్వాలి’ అని లక్ష్మీ పార్వతి చెప్పారని ఇటీవల ఓపెన్‌ హార్ట్‌ విత్‌ RK కార్యక్రమంలో ఎర్రబెల్లి పంచుకున్నారు.

    బండి సంజయ్ చెప్పులు ఇవ్వడంపై KTR తీవ్ర వ్యాఖ్య

    కేంద్ర హోమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించడంపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ చెప్పులు మోసే నాయకులను తెలంగాణ గమనిస్తుందని వ్యాఖ్యనించారు. మరోవైపు గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని TRS నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. ఆక్రమంలో గుడి బయట షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రేపిస్టులు మరణించే వరకు జైల్లోనే ఉండాలి: కేటీఆర్

    జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారన్న దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులు అరెస్టైన 45 రోజుల తర్వాత తెలంగాణ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. జువెనైల్ యాక్ట్, IPC & CrPCలో లొసుగుల కారణంగా రేపిస్టులు బెయిల్‌పై వచ్చారన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో 11 మంది రేపిస్టుల విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ … Read more

    గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు

    ఫ్రీడమ్ ర్యాలీలో గన్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్‌తో కాల్చడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోలీసులకు చెందిన వెపన్‌తో మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేంటని మండిపడుతున్నారు. [వీడియో](url) Trs minister open fire during tiranga rally,police behaving like audience and applauding.will @TelanganaDGP take any action or rules are only for common people.#SrinivasGoud pic.twitter.com/Id5yGyDy3b — Raghav … Read more

    లక్ష కెమెరాల స్క్రీన్ ను ప్రారంభిస్తున్న కేసీఆర్

    హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ తెలంగాణ పోలీసింగ్ కు తలమానికంగా నిలవనుంది. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాల విజువల్స్ చూడగలిగే వాల్ అందుబాటులో ఉంటుంది. 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్ అంటే 30 పెటాబైట్ల స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి మూలనూ ఒక్క చోటు నుంచి పర్యవేక్షించే సదుపాయం రాబోతోంది.

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి. ఆర్డర్ … Read more

    హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వాన?

    హైదరాబాద్ లో మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో ) మౌలాలి 12.8 చర్లపల్లి 4.5 బాలానగర్ 3.8 హయత్ నగర్ 3.8 నేరేడ్ మెట్ 7.3 అల్వాల్ 4.88 మల్కాజ్ గిరి 5.12 ఫతే నగర్ 5.12 తిరుమలగిరి 4.3 బేగంపేట్ 3.5

    లీగల్ ప్రకారమే క్యాసినో నిర్వహించా: చికోటీ ప్రవీణ్

    నేపాల్, గోవాలో క్యాసినో లిగల్ అని చికోటీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తానేం తప్పు చేయలేదన్నారు. క్యాసినో బిజినెస్ చట్ట ప్రకారం చేస్తుండగా ఈడీ రైడ్ చేసిందన్నారు. ఈడీ విచారణలో పాల్గొన్న తర్వాత ఈ మేరకు వెల్లడించారు. సోమవారం మళ్లీ విచారణకు రావాలని చెప్పినట్లు పేర్కొన్నారు. మనీలాండరింగ్ అంటు నోటీస్ ఇచ్చిన వారికి జవాబు ఇస్తామన్నారు. హైదరాబాద్ క్యాసినో కేసులో ఈడీ దాడులు నిర్వహించి.. ప్రవీణ్ కస్టమర్లుగా రాజకీయ నాయకులున్నట్లు చెబుతోంది.

    అర్బన్ ఫారెస్టులో హైదరాబాద్ సిటీ సరికొత్త రికార్డు

    హైదరాబాద్లో ఏ మెట్రో సిటీలో లేనంత దట్టమైన అర్బన్ పారెస్ట్ ఇక్కడ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ అటవీ విస్తీర్ణం గత కొన్నేళ్లుగా 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చ.కిలోమీటర్లకు (147%) పెరిగిందని వెల్లడించారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మరో 6 అర్బన్ పార్కులను ప్రారంభించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. HMDA పరిధిలో 60 వేల ఎకరాల్లో 59 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. Perhaps, no other metro has such … Read more

    ఈ మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ అంకిత‌భావాన్ని మెచ్చుకోవాల్సిందే!

    తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ PHCలోని కుదురుముల్ల వద్ద ఒక మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ కోవిడ్ వ్యాక్సినేష‌న్ అందించేందుకు మోకాళ్ల లోతు నీటిలో న‌డుచుకుంటూ వెళ్ల‌డం క‌నిపించింది. మా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అడ్డంకుల‌ను దాటుకొని ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని చెప్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఆమె అంకిత‌భావాన్ని మెచ్చుకుంటూ పోస్టు పెట్టింది. వీడియో చూసేందుకు … Read more