• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 8ఏళ్లలో HYDలో నిర్మించిన ప్లైఓవర్లు ఇవే

    హైదరాబాద్‌లో కీలకమైన నాగోల్ ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 8 ఏళ్లలో హైదరాబాద్‌లో నిర్మించిన ప్లైఓవర్లను, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లను [వీడియో](url) రూపంలో తెలంగాణ డిజిటల్ వింగ్ పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా నిర్మిస్తోంది. వీడియోలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎల్బీనగర్ ప్లైఓవర్, మైండ్‌స్పేస్ ప్లైఓవర్, JNTUH ఓవర్లు కనిపించాయి. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, … Read more

    దీపావళి సంబరాల్లో 41 మందికి గాయాలు

    దీపావళి సంబరాల్లో పలువురి విషాదాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో టపాసుల కారణంగా గాయపడిన వారి సంఖ్య 41కి చేరింది. బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 41 మందిలో 19 మందికి చికిత్స అందించి పంపించారు. మిగతా వారందరూ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి వైద్యులు కంటి ఆపరేషన్‌ పూర్తిచేశారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more

    దీపావళి వేడుకల్లో 24 మందికి గాయాలు

    తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగిప్పటికీ అక్కడక్కడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 24 మంది గాయపడ్డారు. కళ్లకు గాయాలతో సరోజినీ కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more

    ఆహ్లాదం.. ఈ లొకేషన్ ఎక్కడబ్బా?

    HYD: నిత్యం రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే భాగ్యనగరం.. చిరుజల్లులతో కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. ఉదయం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షానికి రోడ్లన్నీ తడిసిపోయాయి. ఈ జల్లుల నడుమ మెట్రో రైలు పరుగులను చూస్తుంటే మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ‘వర్షం పడుతోంది.. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి’ అంటూ వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి.. లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయండి. #HYDTPinfo It's drizzling/raining.Please drive … Read more

    LIVE: బండి సంజయ్ ప్రెస్‌మీట్

    కేసీఆర్ జాతీయ పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని.. రాజీనామా చేసి BRSనుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో చెప్పాలన్నారు. ఈ పార్టీకి జెండా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారని.. ఇప్పుడు కేసీఆర్ పర్యాటకుడిగా మారారని విమర్శించారు. కుట్రలతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

    LIVE: బతుకమ్మ వేడుకలు

    తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెద్దఎత్తున బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. భారీగా తరలి వచ్చిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడుతున్నారు. https://youtube.com/watch?v=l54nCF4KWNA

    హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

    హైదరాబాద్‌లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రెండు గంటల్లో ఏకంగా 10 సెం.మీల వాన కురిసింది. మరో రెండు గంటలపాటు ఎవరూ బయటికి రావొద్దని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. PVR, డీ మార్ట్‌, యశోద హాస్పిటల్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌, చాదర్‌ఘాట్ రోటరీ వద్ద వరదనీటి కారణంగా ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోందని తెలిపారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లకుంటే తీవ్ర ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై … Read more

    ‘కేసీఆర్ ఫ్యామిలీ వల్లే HCAలో గందరగోళం’

    కేసీఆర్ ఫ్యామిలీ వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని బీజేపీ నేత వివేక్ వెంటకస్వామి ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను HCA అధ్యక్షురాలిగా చేసేందుకు KCR ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇండియా, ఆస్ట్రేలియా 3వ టీ20 మ్యాచుకు ఇప్పటివరకు ఎన్ని టిక్కెట్లు సేల్ చేశారో క్లారిటీ లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. KTR, కవిత ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ అసోసియేషన్‌కు ఎంపిక కావాలని చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉంటానంటే కేటీఆర్ మీకెందుకు HCA, పోటీ … Read more

    జింఖానా స్టేడియం వద్ద పోలీసుల లాఠీ ఛార్జ్ వీడియో

    హైదరాబాద్ జింఖానా స్టేడియం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్ల కోసం వచ్చిన క్రీడాభిమానులపై పోలీసులు పెద్ద ఎత్తున లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు అభిమానులను చెదరగొడుతున్న [వీడియోను](url) మీరు కూడా చూడండి. ఇప్పటికే ఈ తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందగా, స్పృహతప్పి పడిపోయిన మరో 20 మందిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. టిక్కెట్ల కోసం పలువురు అర్ధరాత్రి 2 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్నామని చెబుతున్నారు. This is so disappointing. Passionated fans gathered at … Read more

    త్వరలో 3 నిర్మాణాలు KCRచే ప్రారంభం

    తెలంగాణ కొత్త సచివాలయ భవనం పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌లో 3 మెగా ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయం పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి కాగా, డోమ్, చుట్టూ ప్రహారి గోడ వంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ మూడు నిర్మాణాల్లో.. 1. అంబేద్కర్ పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ 2. తెలంగాణ అమరవీరుల స్మారకం 3. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం The New Secretariat building of … Read more