Live: HYD ఎన్టీఆర్ స్టేడియంలో ఆత్మీయ సభ షురూ
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సహా సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సభకు గిరిజనులు, ఆదివాసీలు పెద్దఎత్తున తరలివచ్చారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సహా సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సభకు గిరిజనులు, ఆదివాసీలు పెద్దఎత్తున తరలివచ్చారు.
సూర్యపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలీపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ నాయకులను పొగడటం ఏంటని విమర్శించారు. ‘సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు. సీఎం కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఎమౌతాడో’ అని ఎద్దేవా చేశారు. ఈరోజు సూర్యపేటలో జరిగిన తెలంగాణ సమైక్యత దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డిని బాహుబలి అంటూ ఎస్పీ ప్రశంసించారు. జయహో.. జగదీశ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.
విధి నిర్వహణలోనే కాకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడటంలోనూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుంటారు. తాజాగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి సజీవ అవయవాలను ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తికి ఊపిరితిత్తులు అవసరం కాగా, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి నుంచి బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఈ పని పూర్తి చేశారు. దీంతో పోలీసుల పనితీరును స్థానికులు కొనియాడుతున్నారు. గ్రేట్ కదూ. #HYDTPweCareForU Today @HYDTP in Coordination with @CYBTRAFFIC provided a Green channel for transportation … Read more
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వాటిని కేంద్రమంత్రి ప్రారంభించగా, ఎంపీ తన నియోజకవర్గానికి చాలా పెద్ద పని చేశారని తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకురావడంలో కిషన్ రెడ్డి గొప్ప విజయం సాధించారని దుయ్యబట్టారు. చివరగా కిషన్ రెడ్డి అన్నా వెల్ డన్ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. The 3 … Read more
కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలైన ఫాసిస్ట్ కేసీఆర్ యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతున్నారన్నారని గుర్తుచేశారు. ఈటెల రాజేందర్ ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంగా తొలుత కేసీఆర్ ఆదర్శంగా మాట్లాడాలని హితవు పలికారు. మోదీని గద్దె దించడం కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎంపీ సీట్లను కూడా ప్రజలు ఊడ్చేస్తారని జోష్యం చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ ని పాటించట్లేదని విమర్శించారు.
విద్యుత్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు చర్చించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా బిల్లులో లేదని ఆయన స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పే ఆలోచన తమ పార్టీకి లేదని రఘునందన్ చెప్పారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రం చెప్పలేదన్నారు. రాష్ట్రం అందించే సబ్సిడీలను కేంద్రం ఎత్తేయాలన్న ఆరోపణ తప్పని ఎమ్మెల్యే చెప్పారు. అంతకుముందు ఈ బిల్లుపై బాల్క సుమన్ చర్చకు లేవనెత్తారు.
గణపయ్యకు 9 రోజుల పూజల అనంతరం బాలాపూర్ బంగారు లడ్డూ వేలం జరుగుతోంది. 21 కిలోల లడ్డూ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు.
హైదరాబాద్‌లోని ORR వెంబడి సోలార్ రూఫ్‌తో కూడిన ప్రపంచ స్థాయి సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. 2023 సమ్మర్ నాటికి ఈ ట్రాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇది సోలార్ రూఫ్ టాప్డ్, CCTV నిఘా సహా భద్రతా ఫీచర్లతో 24/7 పని చేస్తుందని ఓ డెమో వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది నానక్‌రామ్‌గూడ-TSPA & నార్సింగి-కొల్లూరు … Read more
TS: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ చేయనున్నారు. ఈ సారి ఖైరతాబాద్‌లో తొలిసారిగా 50 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహం ప్రతిష్టించారు. మహాగణపతి కొలువు దీరిన నేపథ్యంలో నేటి నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ‘సండే ఫన్‌డే’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవని వారి కోసం తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ వీడియోను షేర్ చేసింది. సండే ఫన్‌డే మిస్ అయిన వారు ఈ వీడియో చూసుకోవచ్చని తెలిపింది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. For those of you who couldn't make it to yesterday's #SundayFunday at TankBund, here's a glimpse of the fun & excitement … Read more