• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను నెగెటివ్‌గా చూడొద్దు: నవీన్‌ రెడ్డి

    [VIDEO](url):మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డి పోలీసులకు అరెస్ట్‌ అయ్యేముందు సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. డెంటల్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ వ్యవహారంలో తనను నెగెటివ్‌గా చూడొద్దని విన్నవించాడు. తన స్థానంలో ఓ అమ్మాయి ఉంటే సమాజం, మీడియా ఇలాగే వ్యవహరించేదా అని ప్రశ్నించాడు. ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య అని, అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యవహారంగా చూడొద్దని విన్నవించాడు. కిడ్నాప్‌ చేయడం తప్పే గానీ తప్పలేదని చెప్పుకొచ్చాడు. చేసింది తప్పే కానీ..: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌ రెడ్డి సెల్ఫీ … Read more

    ఆకాశంలో వింత చివరకు?

    హైదరాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ఆకాశంలో అంతుచిక్కని తెల్లని రంగులో వస్తువు తిరుగుతూ కనిపించింది. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో[ వైరల్‌ ](url)అయ్యింది. ఏదో ఉపగ్రహం అని కొందరు, ఏలియన్ తిరుగుతందని మరికొందరూ ప్రచారం చేశారు. అయితే..అది కేవలం ఓ హీలియం బెలూన్‌ అని ప్లానేటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు నేషనల్‌ బెలూన్ ఫెసిలిటీ పంపినట్లు వెల్లడించారు. Update For Curious Hyderabadis ? It's An Atmosphere Research Balloon Sent By … Read more

    ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    [VIDEO](url):హైదరాబాద్‌లో YSRTC అధినేత్రి షర్మిల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న షర్మిల కారుపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై నిరసనగా ఆమె ఇవాళ అదే కారులో ప్రగతిభవన్‌ వైపు బయల్దేరారు. సోమాజిగూడ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను కారు దిగాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో కారును అలాగే టోవింగ్‌ బండికి కట్టి లాక్కెళ్లారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక ఆమెను బలవంతంగా కారులోంచి దింపి స్టేషన్‌లోకి తరలించారు. #WATCH | Hyderabad: Police drags away the … Read more

    నన్ను చంపుతారంటా: తెరాస కార్పొరేటర్

    హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తనను అసభ్యంగా తిడుతూ చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. బీసీ మహిళనైన తనను చెప్పుకోలేని విధంగా తిడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 10 వేలు ఇచ్చి రౌడీలు, గుండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. కుషాయిగూడలో మోడల్ దోబీ ఘాట్ ను తనను పిలవకుండానే ప్రారంభించారని తెలిపారు.

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు. #TRS cadre attack the #BJP MP Aravind's residence at #Hyderabad and not him. Sorry!!!#Telangana https://t.co/Avbq9BQwf3 — Sagar KV ?  … Read more

    బొంగులో చికెన్ వండిన రాహుల్ గాంధీ

    తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఓ ఆసక్తికరమైన [వీడియో](url)ను టీ కాంగ్రెస్ విడుదల చేసింది.పాదయాత్ర సమయంలో రాహుల్ గాంధీతో గడపిన మధుర క్షణాలను వీడియోరూపంలో పంచుకున్నారు. జోడో యాత్ర సందర్భంగా భద్రాచలంలోని గిరిజనులతో కలిసిన రాహుల్‌గాంధీ.. బొంగులో చికెన్‌ వండారు. స్వయంగా తన చేతులతో చికెన్కు మసాలా దట్టించి బొంగుల్లో పెట్టి వాటిని మంటపై కాల్చారు. బొంగులో చికెక్‌ను స్వయంగా గిరిజనులు, పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలో జరిగిన … Read more

    గమనిక.. ఈ 4 రోజులు అటు వెళ్లకండి

    [VIDEO:](url) దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ ప్రిక్స్ కారు రేసింగ్ నిర్వహిస్తుండటంతో ట్రాక్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ 2.7కి.మీ. పొడవైన ట్రాక్ సిద్ధమైంది. అయితే, ఈ నెల 19, 20న తొలి విడత ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 10, 11న రెండో విడత ట్రయల్ చేపట్టనున్నారు. ఈ నాలుగు రోజులు ఎన్టీఆర్ మార్గ్‌ని మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ట్రయల్ రన్‌ని వీక్షించేందుకు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వీక్షకులకు స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. As … Read more

    ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం … Read more

    తెలంగాణ భవన్‌లో సంబరాలు

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు ముగియగా టీఆర్ఎస్ మెజారిటీతో దూసుకెళ్తోంది. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. Another 90k votes to be counted still. Will anything … Read more